10
September, 2026

A News 365Times Venture

10
Thursday
September, 2026

A News 365Times Venture

TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..

Date:

తెలంగాణలో కానిస్టేబుల్, తత్సమాన పోస్టుల అభ్యర్థులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం , తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) విభాగాల్లోని కానిస్టేబుల్ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని మరో 3 సంవత్సరాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పెంచిన 7 సంవత్సరాల వయోపరిమితికి అదనంగా ఈ 3 ఏళ్లను కలపడంతో.. మొత్తం 10 సంవత్సరాల వయోసడలింపు లభించినట్లయింది. సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల మధ్య ఉన్న వయోపరిమితి వ్యత్యాసాన్ని సరిచేయాలన్న అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు కాగా, ప్రభుత్వ తాజా సడలింపులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 34+3 మొత్తం 37 సంవత్సరాలకు చేరింది. గతంలో 7 ఏళ్ల వయో పరిమితి పెంపుతో జనరల్ అభ్యర్థులు 29 ఏళ్ల వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉండేది.. ఇప్పుడు తాజా పెంపుతో 32 ఏళ్ల వయస్సు వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఎస్సై ఉద్యోగాలకు గతంలో పెంచిన వయో సడలింపు కారణంగా 37 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. తాజాగా వీరికి ఎలాంటి పెంపు ఇవ్వలేదు.

దీనికితోడు.. సెప్టెంబర్ 9వ తేదీతో ముగియాల్సిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ గడువును పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించిన విషయం తెలిసిందే. వయోపరిమితి పెంపు నిర్ణయంతో కొత్తగా వేలాది మంది నిరుద్యోగ యువతకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభించడమే కాకుండా, సాంకేతిక ఇబ్బందులు లేకుండా ముగింపు తేదీకి ముందే దరఖాస్తులు పూర్తి చేసుకోవడానికి ఈ గడువు పొడిగింపు ఎంతో దోహదపడుతుంది. అభ్యర్థులు పెంచిన వయోపరిమితి సడలింపులను పరిశీలించి, అధికారిక వెబ్‌సైట్ ద్వారా సెప్టెంబర్ 16లోగా తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..

Sweet Atukulu Recipe: పండుగలు, విశేష పూజా దినాల్లో దేవుడికి నైవేద్యం...

ಸಚಿವ ಸತೀಶ್ ಜಾರಕಿಹೊಳಿಗೆ ಇಡಿ ಶಾಕ್: ಮನೆ, ಕಚೇರಿ ಸೇರಿ 18 ಕಡೆಗಳಲ್ಲಿ ದಾಳಿ, ಪರಿಶೀಲನೆ

ಬೆಂಗಳೂರು,ಸೆಪ್ಟಂಬರ್,9,2026 (www.justkannada.in):  ಲೋಕೋಪಯೋಗಿ ಸಚಿವ ಸತೀಶ್​ ಜಾರಕಿಹೊಳಿ ಅವರಿಗೆ ಜಾರಿ...

തമ്പി വിജയ്; നിങ്ങള്‍ക്ക് ചരിത്രം തിരുത്താനാവില്ല: റീല്‍സും ഫോട്ടോഷൂട്ടും നടത്തലല്ല ഭരണം: എം.കെ സ്റ്റാലിന്‍

ചെന്നൈ: തമിഴ്‌നാട് മുഖ്യമന്ത്രി വിജയ്ക്ക് മറുപടിയുമായി ഡി.എം.കെ മേധാവിയും മുന്‍ മുഖ്യമന്ത്രിയുമായ...

'வி.எஸ்.பாபுவுக்கு சுவாசக்கருவி உதவியுடன் சிகிச்சை; லைனுக்கு வந்த சி.எம் விஜய்!' – முழு தகவல்

கொளத்தூர் தவெக எம்.எல்.ஏ வி.எஸ்.பாபு திடீர் உடல்நலக்குறைவால் மருத்துவமனையில் அவசர சிகிச்சைப்...