30
August, 2026

A News 365Times Venture

30
Sunday
August, 2026

A News 365Times Venture

Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..

Date:

Ukraine War:  ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. కీవ్ సమీపంలోని బుచా జిల్లాలో 27 మంది మరణించారు. ఈ దాడుల్లో 50 ఇళ్లు దెబ్బతిన్నాయని స్థానిక అధికారులు తెలిపారు. దాడుల కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగిందని, పలుచోట్ల నివాసాలు దెబ్బతిన్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ.. మైలా గ్రామంలోని ఓ గోదాముపై దాడి జరిగిందని, తర్వాత భారీ పేలుడు సంభవించిందని తెలిపారు. అయితే, ఆ ప్రాంతంలో ఎలాంటి పేలుడు సామాగ్రి ఉంచారనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. నివాస ప్రాంతాల్లో మందుగుండు సామాగ్రి చేయడంపై నిల్వ సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు చెప్పారు. ఇప్పటికే 370 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

వరసగా మూడు రోజుల నుంచి కీవ్‌ను రష్యా టార్గెట్ చేస్తోంది. రాజధాని ప్రాంతంపై రష్యా నిరంతరం వైమానిక దాడులు చేస్తోంది. దీంతో నగరంలో జనజీవితం అస్తవ్యస్తమైంది. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. రష్యా, ఉక్రెయిన్‌లో ఇటీవల కాలంలో ఒకరిపై ఒకరు భారీ దాడులకు పాల్పడుతున్నారు. దీంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ యుద్ధం ప్రారంభమై నాలుగున్నరేళ్లు దాటినప్పటికీ, ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

നേപ്പാളിലെ പ്രളയക്കെടുതി; 275 ഇന്ത്യക്കാരെ കാണാനില്ല: രക്ഷാപ്രവര്‍ത്തനം തുടരുന്നു

കാഠ്മണ്ഡു: നേപ്പാളിലുണ്ടായ കനത്ത മിന്നല്‍ പ്രളയത്തില്‍ 275 ഇന്ത്യക്കാരെ ഇപ്പോഴും കണ്ടെത്താന്‍...

ஸ்டாலின் பாதுகாப்பு Z+-ல் இருந்து Z ஆக குறைப்பு; காரணம் என்ன?

தமிழ்நாட்டின் முன்னாள் முதலமைச்சர் மற்றும் திமுக தலைவர் ஸ்டாலினின் பாதுகாப்பு Z+...

ದಸರಾ ಆನೆಗಳ ವೀಕ್ಷಣೆಗೆ ಟಿಕೆಟ್ ಇಲ್ಲ: ಅರಣ್ಯ ಇಲಾಖೆ ಸ್ಪಷ್ಟನೆ

ಮೈಸೂರು,ಆಗಸ್ಟ್,29,2026 (www.justkannada.in):  2026ರ ದಸರಾ ಮಹೋತ್ಸವದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ದಸರಾ ಗಜಪಡೆ...

‘ഞാന്‍ മാധ്യമങ്ങളെ ഭീഷണിപ്പെടുത്തുന്നില്ല, പക്ഷേ അവര്‍ മാപ്പ് പറയണം, അല്ലെങ്കില്‍…’; ബംഗാളി പത്രത്തിനെതിരെ സുവേന്ദു

കൊല്‍ക്കത്ത: ജാദവ്പൂര്‍ സര്‍വകലാശാലയിലുണ്ടായ ഒരു അക്രമവുമായി ബന്ധപ്പെട്ട വാര്‍ത്തയില്‍ ‘കാവി ഗുണ്ടായിസം,’...