8
September, 2026

A News 365Times Venture

8
Tuesday
September, 2026

A News 365Times Venture

India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్

Date:

చమురు నిక్షేపాలు లేవు, విదేశాల నుంచే భారత్ చమురు దిగుమతి చేసుకుంటుంది. అయినా కూడా భారత్ యూరప్‌కు పెద్ద ఎత్తున డీజిల్ ఎగుమతి చేస్తుండటం విశేషం. రష్యా, అమెరికా నుంచి యూరప్‌కు డీజిల్ ఎగుమతులు తగ్గాయి. ఇప్పుడు ఈ రెండు దేశాలను దాటి యూరప్‌కు డీజిల్ అందించే కీలక శక్తిగా భారత్ ఎదిగింది. ఆగస్టులో బాబ్ ఎల్-మండేబ్ జలసంధి మీదుగా యూరప్‌కు వెళ్లిన డీజిల్‌లో సుమారు 60 శాతం భారత్ నుంచే వచ్చినట్లు Vortexa డేటా వెల్లడించింది. ఆగస్టులో యూరప్‌కు సుమారు 2 లక్షల బ్యారెళ్ల డీజిల్ సరఫరా అయ్యింది.

యూరప్‌కు ఒకప్పుడు రష్యా అతిపెద్ద, కీలక డీజిల్ సరఫరాదారుగా ఉండేది. ఉక్రెయిన్ యుద్ధం, రష్యాపై ఆంక్షలతో యూరప్‌కు వెళ్లే చమురు రవాణా తగ్గింది. ఆగస్టు తొలి 25 రోజుల్లో రష్యా సముద్ర మార్గ డీజిల్, గ్యాసోలిన్ ఎగుమతులు రోజుకు సగటున 1.5 లక్షల బ్యారెళ్లకు పడిపోయింది. గతేడాదితో పోలిస్తే ఇది రోజుకు సుమారు 6.1 లక్షల బ్యారెళ్ల తగ్గుదల. ఐడేళ్లలో ఇది సగటున 81 శాతం క్షీణించినట్లు. రష్యాలోని రిఫైనరీలు, ఎక్స్‌పోర్ట్ ఫెసిలిటీలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తుండటంతో సరఫరా ప్రభావితమవుతోంది. జూలై, ఆగస్టు నెలల్లో రష్యాపై 32 డ్రోన్ దాడులు జరిగినట్లు డేటా వెల్లడించింది.

ఇక యూరప్‌కు మరో కీలక సరఫరాదారుగా ఉన్న అమెరికా నుంచి ఆగస్టు ద్వితీయార్థంలో ఎగుమతులు తగ్గాయి.గస్టు తొలి అర్ధభాగంలో రోజుకు దాదాపు 5.4 లక్షల బ్యారెళ్ల స్థాయిలో ఉన్న అమెరికా సరఫరాలు, రెండో అర్ధభాగంలో సుమారు 3.5 లక్షల బ్యారెళ్లకు పడిపోయాయి. అంటే దాదాపు 35 శాతం తగ్గుదల నమోదైంది. దీంతో రష్యా, అమెరికా సరఫరాల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి భారత రిఫైనరీలు పనిచేస్తున్నాయి.

భారత్‌కు అందివచ్చిన అవకాశం:

భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రిఫైనరీగా ఉంది. దేశ రిఫైనరీ సామర్థ్యం ఏడాదికి 258.1 మిలియన్ టన్నులు. ఇది దేశీయ అవసరాల కన్నా ఎక్కువ. దీని వల్లే ఇతర దేశాలకు భారత్ పెట్రోలియం ఉత్పత్తుల్ని ఎగుమతి చేయగలుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ 61.5 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసింది. రష్యా ఎగుమతుల్లో అంతరాయాలు, హార్ముజ్ మార్గంలో పరిమిత రవాణా, అమెరికా సరఫరా తగ్గడం వంటివి భారత్‌కు కలిసి వస్తు్ననాయి. యూరప్‌లో శీతాకాల డిమాండ్ పెరుగుతున్న సమయంలో యూరప్ ఇంధన నిల్వలు కూడా తక్కువ స్థాయిలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో భారత రిఫైనరీలపై యూరప్ ఆధారపడే పరిస్థితి ఏర్పడింది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Saudi Houthi Attack: సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. పాకిస్తాన్, టర్కీ ఏం చేస్తాయి.?

Saudi Houthi Attack: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్...

ವಿದ್ಯುತ್ ನಿಗಮಕ್ಕೆ ಆರ್ಥಿಕ ನಷ್ಟ ಆರೋಪ: ನಾಲ್ವರು ಸಿಬ್ಬಂದಿ ಅಮಾನತು

ಮೈಸೂರು,ಸೆಪ್ಟಂಬರ್,8,2026 (www.justkannada.in):  ಚಾಮುಂಡೇಶ್ವರಿ ವಿದ್ಯುತ್ ಸರಬರಾಜು ನಿಗಮದ (ಚಾವಿಸನಿನಿ) ಎನ್.ಆರ್.ಮೊಹಲ್ಲಾ...

എ.എഫ്.ഡിയുടെ തെരഞ്ഞെടുപ്പ് മുന്നേറ്റം ആശങ്കാകരം; ജര്‍മനി വീണ്ടും തീവ്ര വലതിന്റെ കയ്യിലേക്കെന്ന് യൂറോപ്യന്‍ നേതാക്കള്‍

പാരീസ്: ജര്‍മനിയിലെ സാക്സോണി-അന്‍ഹാള്‍ട്ട് സംസ്ഥാന തെരഞ്ഞെടുപ്പില്‍ തീവ്ര വലതുപക്ഷ പാര്‍ട്ടിയായ ആള്‍ട്ടര്‍നേറ്റീവ്...

"மூன்று கோப்புகள் இருப்பதாக முதல்வர் சொன்னார், ஏன் அதைப் பற்றி பேசவில்லை? சம்மந்தமே.!" – பெ.சண்முகம்

மார்க்சிஸ்ட் கம்யூனிஸ்ட் கட்சியின் மாநில செயலாளர் பெ.சண்முகம் சட்டமன்ற செயல்பாடுகள் குறித்து...