30
June, 2026

A News 365Times Venture

30
Tuesday
June, 2026

A News 365Times Venture

AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా

Date:

AIADMK MLA Resignation: తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకేకు మరో భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ సోమవారం తమిళనాడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు పార్టీకి కూడా గుడ్‌బై చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏఐఏడీఎంకేను వీడిన ఆరో ఎమ్మెల్యేగా ఆయన నిలిచారు. ఈ పరిణామం పార్టీ అధినేత పళనిస్వామికి మరింత ఇబ్బందికరంగా మారింది.

జయలలిత మంత్రివర్గంలో కీలక బాధ్యతలు

ఎంఆర్ విజయభాస్కర్ మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేత వి. సెంథిల్ బాలాజీ చేతిలో ఓడిపోయిన ఆయన, 2026 ఎన్నికల్లో తిరిగి కరూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే, 2026 ఎన్నికల అనంతరం ఏఐఏడీఎంకే నుంచి ఎమ్మెల్యేల నిష్క్రమణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి అధికార టీవీకేలో చేరగా, ఇటీవల పార్టీని వీడిన విరాలిమలై మాజీ ఎమ్మెల్యే సి. విజయభాస్కర్ కూడా త్వరలో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామా

ఎంఆర్ విజయభాస్కర్‌కు ముందు అంబాసముద్రం ఎమ్మెల్యే ఈశక్కి సుబయ్య, ధారాపురం ఎమ్మెల్యే పి. సత్యభామ, మదురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమరవేల్, పెరుందురై ఎమ్మెల్యే ఎస్. జయకుమార్, విరాలిమలై ఎమ్మెల్యే సి. విజయభాస్కర్‌లు కూడా పార్టీకి, అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటంతో అసెంబ్లీలో ఏఐఏడీఎంకే బలం తగ్గడంతో పాటు పార్టీ భవిష్యత్తుపై కూడా చర్చ మొదలైంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

`அன்று எதிர்ப்பு… இன்று அனுமதி!' அணுக்கனிம சுரங்கத் திட்டத்தில் தவெகவின் இரட்டை நிலைப்பாடு

கன்னியாகுமரி மாவட்டத்தில் அணுக்கனிம (Atomic Minerals) சுரங்கத் திட்டம் தொடர்பாக தமிழக...

Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను

Samudra: ఆంధ్రప్రదేశ్ సినీ రంగంలో హౌసింగ్ సొసైటీ స్థలాల వ్యవహారం తీవ్ర...