10
July, 2026

A News 365Times Venture

10
Friday
July, 2026

A News 365Times Venture

CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..

Date:

CM Chandrababu: నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం విధ్వంసమైన రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకువచ్చి సుపరిపాలన అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత పాలనలో జరిగిన అరాచకాల వల్ల లక్షలాది కుటుంబాలు నష్టపోయాయని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రజల్లో భయాందోళనలు కలిగించిందని సీఎం వ్యాఖ్యానించారు. మాట వినని వారి భూములను 22ఏ జాబితాలో చేర్చారని ఆరోపిస్తూ, ఎన్నికల హామీ మేరకు ఆ చట్టాన్ని రద్దు చేశామని తెలిపారు. ఎన్టీఆర్ భూమి పన్నును రద్దు చేసినట్లే, భూమి హక్కులను రైతులకు మరింత భద్రంగా కల్పిస్తున్నామని చెప్పారు.

భూమి పట్టాలు, సర్వే రాళ్లపై గత పాలకుల ఫొటోలు ముద్రించారని విమర్శించిన చంద్రబాబు, ప్రస్తుతం రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను అందిస్తున్నామని వివరించారు. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు గ్రామ సభల ద్వారానే పాసుపుస్తకాల పంపిణీ చేపట్టామని తెలిపారు. గత ఏడు నెలల్లో 29 లక్షల పాసుపుస్తకాలను అందించామని, పంపిణీ ప్రక్రియ పూర్తి కావడానికి మరో ఎనిమిది నెలలు పట్టవచ్చని చెప్పారు.

భూ రికార్డుల పారదర్శకత కోసం బ్లాక్‌చెయిన్ సాంకేతికతను ప్రవేశపెట్టినట్లు సీఎం వెల్లడించారు. రైతుల సమక్షంలో రీ–సర్వే నిర్వహిస్తూ, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. 1971 రికార్డు ఆఫ్ రైట్స్‌ను పూర్తిచేయడంతో పాటు తిరుపతి జిల్లా శెట్టిపల్లి, గుంటూరు జిల్లా వట్టి చేరుకూరులో దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. అలాగే డోన్ నియోజకవర్గంలోని ఒక గ్రామంలో సుమారు రెండు వేల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇസ്രഈലിനായുള്ള ഈ കരാറിലെ ഒരു വ്യവസ്ഥ പോലും നടപ്പാക്കില്ല, നിങ്ങള്‍ക്കത് തടയാനാകില്ല; ലെബനനോട് ഹിസ്ബുല്ല

  ബെയ്‌റൂട്ട്: ലെബനനും ഇസ്രഈലും തമ്മില്‍ അടുത്തിടെ ഒപ്പുവെച്ച കരാറിനെ പരസ്യമായി...

“திருமாவளவன்: பாலுக்கும் காவல் – பூனைக்கும் காவல் என்கிறார்" – நயினார் நாகேந்திரன்

பா.ஜ.க தலைவர் நயினார் நாகேந்திரன் திருநெல்வேலியில் செய்தியாளர்களைச் சந்தித்தார். அப்போது, ``கரூரில்...

മമതയ്ക്ക് തിരിച്ചടി; മുതിര്‍ന്ന മൂന്ന് തൃണമൂല്‍ എം.പിമാര്‍ ബി.ജെ.പിയില്‍

  കൊല്‍ക്കത്ത: പശ്ചിമ ബംഗാള്‍ നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പിലെ തൃണമൂല്‍ കോണ്‍ഗ്രസിന്റെ പരാജയത്തിന്...

திண்டுக்கல்: குடிநீர் தட்டுப்பாடு; காலி குடங்களுடன் சாலை மறியலில் இறங்கிய பெண்கள்!

திண்டுக்கல் மாநகராட்சி எல்லைக்குட்பட்ட 41 மற்றும் 42-வது வார்டுகளில் வாட்டர் டேங்க்...