9
September, 2026

A News 365Times Venture

9
Wednesday
September, 2026

A News 365Times Venture

Ishan Kishan: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బౌలర్లను ‘శత’కొట్టిన ఇషాన్..

Date:

దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ తొలి రోజున ఈస్ట్ జోన్ జట్టు భారీ స్కోరు సాధించి బలమైన స్థితిలో నిలిచింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన శతకంతో చెలరేగడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ 4 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్‌కు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 37 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేసి, అర్ధశతకం చేసే అవకాశాన్ని తృప్తిలో చేజార్చుకున్నాడు. చామా మిలింద్ బౌలింగ్‌లో వైభవ్ అవుటైనప్పటికీ తన అటాకింగ్ బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. అనంతరం మైదానంలో అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ కనిపించడం విశేషం.

అభిమన్యు ఈశ్వరన్ (72) బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు మంచి పునాది వేశారు. అనంతరం వచ్చిన శిఖర్ మోహన్ (85) నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఒక దశలో 147 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఈస్ట్ జోన్ కొంత కష్టాల్లో పడగా, ఇషాన్ కిషన్, శిఖర్ మోహన్ నాలుగో వికెట్‌కు 94 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ మ్యాచ్ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 4,000 పరుగులు పూర్తి చేసిన ఇషాన్ కిషన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 71 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న ఇషాన్, తర్వాతి 50 బంతుల్లోనే ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 10వ సెంచరీని అందుకున్నాడు. ప్రస్తుతం 111 పరుగులతో ఇషాన్ నాటౌట్‌గా ఉన్నాడు.

శిఖర్ మోహన్ అవుటైన తర్వాత, మరో వికెట్ పడకుండా కిషన్, కుమార్ కుషాగ్రా (63 నాటౌట్) కలిసి జాగ్రత్తగా ఆడారు. ఐదో వికెట్‌కు వీరిద్దరూ ఇప్పటికే 144 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇషాన్ కిషన్ 135 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 133 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించాడు. సౌత్ జోన్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఈస్ట్ జోన్ తొలి రోజే పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വഖഫ് ബോര്‍ഡ്: ഇടത് സര്‍ക്കാരിന്റെ മൂന്ന് വീഴ്ചകള്‍ പ്രശ്‌നമായി; അവര്‍ തെറ്റിധാരണ പടര്‍ത്തുന്നു: നാസര്‍ ഫൈസി കൂടത്തായി

കോഴിക്കോട്‌: വഖഫ് ബോര്‍ഡ് ഭേദഗതിയെ ചെറുക്കാനുള്ള അവസരങ്ങള്‍ കഴിഞ്ഞ എല്‍.ഡി.എഫ് സര്‍ക്കാര്‍...

‘அதுவே பழகிடும்’ ஹார்முஸ் நீர்ச்சந்தி மூடலைப் பழகிக்கொண்ட உலக நாடுகள்; இப்போது எப்படி சமாளிக்கின்றன?

அமெரிக்காவும், இஸ்ரேலும் நவீன ஆயுதங்கள், தொழில்நுட்பம் மிகுந்த ஏவுகணைகளை வைத்து, ஈரானை...

Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఢిల్లీ జంతర్‌మంతర్‌లో జరిగిన విద్యార్థుల నిరసనలకు సంబంధించి గౌతమ్ బుద్ధ యూనివర్సిటీకి...

ರೈತರ ವಿಮೆ ಹಣ ಕಟ್ಟದ, ಸೊಸೈಟಿ ಕಾರ್ಯದರ್ಶಿ ವಜಾಕ್ಕೆ ಸಿಎಂ ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಸೂಚನೆ

ಬೆಂಗಳೂರು, ಸೆಪ್ಟಂಬರ್, 08,2026 (www.justkannada.in): ಬೆಳಗಾವಿಯ ಜೇವರ್ಗಿ ತಾಲ್ಲೂಕಿನ ಇಟ್ಟನಹಳ್ಳಿ...