10
October, 2026

A News 365Times Venture

10
Saturday
October, 2026

A News 365Times Venture

Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..

Date:

Income Tax Refund 2026: జూలై 31 గడువు ముగిసేలోపే ఇన్​కమ్ టాక్స్ రిటర్న్స్ (ITR) ఫైల్ చేశారా? రిఫండ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారా? పన్ను చెల్లింపుదారులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ఘట్టం ఇదే! మరి ఆ డబ్బు మీ బ్యాంకు ఖాతాలో ఎప్పుడు జమ అవుతుంది? మీ అసలు బాధ్యత కంటే ఎక్కువ పన్ను చెల్లించినట్లయితే, ఆదాయపు పన్ను శాఖ మీ రిటర్న్‌ను పరిశీలించి ఆ అదనపు మొత్తాన్ని తిరిగి మీకు రిఫండ్ చేస్తుంది. అయితే, ప్రతిరోజూ బ్యాంకు ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన, సరిచూసుకోవాల్సిన ముఖ్య విషయాలు కొన్ని ఉన్నాయి. అలాగే మీ రిఫండ్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా ఎలా ట్రాక్ చేయవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అసలు ఆదాయపు పన్ను రిఫండ్ ఎందుకు వస్తుందో తెలుసా?

మీరు ఫైల్ చేసిన ఐటీఆర్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత, మీ అసలు పన్ను బాధ్యత కంటే ఎక్కువ మొత్తం పన్ను రూపంలో చెల్లించినట్లు తేలితేనే రిఫండ్ వస్తుంది. టీడీఎస్ (TDS), టీసీఎస్ (TCS), అడ్వాన్స్ టాక్స్ లేదా సెల్ఫ్ అసెస్‌మెంట్ టాక్స్ రూపంలో ఎక్కువ మొత్తంలో పన్ను కట్ అయినప్పుడు లేదా చెల్లించినప్పుడు ఇది జరుగుతుంది. ఇవే కాకుండా వివిధ రకాల మినహాయింపులు (Deductions), టాక్స్ రిలీఫ్‌లు, విదేశీ పన్ను క్రెడిట్ లేదా పన్ను ఒప్పంద ప్రయోజనాలు (Treaty benefits) క్లెయిమ్ చేసినప్పుడు కూడా రిఫండ్ వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే, రిఫండ్ స్టేటస్ ట్రాక్ చేయడానికి కంటే ముందు కొన్ని విషయాలు తనిఖీ చేయడం చాలా అవసరం. మొదటిగా, మీ ఐటీఆర్ విజయవంతంగా ఈ-వెరిఫై (E-Verify) అయ్యిందో లేదో చూసుకోండి. వెరిఫై కాని రిటర్న్ ప్రాసెస్ కాదు, దానికి రిఫండ్ కూడా రాదు. అలాగే మీ పాన్ కార్డ్, ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. రిఫండ్ కోసం మీరు ఎంచుకున్న బ్యాంకు ఖాతా ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ప్రీ-వాలిడేట్ (Pre-validated) అయి ఉండటం తప్పనిసరి. వీటితో పాటు ఫారమ్ 26AS, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS), టాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ (TIS) లను సరిచూసుకుని, ఆదాయం లేదా పన్ను వివరాల్లో ఎలాంటి వ్యత్యాసాలు లేవని నిర్ధారించుకోవాలి. విదేశీ పన్ను క్రెడిట్ లేదా ఒప్పంద వెసులుబాటు పొందుతున్నట్లయితే సంబంధిత ఫారమ్ 10F లేదా ఫారమ్ 67 దాఖలు చేశారో లేదో చూడాలి. కొన్నిసార్లు రిఫండ్ ఆలస్యమైతే మీ రిటర్న్‌లో ఏదో తప్పు ఉందనుకుని కంగారు పడక్కర్లేదు. అది ఇంకా ప్రాసెసింగ్‌లో ఉండవచ్చు లేదా బ్యాంక్ ఖాతా వాలిడేషన్ కాకపోవడం వల్ల ఆగి ఉండవచ్చు.

