6
October, 2026

A News 365Times Venture

6
Tuesday
October, 2026

A News 365Times Venture

The Hundred: వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.! అయినా హ్యాట్రిక్ కాదు.. ఎందుకంటే.?

Date:

The Hundred: ది హండ్రెడ్ 2026 టోర్నమెంట్‌లో సదర్న్ బ్రేవ్ బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు పడినా.. బౌలర్ ఖాతాలో మాత్రం హ్యాట్రిక్ నమోదు కాలేదు. మరి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం..

మ్యాచ్ చివరి ఐదు బంతులను సదర్న్ బ్రేవ్ పేసర్ ల్యూక్ వుడ్ బౌలింగ్ చేశాడు. ఇన్నింగ్స్‌లో 96వ, 97వ బంతుల్లో వరుసగా బెన్ ద్వార్షుయిస్, స్కాట్ కరీలను ఔట్ చేసి హ్యాట్రిక్ అవకాశాన్ని సృష్టించాడు. అయితే 98వ బంతికి సాకిబ్ మహ్మూద్ పరుగుకు ప్రయత్నించగా.. షార్ట్ థర్డ్‌మ్యాన్ నుంచి ఆదిల్ రషీద్ అద్భుతమైన డైరెక్ట్ హిట్‌తో అతడిని రన్‌అవుట్ చేశాడు. మూడో వికెట్ రన్‌అవుట్ రూపంలో రావడంతో అది బౌలర్ ల్యూక్ వుడ్ ఖాతాలో చేరలేదు. అందువల్ల వ్యక్తిగత హ్యాట్రిక్ నమోదు కాలేదు. అయితే జట్టు వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీయడంతో దీనిని టీమ్ హ్యాట్రిక్ గా పరిగణిస్తారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన సదర్న్ బ్రేవ్ 8 వికెట్లకు 128 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ తరఫున రెహాన్ అహ్మద్ 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఒక దశలో 47 బంతుల్లో 52/1 స్థితిలో కనిపించింది. కానీ ఆ తర్వాత సదర్న్ బ్రేవ్ బౌలర్లు మ్యాచ్‌ను పూర్తిగా తమ వైపు తిప్పుకున్నారు.

బ్యాటింగ్‌లో రాణించిన మార్కస్ స్టోయినిస్, బౌలింగ్‌లో కూడా మెరిశాడు. 10 బంతుల్లో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్ 20 బంతుల్లో 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్ సాధించాడు. ల్యూక్ వుడ్ అత్యధికంగా 3 వికెట్లు తీయడంతో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ 100 బంతుల్లో 9 వికెట్లకు 116 పరుగులకే పరిమితమైంది. దీంతో సదర్న్ బ్రేవ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించి, ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. అంతకుముందు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన జట్టు ఈ విజయంతో గెలుపు బాట పట్టింది.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಫಾರ್ಮ್​-7 ದುರ್ಬಳಕೆ: ಸ್ಪಷ್ಟನೆ ನೀಡಿದ ರಾಜ್ಯ ಮುಖ್ಯ ಚುನಾವಣಾಧಿಕಾರಿ ಅನ್ಬುಕುಮಾರ್

ಬೆಂಗಳೂರು, ಅಕ್ಟೋಬರ್,​​ 5,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದಲ್ಲಿ ಚುನಾವಣಾ ಆಯೋಗದ ಫಾರ್ಮ್-7...

എങ്ങനെ കഥ പറയണമെന്നുള്ളതും പ്രധാനമാണ്: മാധ്യമപ്രവര്‍ത്തകര്‍ക്ക് മാര്‍ഗനിര്‍ദേശമിറക്കി ദല്‍ഹി പൊലീസ്

ന്യൂദല്‍ഹി: തലസ്ഥാനത്ത് എസ്.ഐ.ആറിനെതിരെയും മുഖ്യതെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ക്കെതിരെയും നടക്കുന്ന പ്രതിഷേധം റിപ്പോര്‍ട്ട് ചെയ്യാനെത്തുന്ന...

“செவிலியர்களை ஏமாற்றியிருக்கிறது இந்த ரீல் அரசு..!" – எம்.பி கனிமொழி

தமிழ்நாடு இடைநிலை சுகாதாரப் பணியாளர்கள் பொறுப்பில் இருக்கும் செவிலியர்கள் ஆயிரக்கணக்கானோர் சென்னை...

FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..

హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీకి చెందిన మాజీ BJYM జాతీయ...