25
August, 2026

A News 365Times Venture

25
Tuesday
August, 2026

A News 365Times Venture

Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!

Date:

Bangladesh: వస్తే ఓ బాధ, రాకుంటే ఓ బాధ అన్నట్లు తయారైంది బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మన్ పరిస్థితి. భారత్ పర్యటనపై బంగ్లాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షేక్ హసీనాను అప్పగించిన తర్వాతే భారత్‌తో సంబంధాలు పెట్టుకోవాలని కొందరు డిమాండ్ చేస్తుంటే, మరికొందరు బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధితో పాటు నదీ జలాల అంశాలు భారత్‌తో ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు. ఆగస్టు మూడో వారంలో, బ్రిక్స్ సదస్సుకు ముందు ఆయన భారత్‌కు వస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన పర్యటనపై అధికారిక సమాచారం లేదు.

హసీనాను భారత్ నుంచి అప్పగించాలని బంగ్లాదేశ్ కోరుతోంది. తారిఖ్ రెహ్మాన్ పర్యటనకు రావాలంటే షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ షరతు విధిస్తోంది. ఇక నేషనల్ సిటిజన్స్ పార్టీ (NCP) వ్యవస్థాపక కన్వీనర్, హసీనాను అధికారంలో నుంచి తొలగించిన విద్యార్థి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన నాహిద్ ఇస్లాం షేక్ హసీనాను అప్పగించే వరకు భారత్‌తో దౌత్య సంబంధాలు పెట్టుకోవద్దని చెబుతున్నాడు. మరోవైపు, భారత విధానంపై బంగ్లాదేశ్ ప్రభుత్వంలోనే విభేదాలు కనిపిస్తున్నాయి. కొందరు హసీనాను అప్పగిస్తేనే భారత్‌తో సంబంధాలు అని చెబుతుంటే, మరికొందరు మాత్రం భారత్‌తో ఆచరణాత్మక సంబంధాలు అవసరమని భావిస్తున్నారు.

రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. తారిఖ్ రెహ్మాన్ భారత పర్యటనపై కఠిన వైఖరికి కేవలం విదేశాంగ విధానొం కారణంగా కాదని, దేశంలోని రాజకీయ లెక్కలు కూడా కారణమని చెబుతున్నారు. భారత్‌తో కఠినంగా వ్యవహరించడం ద్వారా భారత్‌కు బంగ్లాదేశ్ తలొగ్గదని నిరూపించుకోవాలని రెహ్మాన్ ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విధానం ఎక్కువ కాలం కొనసాగితే బంగ్లాదేశ్‌కు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

എച്ച് വണ്‍ ബി വിസക്ക് ഒരു ലക്ഷം ഡോളറിന് മുകളില്‍ സ്ഥിരം ഫീസ് ഈടാക്കാന്‍ യു.എസ് നീക്കം

വാഷിങ്ടണ്‍: യു.എസില്‍ എച്ച് വണ്‍ ബി വിസയ്ക്ക് ഒരു ലക്ഷം ഡോളറിന്...

திருவல்லிக்கேணி: ஒரு பகுதி… பல நினைவுச்சுவடுகள் – மெட்ராஸின் வரலாற்றைத் தாங்கும் மண்!

`திருவல்லிக்கேணி' விவேகானந்தர் முதல் பாரதியார் வரை... கண்ணகி முதல் உ.வே.சா வரை......

ಸಚಿವ ಬಿ.ನಾಗೇಂದ್ರ ರಾಜೀನಾಮೆಗೆ ಆಗ್ರಹ: ಉಭಯ ಸದನಗಳಲ್ಲಿ ಬಿಜೆಪಿ ಪ್ರತಿಭಟನೆ ತೀವ್ರ

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,24,2026 (www.justkannada.in): ಸಚಿವ ಬಿ. ನಾಗೇಂದ್ರ ಅವರ ರಾಜೀನಾಮೆಗೆ ಒತ್ತಾಯಿಸಿ...

‘ഞാന്‍ അന്നേ മുന്നറിയിപ്പ് നല്‍കിയിരുന്നു, അവര്‍ ചതിക്കുമെന്ന്;’ അന്‍വറിനോട് ജലീല്‍

മലപ്പുറം: കഴിഞ്ഞ നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പില്‍ കോണ്‍ഗ്രസില്‍ നിന്ന് തന്നെ ചതിച്ചെന്ന പി.വി...