11
October, 2026

A News 365Times Venture

11
Sunday
October, 2026

A News 365Times Venture

7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!

Date:

OnePlus N6x: వన్‌ప్లస్ (OnePlus) తన N-సిరీస్‌లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ OnePlus N6xను భారత మార్కెట్లో జూలై 31న విడుదల చేయనుంది. ఇటీవల లాంచ్ అయిన OnePlus N6 తర్వాత వస్తున్న ఈ ఫోన్ బడ్జెట్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని లాంచ్ కాబోతుంది. లాంచ్‌కు ముందే కంపెనీ ఫోన్‌కు సంబంధించిన కీలక ఫీచర్లను అధికారికంగా వెల్లడించింది. ఈ ఫోన్ అమ్మకాలు ఆగస్టు 4 నుంచి అమెజాన్ ఇండియాలో మొదలు కానున్నాయి.

భారీ బ్యాటరీ:

OnePlus N6xలో 7,000mAh బ్యాటరీను అందిస్తున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఇది OnePlus N6లో ఉన్న 8,000mAh బ్యాటరీ కంటే కొద్దిగా తక్కువ అయినప్పటికీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2.5 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే 20.56 గంటల వీడియో ప్లేబ్యాక్, 133.56 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 25.04 గంటల సోషల్ మీడియా వినియోగం, 11.26 గంటల నిరంతర వీడియో రికార్డింగ్ చేయవచ్చని తెలిపింది.

కొత్త డిజైన్:

డిజైన్ పరంగా కూడా OnePlus N6xలో కాస్త మార్పులు చేశారు. గత మోడల్‌లోని చతురస్రాకార కెమెరా మాడ్యూల్ స్థానంలో ఈసారి ఎడమవైపు పైభాగంలో నిలువుగా ఉండే పిల్-షేప్ కెమెరా మాడ్యూల్ను అందించారు. LED ఫ్లాష్‌ను కెమెరా మాడ్యూల్‌కు వేరుగా అమర్చారు. ఫ్లాట్ ఫ్రేమ్, ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్‌తో ఫోన్ మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. ఈ ఫోన్ ఐస్ బ్లూ, బర్గండీ రెడ్ రంగుల్లో అందుబాటులోకి రానుంది.

120Hz డిస్‌ప్లే:

OnePlus N6xలో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్‌ప్లే ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీంతో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది. అయితే డిస్‌ప్లే పరిమాణం, ప్రాసెసర్, కెమెరా వివరాలు, RAM, స్టోరేజ్ వేరియంట్లు, ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం, ఆపరేటింగ్ సిస్టమ్ వంటి పూర్తి స్పెసిఫికేషన్లను ఇంకా ప్రకటించలేదు. స్మార్ట్ ఫోన్ జూలై 31న భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుండగా.. ఆగస్టు 4 నుంచి అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

"உக்ரைனுக்கு புதிய அதிபர் வர வேண்டிய நேரம் வந்துவிட்டது" – ரஷ்யாவிடம் 'டீல்' போட்ட ட்ரம்ப் கருத்து

நேற்று முன்தினம் (அக்டோபர் 9) அமெரிக்க அதிபர் டரம்ப், ரஷ்யாவுடன் டீசல்...

Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..

Yogi Adityanath: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు ఉత్తర్ ప్రదేశ్ సీఎం...

ഫോര്‍ട്ട് ഹുഡ് കൊലയാളിയുടെ വധശിക്ഷ ലൈവ് സ്ട്രീം ചെയ്യുമെന്ന് യു.എസ്: വധശിക്ഷ സ്വീകാര്യമല്ലെന്ന് മാര്‍പാപ്പ

വാഷിങ്ടണ്‍ ഡി.സി: വധശിക്ഷ അനുവദനീയമല്ലെന്നും അത് വ്യക്തിയുടെ അന്തസിന് നേരെയുള്ള ആക്രമണമാണെന്നും...

டெல்லி: "எங்க கூட்டிட்டு போறாங்கன்னு தெரியல" – போலீஸ் ஜீப்பில் இருந்தபடி வீடியோ வெளியிட்ட CPM MP

தலைமைத் தேர்தல் ஆணையர் ஞானேஷ் குமாருக்கு எதிராக டெல்லி ஜந்தர்...