మీ ఐటీఆర్ రిఫండ్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చాలా సులభంగా ట్రాక్ చేయవచ్చు. దీనికోసం ఆదాయపు పన్ను శాఖ అధికారిక ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, మీ పాన్, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ‘e-File’ సెక్షన్‌కు వెళ్లి, ‘Income Tax Returns’ ఎంచుకుని, ‘View Filed Returns’ పై క్లిక్ చేయాలి. అక్కడ సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్‌ను ఎంచుకుని ‘View Details’ పై క్లిక్ చేస్తే మీ రిఫండ్ స్థితి తెలుస్తుంది. ఇవే కాకుండా పోర్టల్‌లోని ‘Services’ విభాగంలో ఉన్న ‘Know Your Refund Status’ ఆప్షన్ ద్వారా కూడా నేరుగా తెలుసుకోవచ్చు. మీ రిఫండ్ ప్రాసెసింగ్‌లో ఉందా, ఇప్పటికే జారీ అయిందా, లేక పాత పన్ను బాధ్యతలకు ఏమైనా సర్దుబాటు (Adjusted) చేశారా అనే వివరాలు అక్కడ స్పష్టంగా కనిపిస్తాయి.

సాధారణంగా ఐటీఆర్ రిఫండ్ సొమ్ము 4 నుంచి 5 వారాల్లోగా బ్యాంకు ఖాతాలో క్రెడిట్ అవుతుంది. అయితే ఈ వ్యవధి అన్ని కేస్‌లలో ఒకేలా ఉండదు. చిన్న మొత్తం, సాధారణ క్లెయిమ్‌లు చాలా త్వరగా ప్రాసెస్ అవుతాయి. పెద్ద మొత్తంలో రిఫండ్ క్లెయిమ్ చేసినప్పుడు లేదా అదనపు తనిఖీలు అవసరమైనప్పుడు కాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు. ఒకవేళ ఐటీఆర్ వెరిఫై చేసినా రిఫండ్ రాకపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో స్టేటస్ చెక్ చేసుకోవడమే ఉత్తమ మార్గం. పన్ను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువు దాటి రిఫండ్ ఆలస్యమైతే, ఆదాయపు పన్ను చట్టాలకు లోబడి పన్ను చెల్లింపుదారునికి ఆ మొత్తంపై అదనంగా వడ్డీ కూడా లభిస్తుంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Dool In-Depth: Nobel Peace Price 2026: നവി പിള്ള- വര്‍ണ വിവേചനത്തിനെതിരായ പോരാട്ടം മുതല്‍ ഇസ്രഈല്‍ വംശഹത്യ കണ്ടെത്തിയ അന്വേഷണം വരെ

Nobel Peace Price 2026: ഗസയില്‍ ഫലസ്തീനികള്‍ക്കെതിരെ ഇസ്രഈല്‍ വംശഹത്യ നടത്തിയെന്ന്...

"நம்மை கேலி செய்தவருக்கு இந்த இடைத்தேர்தல் மரண பயத்தைக் காட்டியிருக்கிறது" – எடப்பாடி பழனிசாமி

நடந்து முடிந்திருக்கும் இடைத்தேர்தலில் மதுராந்தகம், தாராபுரம் தொகுதியில் முதல்வர் விஜய்யின் தவெக...

Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!

Elon Musk: ప్రపంచ కుబేరుడు భారత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు....

ഗ്യാനേഷിന്റെ രാജി: രാഷ്ട്രപതി ഭവന് മുന്നില്‍ പ്രതിഷേധവുമായി പ്രതിപക്ഷ നേതാക്കള്‍

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തിരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാര്‍ രാജിവയ്ക്കണമെന്ന ആവശ്യം ഉന്നയിച്ച്...