29
July, 2026

A News 365Times Venture

29
Wednesday
July, 2026

A News 365Times Venture

Uday Krishna Reddy: నేను ఎక్కడికీ పారిపోలేదు.. ఆరోపణలు అన్నీ అవాస్తవం.. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా!

Date:

Trainee IPS officer Uday Krishna Reddy Comments: తనపై వచ్చిన ఆరోపణలపై ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణా రెడ్డి స్పందించారు. తనపై తోటి ఐపీఎస్ అధికారి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, పరారీలో లేనని చెప్పారు. మీడియాలో వచ్చిన కధనాలను చూసి నానమ్మ అనారోగ్యానికి గురైందని, ఆమెను చూసేందుకు స్వగ్రామం ఊళ్లపాలెం వచ్చానన్నారు. న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలపై పూర్తి విశ్వాసంతోనే విచారణకు సహకరిస్తున్నానని తెలిపారు. కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై మరిన్ని వివరాలు వెల్లడించలేనని ఉదయ్ కృష్ణా రెడ్డి పేర్కొన్నారు.

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. తన నాయనమ్మను పరామర్శించేందుకే తన స్వగ్రామమైన ఊళ్లపాలెంకు వెళ్లానని, దానిని పరారిగా చిత్రీకరించడం సరైంది కాదన్నారు. ‘నామీద నాతోటి ఐపీఎస్ చేసిన ఆరోపణలు అవాస్తవం. మీడియాలో వచ్చిన కధనాలను చూసి మా నాయనమ్మ అనారోగ్యానికి గురైంది. అందుకే ఆమెను చూసేందుకు మా స్వగ్రామం ఊళ్లపాలెం వెళ్లాను. నేను పరారీలో లేను. న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తాను. గ్రామీణ నేపథ్యం నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఎప్పుడూ విలువలకు కట్టుబడి ఉంటాను’ అని ఉదయ్ కృష్ణా రెడ్డి అన్నారు.

‘కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఎక్కువ విషయాలు మాట్లాడడం సమంజసం కాదు. పోలీసులు నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్‌లో రెండు చిరునామాలకు వెళ్లారని తెలిసింది. అవి తాత్కాలిక చిరునామాలే. తన శాశ్వత చిరునామా అయిన ప్రకాశం జిల్లా ఊళ్లపాలెంకు ఎలాంటి నోటీసులు అందలేదు. విచారణ అధికారులకు సహకరించేందుకు నేనే స్వచ్ఛందంగా హైదరాబాద్‌కు వెళ్తున్నా. పోలీస్, న్యాయ వ్యవస్థలపై నమ్మకం ఉంది. విచారణలో నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా. నాకు పూర్తి విశ్వాసం ఉంది, నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి’ అని ఉదయ్ కృష్ణా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സ്വന്തം പാര്‍ട്ടിക്കാര്‍ പോലും കങ്കണയെ കാര്യമായെടുക്കുന്നില്ല; പിന്നെ ഞങ്ങള്‍ എന്തിന് ശ്രദ്ധിക്കണം: സി.ജെ.പി

ന്യൂദല്‍ഹി: നീറ്റ് വിഷയത്തില്‍ ധര്‍മേന്ദ്ര പ്രധാന്റെ രാജി ആവശ്യപ്പെട്ടുള്ള പ്രതിഷേധത്തിനെതിരെ വിവാദ...

தமிழ்த்தாய் வாழ்த்து: “யார் தடுத்தாலும் தாய்த் தமிழுக்கு முதலிடமே இருக்கும்..!" – தவெக பதிவு

நெல்லை மனோன்மணியம் சுந்தரனார் பல்கலைக்கழகத்தின் 33-வது பட்டமளிப்பு விழா இன்று நடைபெற்றது....

Super El Nino: ఊహకందని విపత్తు… మానవాళికి ముప్పు తప్పదా?

పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న ఒక మహా శక్తి భూగోళాన్ని వణికించేందుకు...

ಕಾಮನ್‌ ವೆಲ್ತ್ ಗೇಮ್ಸ್‌ ನಲ್ಲಿ ಕಂಚಿನ ಪದಕ: ಕನ್ನಡತಿ ಕೆ.ಎಸ್ ಶಿಲ್ಪರಿಗೆ ಅಭಿನಂದನೆ ಸಲ್ಲಿಸಿದ ಕೇಂದ್ರ ಸಚಿವ HDK

ಬೆಂಗಳೂರು,ಜುಲೈ,28,2026 (www.justkannada.in): ಕಾಮನ್‌ ವೆಲ್ತ್ ಗೇಮ್ಸ್‌ ನಲ್ಲಿ ಗುಂಡು ಎಸೆತದಲ್ಲಿ...