7
September, 2026

A News 365Times Venture

7
Monday
September, 2026

A News 365Times Venture

Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!

Date:

Madanapalle Lady Don Koneti Sulochana House Raided: మదనపల్లెలో ‘లేడీ డాన్‌’గా పేరొందిన కోనేటి సులోచన ఇంట్లో పోలీసులు మెరుపు సోదాలు నిర్వహించారు. కోర్టు సెర్చ్‌ వారెంట్‌తో మూడు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సులోచన నివాసంతో పాటు ఆమె సోదరుడు శ్రీనివాసులు ఇంట్లోనూ తనిఖీలు చేపట్టాయి. సోదాల్లో 50 రకాల ఆస్తి పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో ఉన్న 15 ఖాళీ బాండ్‌ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పులు ఇచ్చినట్లు నమ్మించి అమాయకుల నుంచి ఖాళీ బాండ్లపై సంతకాలు తీసుకుని.. వాటి ఆధారంగా ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

సులోచన ఇంట్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి పంపి పరిశీలించనున్నారు. మరోవైపు మాజీ మంత్రి ముఖ్య అనుచరుడితో కలిసి వందల కోట్ల విలువైన భూముల వ్యవహారంలో సులోచన కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. బండకమ్మమీదపల్లెలో రూ.60 కోట్ల విలువైన స్థలం, భవనం.. పొన్నూటిపాళ్యంలో 1.75 ఎకరాల భూమి ఆమె పేరుతో ఉన్నట్లు రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఫోర్జరీ పవర్‌ ఆఫ్‌ అటార్నీతో రూ.10 కోట్ల విలువైన 47 సెంట్ల భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు.

అయితే సోదాలు జరుగుతున్న సమయంలో కోనేటి సులోచన ఇంట్లో లేరు. ఆమె ప్రస్తుతం విజయవాడలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు మార్పు వెంకటేష్‌ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కోర్టు సెర్చ్‌ వారెంట్‌తో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సులోచనపై 14 క్రిమినల్‌ కేసులు, రౌడీషీట్‌ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. భూముల వ్యవహారానికి సంబంధించిన పత్రాలు.. ఫోర్జరీ సంతకాలపై ఫోరెన్సిక్‌ నివేదిక.. ఈ కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഹോർമുസിൽ പുതിയ കപ്പൽച്ചാലും നിയന്ത്രണങ്ങളും പ്രഖ്യാപിക്കാൻ ഇറാൻ; യു.എസ് സംഘർഷം രൂക്ഷമാകുന്നു

ടെഹ്‌റാൻ: ഹോർമുസ് കടലിടുക്കിന് സമീപം പ്രവേശന നിയന്ത്രിത മേഖല ഏർപ്പെടുത്തുമെന്നും ഒമാനുമായി...

முதல்வர் உரை: "பதிலற்ற பதிலுரை; Prepare well next time.!" – உதயநிதி விமர்சனம்

மூன்று நாள் விடுமுறைக்கு பிறகு தமிழக சட்டமன்றம் இன்று கூடியிருக்கிறது. காவல்துறை,...

Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..

దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన...

നക്‌സലേറ്റുകളെ വെടിവെച്ച് കൊല്ലുകയല്ല നിയമത്തിന്റെ പാതയിലേക്ക് കൊണ്ട് വരികയാണ് വേണ്ടത്: രമേശ് ചെന്നിത്തല

കോഴിക്കോട്: നക്‌സലേറ്റുകളെ വെടിവെച്ച് കൊല്ലുകയല്ല നിയമത്തിന്റെ വഴിയിലേക്ക് കൊണ്ട് വരികയാണ് ചെയ്യേണ്ടതെന്ന്...