17
August, 2026

A News 365Times Venture

17
Monday
August, 2026

A News 365Times Venture

Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్‌పై ఫిర్యాదు!

Date:

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయం కమలాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో నాగేంద్రన్.. సీఎం విజయ్ గతంలో చేసిన ‘నాన్న ఎక్కడ?’ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు. ‘అసెంబ్లీలో నాన్న ఎక్కడ.. నాన్న ఎక్కడ అని వెతికితే ఎలా తెలుస్తుంది. ఇంటికి వెళ్లి అడిగితేనే తెలుస్తుంది’ అంటూ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు సీఎం విజయ్ తల్లిని ఉద్దేశించి అవమానకరంగా ఉన్నాయంటూ డీఎంకే, కాంగ్రెస్, టీవీకే నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తల్లిని రాజకీయ విమర్శల్లోకి తీసుకురావడం సరికాదంటూ మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సైతం నాగేంద్రన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. బీజేపీ నేత ఖుష్బూ కూడా ఆయన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్కం ఠాగూర్.. నాగేంద్రన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ఈ వ్యవహారంపై టీవీకే కార్యకర్త, న్యాయవాది వర్తిని డీజీపీకి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఆడియోలు, పోస్టులను ఆధారాలుగా సమర్పించినట్లు సమాచారం. దీంతో తమిళనాడులో విజయ్ వర్సెస్ బీజేపీ మధ్య రాజకీయ మాటల యుద్ధం మరింత ముదిరింది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സ്കൂളുകൾ അടച്ചുപൂട്ടുന്നതിനിടെ യു.പിയിൽ ജെൻ സികളെ ‘ഗോമിത്ര’ങ്ങളാക്കാൻ യോഗി സർക്കാർ; 10,000 പേർക്ക് പരിശീലനം

ലഖ്‌നൗ: ഉത്തർപ്രദേശിൽ ജെൻസി യുവാക്കളെ ‘ഗോമിത്ര’ങ്ങളാക്കി ഗോസംരക്ഷണ പ്രവർത്തനങ്ങളിൽ നിയോഗിക്കാൻ യോഗി...

“100 நாள் ஆட்சி, ஒரு யுகத்திற்கான மக்களின் மனசாட்சி" – முதல்வர் விஜய் வெளியிட்ட வீடியோ!

முதலமைச்சர் ஜோசப் விஜய் தலைமையிலான தமிழக வெற்றிக் கழக அரசு 100-வது...

ബുദ്ധിയുള്ളവരായിരിക്കുക, അന്ധഭക്തരാവാതിരിക്കുക; പ്രധാനമന്ത്രിയുടെ ദിമാഗി നക്സൽ പരാമർശത്തിൽ പ്രകാശ് രാജ്

ബെംഗളൂരു: പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദിയുടെ ‘ ദിമാഗി നക്സലുകൾ (ബുദ്ധിയുള്ള നക്സലുകളായവർ)’...

`அதுக்கு எந்த ரியாக்ஷனும் கொடுக்காம… இதுக்கு கைது பண்ணிட்டாங்க!' – உதயநிதி ஸ்டாலின்

அண்ணா அறிவாலயத்தில் வடக்கு மண்டல வழக்கறிஞர்கள் அணி ஆலோசனைக் கூட்டம் இன்று...