3
August, 2026

A News 365Times Venture

3
Monday
August, 2026

A News 365Times Venture

Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!

Date:

Tirumala Laddu: శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రసాదాల్లో అత్యంత ప్రసిద్ధి శ్రీవారి ‘లడ్డూ’. నేటితో (ఆగస్టు 2) ఈ లడ్డూకు 311 ఏళ్లను పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధన పొందిన ఈ పవిత్ర ప్రసాదం కేవలం ఒక ప్రసాదం, తీపి పదార్థం మాత్రమే అని కాకుండా.. శ్రీవారిపై భక్తి, విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు.

చారిత్రక ఆధారాల ప్రకారం.. 1715 ఆగస్టు 2న తిరుమల ఆలయంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయడం ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి రోజు శ్రీవారికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం భక్తులకు ఈ లడ్డూను ప్రసాదంగా అందిస్తున్నారు. ఈ ఏడాదితో లడ్డూ ప్రసాదం 311 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది.

తిరుమలలో ప్రతిరోజూ నిర్వహించే శ్రీనివాస కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అందించే ప్రధాన ప్రసాదాల్లో శ్రీవారి లడ్డూ ఒకటి. శ్రీవారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించడం భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. శెనగపిండి, నెయ్యి, చక్కెర, జీడిపప్పు, ఎండుద్రాక్ష, యాలకులు వంటి నాణ్యమైన పదార్థాలతో ప్రత్యేక పద్ధతిలో తయారయ్యే శ్రీవారి లడ్డూ తన ప్రత్యేక రుచి, సువాసనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. తిరుమలకు వచ్చే విదేశీ భక్తులు సైతం ఈ ప్రసాదాన్ని ఆసక్తిగా తీసుకెళ్తుంటారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు దైవానుగ్రహంగా భావిస్తారు. శ్రీవారి ఆశీస్సులు లభించాయని భావిస్తూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఈ ప్రసాదాన్ని పంచుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. శ్రీవారి లడ్డూ తయారీ విధానం, నాణ్యత, రుచి వంటి అంశాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరతరాలుగా సంరక్షిస్తూ వస్తోంది. సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ కోట్లాది మంది భక్తులకు ప్రతిరోజూ ఈ ప్రసాదాన్ని అందిస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

നീറ്റ് പ്രക്ഷോഭത്തിന് ശേഷം നടന്ന ആദ്യ തെരഞ്ഞെടുപ്പില്‍ അടിത്തറയിളകി ബി.ജെ.പി; കോട്ട പൊളിച്ച് പ്രശാന്ത് കിഷോര്‍

  പാട്‌ന: രാജ്യവ്യാപകമായി ഉയര്‍ന്ന നീറ്റ് പരീക്ഷാ പ്രതിഷേധങ്ങള്‍ക്ക് ശേഷം നടന്ന...

மதுரை மீனாட்சியம்மன் கோவில்: "அபிஷேக தீர்த்த கிணறு அருகிலேயே குப்பைகள் தேக்கம்" – அண்ணாமலை புகார்

மதுரையில் வீ த லீடர்ஸ் அமைப்பின் சார்பாக வைகை ஆற்றைச் சுத்தப்படுத்தும்...

Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సిట్ దర్యాప్తు ముమ్మరం!

విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్...

ಸಂಪುಟ ವಿಸ್ತರಣೆಗೆ ಕ್ಷಣಗಣನೆ: ನೂತನ ಸಚಿವರ ಪಟ್ಟಿ  ಹೀಗಿದೆ ನೋಡಿ…

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,3,2026 (www.justkannada.in): ರಾಜ್ಯ ಸಚಿವ ಸಂಪುಟ ರಚನೆ ಕ್ಷಣಗಣನೆ ಆರಂಭವಾಗಿದ್ದು...