12
October, 2026

A News 365Times Venture

12
Monday
October, 2026

A News 365Times Venture

Javed Akhtar: హిందువులపై పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు.. “మిస్టర్ 10%” అంటూ జావెద్ అక్తర్ కౌంటర్..

Date:

Javed Akhtar: పాకిస్తాన్‌లో హిందూ మైనారిటీలను ఉద్దేశిస్తూ ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో జర్దారీ మాట్లాడుతూ.. పాక్ మొత్తం జనాభాలో హిందువులు 3-4శాతం ఉన్నారని, దేశంలోని ముస్లింలు వీరిని ‘‘సహిస్తున్నారు’’ అని అన్నారు. ఇదే కాకుండా భారతీయులపై నోరు పారేసుకున్నారు. భారతీయుల దృక్పథం వేరుగా ఉందని, వారికి తమదైన ఎజెండా ఉందని, వారు అఖండ భారత్‌ను విశ్వసిస్తున్నారని, కానీ మధ్యలో జరిగిన అనేక విసయాలను మర్చిపోయారని జర్దారీ అన్నారు. మేము ముస్లింలం, కానీ 3-4 శాతం హిందూ జనాభాను సహించే మానసికత మాకు ఉందని, వారు మాతో ఉండటానికి ఇష్టపడుతారని అన్నారు.

అయితే, ఈ వ్యాఖ్యలపై సినీ గేయరచయిత జావేద్ అఖ్తర్ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్‌లో జర్దారీకి ఉన్న ‘‘మిస్టర్ 10 పర్సెంటేజ్’’ అనే మారుపేరును ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. జావేద్ అఖ్తర్ తన పోస్టులో.. “మిస్టర్ జర్దారీ.. తమ దేశంలో 3–4 శాతం హిందువులను సహిస్తున్నామని అంటున్నారు. 10 శాతం కంటే తక్కువ ఉన్న వారందరి పట్ల మీరు ఎప్పుడూ సున్నితత్వం లేకుండా వ్యవహరించారని అర్థమవుతోంది” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

గతంలో కూడా జావేద్ అక్తర్ పాక్ తీరుపై బహిరంగంగా విమర్శలు చేశారు. 2025 మేలో ముంబైలో జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన భారత్-పాకిస్థాన్ సంబంధాలపై మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని, ఉగ్రవాదులకు తన భూభాగాన్ని సురక్షిత స్థావరంగా ఉపయోగించుకునే అవకాశం ఇస్తోందని ఆరోపించారు.

మిస్టర్ 10% జర్దారీ:

పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ గురించి సొంతదేశంలోనే ఒక విమర్శ ఉంది. అంతా అతడిని మిస్టర్ 10%గా పిలుస్తారు. ఏ పని చేయాలన్నా ఆయనకు 10 శాతం కమిషన్ ఇవ్వాల్సిందే అని అక్కడి వారు అనుకుంటారు. అంత అవీనితి చేసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. భార్య బెనజీర్ భుట్టో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రాజెక్టులు, అనుమతుల విషయంలో 10% కమీషన్ తీసుకుంటారనే ఆరోపణలు రావడంతో ఈ పేరు బాగా పాతుకుపోయింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

റഷ്യന്‍ എണ്ണശുദ്ധീകരണശാലകള്‍ക്ക് നേരെയുള്ള ആക്രമണം; ഉക്രൈന്‍ പുതിയ പ്രസിഡന്റിനെ തെരഞ്ഞെടുക്കാന്‍ സമയമായെന്ന് ട്രംപ്

വാഷിങ്ടണ്‍: യു.എസ്-റഷ്യ കരാറിനെ വിമര്‍ശിച്ച ഉക്രൈന്‍ പ്രസിഡന്റ് വ്‌ളോദിമിര്‍ സെലന്‍സ്‌കിയെ പുറത്താക്കാന്‍...

டெல்லி போராட்டம்: "நான் கைது செய்யப்படவில்லை; கடத்தப்பட்டேன்" – துருவ் ராட்டி

தலைமைத் தேர்தல் ஆணையர் ஞானேஷ் குமார் பதவி விலக வேண்டும் எனச்...

Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టి20ల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని...