5
October, 2026

A News 365Times Venture

5
Monday
October, 2026

A News 365Times Venture

Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?

Date:

Vaibhav Sooryavanshi-Brett Lee: వైభవ్ సూర్యవంశీ నిజంగానే 15 ఏళ్ల కుర్రాడా? ఆ కుర్రాడు చూపుతున్న ఫామ్, మైదానంలో ఆడుతున్న తీరు, అద్భుతమైన ఆత్మవిశ్వాసం చూస్తుంటే.. అతడి వయసు 28 లేదా 30 ఏళ్లు ఉన్న అనుభవజ్ఞుడైన క్రికెటర్‌లా అనిపిస్తోంది! ఇంత చిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న ఈ కుర్రాడి ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరిచింది. గడిచిన ఏడాది కాలంలో వైభవ్ వయసుపై వస్తున్న ప్రశ్నలు కొంత తగ్గినప్పటికీ, విదేశాల్లో మాత్రం ఈ యువ సంచలనం వయసు గురించిన చర్చలు ఇంకా సాగుతూనే ఉన్నాయని ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ వెల్లడించారు.

ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన బ్రెట్ లీ, ప్రసిద్ధ ‘బీర్ బైసెప్స్’ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడారు. సూర్యవంశీ వయస్సు 15, 16, 17 లేదా 18 ఏదైనా కావొచ్చు.. దానితో ఎవరికీ సంబంధం లేదని తేల్చి చెప్పారు. అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడగల సామర్థ్యం అతడికి ఉందా లేదా అనేదే ఇక్కడ ముఖ్యమని, అసలైన చర్చ దానిపైనే జరగాలని వ్యాఖ్యానించారు. “అతను నిజంగా అద్భుతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ ‘అతడికి నిజంగా 15 ఏళ్లేనా?’ అని నన్ను అడుగుతున్నారు. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇదే అతిపెద్ద హాట్ టాపిక్. నాకు అతడి వయసుతో పనే లేదు. అతడికి 15 ఏళ్లు అయితే చాలా సంతోషం.. ఒకవేళ 17 లేదా 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం? ఈ కుర్రాడికి క్రికెట్ బాగా ఆడడం వచ్చు, అదొక్కటే ముఖ్యం! భారత్‌కు దొరికిన గొప్ప ఆణిముత్యం అతడు. భవిష్యత్తులో మరెన్నో గొప్ప విజయాలు సాధిస్తాడు” అని బ్రెట్ లీ ఆకాశానికెత్తేశారు.

ఐపీఎల్‌లో అతి తక్కువ సమయంలోనే సూర్యవంశీ అదరగొట్టాడని లీ గుర్తుచేశారు. “సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అతడు చేసిన 97 పరుగుల ఇన్నింగ్స్ నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు బంతిని నిప్పుల ముద్దలా విసురుతుంటే, ముక్కు ముందరకు వచ్చిన బంతులను సైతం చాలా సునాయాసంగా హుక్ షాట్లు కొట్టాడు. సరైన క్రికెటింగ్ షాట్లు ఆడుతూ, ఎక్కడి నుంచో అంతటి పవర్ తెచ్చుకుంటున్నాడు. అతని బ్యాటింగ్ లోపాలు కాకుండా కేవలం మనస్తత్వమే (మైండ్) భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అతడు ఇంకా చిన్న పిల్లాడే, అతడిని పిల్లాడిగానే ఉండనివ్వండి.. అనవసరమైన ఒత్తిడి పెంచకండి” అని ఆసీస్ మాజీ పేసర్ హితవు పలికారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കേരളത്തിലെ സാനിട്ടറി മാലിന്യസംസ്‌കരണം ഒരു ചെറിയ പ്രശ്നമല്ല ; സ്ത്രീകളെ കൂടുതലായി ബാധിക്കുന്നത്: സർക്കാർ പരിഹാരമുണ്ടാക്കണമെന്ന് മാലാ പാർവ്വതി

കേരളത്തിലെ സാനിട്ടറി മാലിന്യസംസ്കരണത്തിന് സർക്കാർ നയം രൂപീകരിക്കണമെന്ന് അഭിനേതാവും സാമൂഹ്യ പ്രവർത്തകയുമായ...

புதுச்சேரி தட்டாஞ்சாவடி இடைத்தேர்தல்: அனல் பறந்த இறுதிகட்ட பிரசாரம்!

துணை ராணுவத்தினர் அணிவகுப்பு துணை ராணுவத்தினர் அணிவகுப்பு Source link

Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య అక్టోబర్ 6వ తేదీ నుంచి ప్రారంభంకానున్న...

 ಮೈಸೂರು ಅರಮನೆಗೆ ಎಂಟ್ರಿಕೊಟ್ಟ ಅಭಿಮನ್ಯು: ವಿಶೇಷ ಪೂಜೆ ಸಲ್ಲಿಕೆ

ಮೈಸೂರು,ಅಕ್ಟೋಬರ್,5,2026 (www.justkannada.in): ಕಳೆದ 6 ವರ್ಷಗಳ ಕಾಲ ವಿಶ್ವವಿಖ್ಯಾತ ಮೈಸೂರು...