1
July, 2026

A News 365Times Venture

1
Wednesday
July, 2026

A News 365Times Venture

Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్‌తో సూపర్ టేస్టీ కూర..

Date:

Boondi Sev Curry Recipe: కొన్నిసార్లు ఇంట్లో కూరగాయలు అయిపోతాయి లేదా ఏం వండాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటాం. అలాంటి సమయంలో ఇంట్లోనే సులభంగా దొరికే పదార్థాలతో కేవలం ఐదు నిమిషాల్లో రుచికరమైన కూర తయారు చేసుకోవచ్చు. అందులో బూందీ-సేవ్ కూర అలాంటి వంటకాలలో ఒకటి. ఈ వంటకాన్ని పెరుగు, బూందీ, సేవ్‌తో పాటు సాధారణంగా ఇంట్లో ఉండే మసాలాలతో తయారు చేస్తారు. ఇది తక్కువ సమయంలో సిద్ధమవడమే కాకుండా రోటీ, పరాఠా లేదా వేడి అన్నంతో ఎంతో రుచిగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు

* అర కప్పు బూందీ
* అర కప్పు సేవ్
* అర కప్పు గిలకొట్టిన పెరుగు
* రెండు టేబుల్ స్పూన్ల నూనె
* చిటికెడు ఇంగువ
* అర టీస్పూన్ ఆవాలు
* అర టీస్పూన్ జీలకర్ర
* కరివేపాకు
* సన్నగా తరిగిన ఉల్లిపాయ
* ఒక పచ్చిమిర్చి
* పసుపు
* కారం పొడి
* తగినంత ఉప్పు.

తయారీ విధానం

ముందుగా బాణలిలో నూనె వేడి చేసి ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయించాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అనంతరం మంట తగ్గించి గిలకొట్టిన పెరుగు వేసి నిరంతరం కలుపుతూ ఉండాలి. చివరగా బూందీ, సేవ్, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి ఒక నిమిషం ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. రుచికరమైన బూందీ-సేవ్ కూర సిద్ధం.

త్వరగా, సులభంగా.. రుచి మాత్రం అదిరిపోతుంది

సమయం తక్కువగా ఉన్నప్పుడు లేదా ఇంట్లో కూరగాయలు లేని సమయంలో ఈ రెసిపీ ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది. తక్కువ పదార్థాలతో ఎక్కువ రుచిని అందించే ఈ కూరను ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపిస్తుంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഉമര്‍ ഖാലിദിന്റെ തടവ് ജനാധിപത്യത്തിനേറ്റ കളങ്കം; ആരോപണങ്ങള്‍ ശരിയെങ്കില്‍ കോടതിയില്‍ തെളിയിക്കാത്തത് എന്തുകൊണ്ടെന്ന് ശശി തരൂര്‍

ന്യൂദല്‍ഹി: ഉമര്‍ ഖാലിദിന്റെ തടവ് നമ്മുടെ ജനാധിപത്യത്തിന് മേലുള്ള കളങ്കമാണെന്ന് കോണ്‍ഗ്രസ്...

யோகி Vs அகிலேஷ்: அமைச்சரவை மாற்றம்; சமூக சமன்பாடுகள்; பாஜக-வின் தேர்தல் வலை! – கைகொடுக்குமா?

உத்தரப்பிரதேசம்மக்கள்தொகை அடிப்படையில் இந்தியாவின் மிகப்பெரிய மாநிலமான உத்தரப் பிரதேசம், 80 மக்களவைத்...

Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్‌ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం

Pawan Kalyan Meets Devendra Fadnavis: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్...

Mysore Traffic Signal: ಅಳವಡಿಕೆ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಇಲ್ಲ ಎಂದ ಪಾಲಿಕೆ..!

ಮೈಸೂರು, ಜೂನ್ 30,2026 (www.justkannada.in): ನಗರದ ವಿವಿಧ ರಸ್ತೆಗಳಲ್ಲಿ ಕಳೆದ...