1
October, 2026

A News 365Times Venture

1
Thursday
October, 2026

A News 365Times Venture

Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!

Date:

కేబినెట్ సమావేశానికి ముందు రాష్ట్ర మంత్రులతో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ వ్యూహం, ప్రజా సమస్యలు, ఎల్‌నినో పరిస్థితులు వంటి కీలక అంశాలపై చర్చించారు. అనుకున్న సమయానికే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని మంత్రులకు మంత్రి లోకేష్ సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలుచుకునేలా ప్రతి మంత్రి, ప్రజాప్రతినిధి క్షేత్రస్థాయిలో పని చేయాలని మంత్రి నారా లోకేష్ సమావేశంలో చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన తీరును ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు. ప్రతి ఇంటి వద్ద కనీసం మూడు నిమిషాలైనా గడుపుతూ ప్రభుత్వ పనితీరు, అమలు చేసిన కార్యక్రమాలు, చేపట్టిన అభివృద్ధి చర్యలను ప్రజలకు వివరించాలని లోకేష్ మంత్రులకు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు.

అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపైనా సమావేశంలో నారా లోకేష్ మంత్రులతో చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితులను అసెంబ్లీ వేదికగా ప్రజలకు సమగ్రంగా వివరించాలని సూచించారు. ఇటీవల జలాశయాల్లోకి వరద నీరు రావడం కొంత ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ, నీటి వినియోగంలో జాగ్రత్త అవసరమని అన్నారు. నీటి నిర్వహణలో తొలి ప్రాధాన్యాన్ని తాగునీటి అవసరాలకు, ద్వితీయ ప్రాధాన్యాన్ని పశుగ్రాసం, పశుసంవర్థక అవసరాలకు ఇవ్వాలని లోకేష్ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రులకు సూచించారు.

ప్రజా సమస్యలను చర్చించి వాటికి పరిష్కారాలు కనుగొనే వేదికగా అసెంబ్లీని ఉపయోగించుకోవాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పరిపాలనా అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలని.. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో లోకేష్ స్పష్టం చేశారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಆಲಮಟ್ಟಿ ಅಣೆಕಟ್ಟೆ ಎತ್ತರ ಹೆಚ್ಚಳ: ಬಬಲೇಶ್ವರದ ನಾಲ್ಕು ಗ್ರಾಮಗಳಿಗೆ ತುರ್ತು ಪರಿಹಾರಕ್ಕೆ ಸಚಿವ ಎಂ.ಬಿ ಪಾಟೀಲ್ ಆಗ್ರಹ

ಬೆಂಗಳೂರು,ಅಕ್ಟೋಬರ್‌,1,2026 (www.justkannada.in) ಆಲಮಟ್ಟಿ ಅಣೆಕಟ್ಟು ಎತ್ತರ ಹೆಚ್ಚಳದಿಂದ ತಾವು ಪ್ರತಿನಿಧಿಸುತ್ತಿರುವ...

ബുര്‍ഖ ധരിച്ച് ലേബര്‍ റൂമിലെത്തിയ വിദ്യാര്‍ത്ഥിനികള്‍ക്ക് വിലക്ക്; ജമ്മു കാശ്മീരില്‍ മെഡിക്കല്‍ വിദ്യാര്‍ത്ഥികളുടെ പ്രതിഷേധം

ശ്രീനഗര്‍: ജമ്മു കാശ്മീരിലെ ദോഡ സര്‍ക്കാര്‍ മെഡിക്കല്‍ കോളേജില്‍ ബുര്‍ഖ ധരിച്ചെത്തിയ...

"சனி, ஞாயிறு விடு​முறை எடுக்கும் ஒரே முதல்வர், ஸ்வீட் ப்ரோ விஜய் தான்!"- திமுக எம்.பி கனிமொழி

மது​ராந்​தகம் திமுக வேட்​பாளர் பரந்​தாமனுக்கு ஆதர​வாக எம்.பி கனிமொழி நேற்று (செப்.30)...

Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!

Three Days of Rain in AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం...