5
July, 2026

A News 365Times Venture

5
Sunday
July, 2026

A News 365Times Venture

Delhi Government: కీలక ఆదేశాలు.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు గుడ్‌బై

Date:

Delhi Government: ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న హైబ్రిడ్ వర్క్ విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించింది. మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులందరూ యథావిధిగా కార్యాలయాలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఢిల్లీ ప్రభుత్వం గతంలో హైబ్రిడ్ వర్క్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో ప్రభుత్వ ఉద్యోగులు వారంలో రెండు రోజులు ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పించారు. ముఖ్యంగా బుధవారం, శనివారం రోజులను వర్క్ ఫ్రమ్ హోమ్ దినాలుగా నిర్ణయించారు.

ఇంధన పొదుపు కోసం ప్రత్యేక చర్యలు

వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పాటు కార్యాలయాల పని వేళల్లో కూడా మార్పులు చేశారు. ప్రభుత్వ వాహనాలకు కేటాయించే ఇంధనాన్ని సుమారు 20 శాతం తగ్గించడంతో పాటు, కొన్ని శాఖల్లో అధికారుల వాహనాల కాన్వాయ్‌లను కూడా కుదించారు. ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించడం, ఇంధనాన్ని ఆదా చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.

మళ్లీ పాత కార్యాలయ వేళలు

తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు సాధారణ కార్యాలయ సమయాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) కార్యాలయాల పని వేళల్లో ఎలాంటి మార్పులు లేవు. అవి యథావిధిగా ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. మధ్యప్రాచ్య పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలికంగా 90 రోజుల పాటు అమలు చేసిన హైబ్రిడ్ విధానాన్ని ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా రద్దు చేయడంతో, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరూ మళ్లీ పూర్తి స్థాయిలో కార్యాలయాల నుంచే పనిచేయనున్నారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ചരിത്രത്തിലാദ്യമായി തൃശ്ശൂര്‍ മെഡിക്കല്‍ കോളേജ് യൂണിയന്‍ എസ്.എഫ്.ഐക്ക്; അഭിനന്ദനവുമായി പിണറായി

തൃശ്ശൂര്‍: തൃശ്ശൂര്‍ മെഡിക്കല്‍ കോളേജ് യൂണിയന്‍ തെരഞ്ഞെടുപ്പില്‍ എസ്.എഫ്.ഐ പാനലിന് ജയം....

அலி கமேனியின் இறுதிச் சடங்கில் 14 மாத பேரக்குழந்தை ஜஹ்ராவின் சிறு சவப்பெட்டி – கண்ணீரில் தெஹ்ரான்

அமெரிக்கா மற்றும் இஸ்ரேல் நடத்திய தாக்குதல்களில் கொல்லப்பட்ட ஈரானின் உச்ச தலைவர்...

ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಅಕ್ರಮ ಮತದಾರರ ಪಟ್ಟಿ ರಚನೆಗೆ ಮುಂದಾಗಿದೆ-ಕೇಂದ್ರ ಸಚಿವೆ ಶೋಭಾ ಕರಂದ್ಲಾಜೆ

ಬೆಂಗಳೂರು,ಜುಲೈ,3,2026 (www.justkannada.in):  ಕಲ್ಯಾಣ ಮಂಟಪ , ಒಂದೇ ಮನೆಯಲ್ಲಿ ಕೂತು...

23 വര്‍ഷത്തിന് ശേഷം കോഴിക്കോട് മെഡിക്കല്‍ കോളേജ് യൂണിയന്‍ പിടിച്ചടക്കി എസ്.എഫ്.ഐ

കോഴിക്കോട്: 23 വര്‍ഷത്തിന് ശേഷം കോഴിക്കോട് മെഡിക്കല്‍ കോളേജ് യൂണിയനില്‍ എസ്.എഫ്.ഐക്ക്...