2
July, 2026

A News 365Times Venture

2
Thursday
July, 2026

A News 365Times Venture

KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)

Date:

KTR-Prabhas: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అంటే మనకు ఎప్పుడూ రాజకీయ సమీక్షలు, బిజీ షెడ్యూల్స్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, తాజాగా ఆయన ఎవరూ ఊహించని విధంగా సరికొత్త లుక్‌లో మెరిసి అందరినీ ఫిదా చేశారు. ‘ది అండర్ 18 వరల్డ్’ (The Under 18 World) అనే చిన్నారుల గ్రూప్‌తో కేటీఆర్ సరదాగా ముచ్చటించిన ఓ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ చిట్‌చాట్‌లో పిల్లలు అడిగిన కొన్ని గూగ్లీ లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కేటీఆర్ సరదాగా తల పట్టుకోవడం చూస్తే ఎవరికైనా నవ్వు ఆగదు. అయితే, ఈ షోలోనే అసలైన ట్విస్ట్ ఇస్తూ.. టాక్ షో జరుగుతుండగానే టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఆయన లైవ్‌లోనే ఫోన్ కాల్ చేశారు. కేటీఆర్ స్క్రీన్‌పై ప్రభాస్‌తో మాట్లాడటం చూసి అక్కడ ఉన్న పిల్లలతో పాటు సోషల్ మీడియా ఆడియన్స్ సైతం షాక్‌తో కూడిన ఆనందంలో మునిగిపోయారు.

రాజకీయాల్లో ఎంత గంభీరంగా ఉంటారో, ఇలాంటి వేదికలపై కేటీఆర్ అంతే హుషారుగా ఉంటారని ఈ ప్రోమో నిరూపించింది. షోలో పాల్గొన్న ఒక చిన్నారి ఛాలెంజ్ విసరడమే ఆలస్యం.. కేటీఆర్ ఏమాత్రం తగ్గకుండా స్టేజ్ పైనే ఆమెతో పోటీ పడి మరీ పుష్-అప్స్ తీసి తన ఫిట్‌నెస్‌తో ఆశ్చర్యపరిచారు. సరిగ్గా ఇంటర్వ్యూ రసవత్తరంగా సాగుతున్న సమయంలోనే ఆయన సతీమణి కల్వకుంట్ల శైలిమ నుంచి ఫోన్ రావడం, దాంతో కేటీఆర్ ఒక్కసారిగా కంగారు పడుతూ.. “షోలో ఉన్నాను, తర్వాత చేస్తా” అంటూ స్పీడ్‌గా ఫోన్ కట్ చేయడం ఈ ప్రోమోకే అసలైన హైలైట్‌గా నిలిచింది. ఎంతటి లీడరైనా భార్య ఫోన్ వస్తే ఆ ఆందోళన కామనే కదా అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. లీడర్‌లోని సరికొత్త ఎంటర్‌టైనింగ్ కోణాన్ని చూపించిన ఈ ఫుల్ ఇంటర్వ్యూ వీడియో త్వరలోనే రిలీజ్ కానుండటంతో అటు పొలిటికల్ సర్కిల్స్‌లో, ఇటు పబ్లిక్‌లో ఇప్పుడు దీని గురించే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

യു.പിയില്‍ എസ്.പിയുടെ അത്രയും സീറ്റുകള്‍ വേണമെന്ന് കോണ്‍ഗ്രസ്; മുന്നണിയിലേക്ക് ബി.എസ്.പി അടക്കമുള്ള മറ്റു പാര്‍ട്ടികളെയും പരിഗണിച്ചേക്കും

ലഖ്‌നൗ: ഉത്തര്‍ പ്രദേശില്‍ സമാജ്‌വാദി പാര്‍ട്ടിക്കൊപ്പം(എസ്.പി) കോണ്‍ഗ്രസും ഇന്ത്യ സഖ്യത്തില്‍ തുല്യ...

ரஷ்யாவில் பெட்ரோல் தட்டுப்பாடு: என்ன காரணம்? – இந்திய பெட்ரோலை வாங்குகிறதா ரஷ்யா?

சமீபத்தில் ரஷ்ய எண்ணெய் சுத்திகரிப்பு நிலையங்கள் மீது உக்ரைன் டிரோன் தாக்குதல்...

ಮೋಡ ಬಿತ್ತನೆ ಚಿಂತನೆ ಇಲ್ಲ, ಅವಕಾಶ ಬಂದಾಗ ಮಾಡ್ತೇವೆ- ಡಿಸಿಎಂ ಪರಮೇಶ್ವರ್

ಬೆಳಗಾವಿ,ಜುಲೈ,1,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದಲ್ಲಿ ಮುಂಗಾರು ಮಳೆ ಸರಿಯಾಗಿ ಆಗದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ...

ഇനിയും വൈകിക്കൂടാ! എ.ഐയെ നിയന്ത്രിക്കാന്‍ യു.എന്‍; ലോകരാജ്യങ്ങളോട് അടിയന്തിരമായി ഒന്നിക്കാന്‍ ഗുട്ടെറസ്

  ന്യൂയോര്‍ക്ക്: ആര്‍ട്ടിഫിഷ്യല്‍ ഇന്റലിജന്‍സിന്റെ (എ.ഐ) സുരക്ഷിതമായ ഉപയോഗത്തിനായി ലോകരാജ്യങ്ങള്‍ ഒത്തുചേര്‍ന്ന്...