15
July, 2026

A News 365Times Venture

15
Wednesday
July, 2026

A News 365Times Venture

స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?

Date:

Renault Duster Adventure: భారత మార్కెట్లో రెనాల్ట్ (Renault) తన ఐకానిక్ SUV డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ (Duster Adventure Edition)ను అధికారికంగా విడుదల చేసింది. భారతదేశంలో డస్టర్ సాధించిన విజయాలకు గుర్తుగా ఈ స్పెషల్ ఎడిషన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. రూ.12.99 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో వచ్చింది. డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌ను సాధారణ మోడల్‌తో పోలిస్తే ప్రత్యేకంగా కనిపించేలా డిజైన్ చేశారు. SUVపై అడ్వెంచర్ డెకల్స్, టోపోగ్రాఫికల్ కాంటూర్ లైన్స్, అలాగే లేహ్ (Leh) ప్రాంతం కోఆర్డినేట్స్ (34.27 N, 77.60 E)ను పొందుపరిచారు. భారతదేశంలో డస్టర్‌కు ఉన్న అడ్వెంచర్ ఇమేజ్‌ను గుర్తు చేసేలా ఈ డిజైన్ రూపొందించారు.

ఫీచర్లు:

ఫీచర్ల పరంగా కూడా ఈ SUV ఆకట్టుకుంటుంది. ఇందులో ఫుల్ LED హెడ్‌ల్యాంప్స్, ఎలక్ట్రిక్ పానోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ పవర్డ్ టెయిల్‌గేట్, ‘మై రెనాల్ట్’ యాప్ ద్వారా కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 10.1 అంగుళాల ఓపెన్ R లింక్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 17 అంగుళాల ఓషన్ అలాయ్ వీల్స్ వంటి ప్రీమియం ఫీచర్లను అందించారు. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 100 HP పవర్, 160 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ జత చేశారు. అలాగే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 163 HP పవర్, 280 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (DCT) గేర్‌బాక్స్ ఎంపికలతో లభిస్తుంది.

భారత మార్కెట్లో డస్టర్ మంచి రైడ్ క్వాలిటీ, అద్భుతమైన హ్యాండ్లింగ్, వివిధ రకాల రోడ్లపై సులభంగా ప్రయాణించే సామర్థ్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ, డస్టర్‌తో ప్రయాణించిన కస్టమర్ల అనుభవాలకు గుర్తుగా ఈ అడ్వెంచర్ ఎడిషన్ ను తీసుకొచ్చినట్లు రెనాల్ట్ తెలిపింది.

బాస్టిల్ డే సందర్భంగా లాంచ్:

ఈ ప్రత్యేక ఎడిషన్‌ను ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం (Bastille Day) సందర్భంగా న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి థియెరీ మాథో (Thierry Mathou), రెనాల్ట్ గ్రూప్ ఇండియా సీఈఓ స్టీఫెన్ డెబ్లైజ్ (Stephane Deblaise) హాజరయ్యారు. ఫ్రెంచ్ వారసత్వానికి, భారత మార్కెట్లో డస్టర్‌కు ఉన్న ప్రత్యేక స్థానానికి గుర్తుగా ఈ ఎడిషన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അവര്‍ക്ക് നീതി നല്‍കാന്‍ പൊലീസിന് കഴിഞ്ഞു, പക്ഷേ എനിക്ക്?: വീണ്ടും പ്രതികരിച്ച് അന്‍സിബ

കൊച്ചി: സമൂഹ മാധ്യമങ്ങളില്‍ തന്നെ അപമാനിച്ചെന്ന പരാതിയില്‍ പൊലീസ് നടപടിയെടുക്കാത്തതില്‍ വീണ്ടും...

சிறையில் கவுன்சிலராகப் பதவியேற்ற பா.ஜ.க பிரமுகர்; கேரள அரசியல் வரலாற்றில் முதன் முறை நிகழ்வு!

கேரள மாநிலத் தலைநகரான திருவனந்தபுரம் மாநகராட்சி பா.ஜ.க வசம் உள்ளது. மாநகராட்சி...

ಗೃಹ ಸಚಿವರ ತವರು ಜಿಲ್ಲೆಯಲ್ಲೇ ಜೈಲಿನಿಂದ ಮೂವರು ಕೈದಿಗಳು ಎಸ್ಕೇಪ್

ಕಲಬುರಗಿ,ಜುಲೈ,14,2026 (www.justkannada.in): ಗೃಹ ಸಚಿವ ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ ತವರು ಜಿಲ್ಲೆ...

യുവതിക്കെതിരായ അധിക്ഷേപം; തൊപ്പി ഗാങ് അംഗം മമ്മു അറസ്റ്റില്‍; നടപടി ഹനാന്‍ ഷായുടെ സുഹൃത്തിന്റെ ഭാര്യയുടെ പരാതിയില്‍

മലപ്പുറം: തൊപ്പി എന്ന പേരിലറിയപ്പെടുന്ന യൂട്യൂബര്‍ നിഹാദിന്റെ സംഘാംഗമായ മുഹമ്മദ് എന്ന...