12
July, 2026

A News 365Times Venture

12
Sunday
July, 2026

A News 365Times Venture

AP Cabinet: ఏపీ కేబినెట్‌ భేటీ.. పవన్‌ కల్యాణ్‌ సహా ఐదుగురు మంత్రుల డుమ్మా..!

Date:

AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశానికి ఏకంగా ఐదుగురు మంత్రులు డుమ్మా కొట్టారు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబైలో చికిత్స నిమిత్తం కోసం వెళ్లడంతో ఆయన సమావేశానికి హాజరు కాలేదు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్‌, అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి టీజీ భరత్ కూడా గైర్హాజరయ్యారు. కుటుంబ కార్యక్రమం కారణంగా మంత్రి నిమ్మల రామానాయుడు, తిరుపతిలో కేంద్ర మంత్రితో కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా సమావేశానికి హాజరు కాలేకపోయారు.

ఇక, ఈ రోజు కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.. విశాఖపట్నంలో ఎన్‌ఐఏ కేసుల విచారణ కోసం రాష్ట్రవ్యాప్త అధికార పరిధితో ప్రత్యేక కోర్టు ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు రూ.11,166.81 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇందులో రూ.9,355 కోట్లతో పది మల్టీ విలేజ్ తాగునీటి పథకాలు, రూ.1,811.81 కోట్లతో 2,943 తాగునీటి పథకాలు చేపట్టనున్నారు.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഗവി പ്രിയദര്‍ശിനി ബസില്‍ നിയന്ത്രണം; പരമാവധി യാത്രക്കാരുടെ എണ്ണം 55

ഗവി: ഗവി പ്രിയദര്‍ശിനി ബസില്‍ നിയന്ത്രണം. പരമാവധി യാത്രക്കാരുടെ എണ്ണം 55...

“துரதிர்ஷ்டவசமாக தமிழ்நாட்டில் குருகுல கல்வியைச் செயல்படுத்த முடியவில்லை" – ஆளுநர் அர்லேக்கர்

சென்னை அரும்பாக்கத்தில் உள்ள துவாரகதாஸ் கோவர்தன்தாஸ் வைஷ்ணவ் கல்லூரியின் (தன்னாட்சி) 59-வது...

ದೋಸೆ, ಟೀ ಮತ್ತು ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ: ರಾಜಕೀಯ ನೆನಪುಗಳಲ್ಲಿ ಮೈಸೂರಿನ ಹೋಟೆಲ್‌ಗಳು

  ಮೈಸೂರು: ಪ್ರತಿ ನಗರಕ್ಕೂ ತನ್ನದೇ ಆದ ಒಂದು ಸಂಸತ್ತು ಇರುತ್ತದೆ....