12
July, 2026

A News 365Times Venture

12
Sunday
July, 2026

A News 365Times Venture

Botsa Satyanarayana: గవర్నర్‌కు బొత్స లేఖ.. విశాఖలో వద్దు.. విజయనగరం మార్చండి..!

Date:

Botsa Satyanarayana: శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ.. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు.. జూలై 11న జరగనున్న జేఎన్‌టీయూ-జీవీ తొలి స్నాతకోత్సవాన్ని విశాఖపట్నంలో కాకుండా విజయనగరంలో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఆహ్వానం పంపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, వెనుకబడిన విజయనగరం జిల్లా అభివృద్ధి లక్ష్యంతో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవాన్ని అదే జిల్లాలో నిర్వహించడం సముచితమని లేఖలో పేర్కొన్నారు బొత్స..

విశ్వవిద్యాలయం ఏర్పడి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో తొలి స్నాతకోత్సవం నిర్వహిస్తున్నారని, మరో రెండు నెలల్లో విజయనగరం క్యాంపస్ పూర్తిగా అందుబాటులోకి రానుందని బొత్స గుర్తుచేశారు. అలాంటి సమయంలో విశాఖలో కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం విజయనగరం జిల్లా ప్రజలలో తీవ్ర అసంతృప్తికి దారితీసిందని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తొలి స్నాతకోత్సవాన్ని విజయనగరంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తన లేఖ ద్వారా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ..

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മേഖലയിലെ യു.എസ് ഇടപെടല്‍ അവസാനിക്കും വരെ ഒരു കപ്പലും ഹോര്‍മുസ് കടക്കില്ല: ഇറാന്‍

ടെഹ്‌റാന്‍: ഹോര്‍മുസ് കടലിടുക്കിലൂടെയുള്ള കപ്പല്‍ ഗതാഗതം അനിശ്ചിത കാലത്തേക്ക് തടയുകയാണെന്ന് ഇറാന്റെ...

'ஸ்டார்ட்… கேமரா… ஆக்ஷன்' – முதல்வர் விஜய் பேச்சு குறித்து ஜெயக்குமார் விமர்சனம்

சட்டமன்ற தேர்தல் படுதோல்விக்குப் பிறகு எடப்பாடி பழனிசாமி தன் தலைமையில் மாவட்ட...

Donald Trump: నన్ను చంపడానికి ట్రై చేస్తే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయ్.. ట్రంప్ షాకింగ్ ప్రకటన..

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్...

KPSC ಅಧ್ಯಕ್ಷರ ವಿರುದ್ದ ರಾಜ್ಯಪಾಲರಿಂದ ಕ್ರಮ ಆಗಬೇಕು- ಗೃಹ ಸಚಿವ ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ

ಬೆಂಗಳೂರು,ಜುಲೈ,11,2026 (www.justkannada.in): ಕೆಪಿಎಸ್ ಸಿ ಅಧ್ಯಕ್ಷ ಶಿವಶಂಕರಪ್ಪ ಪುತ್ರಿ ವಿರುದ್ದ...