28
June, 2026

A News 365Times Venture

28
Sunday
June, 2026

A News 365Times Venture

Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్‌ని చంపేందుకు ప్లాన్.. కట్‌చేస్తే..

Date:

Karnataka: కర్ణాటకలోని తుమకూరు జిల్లా జాతీయ రహదారిపై శనివారం ఓ భయంకరమైన ఘటనా చోటుచేసుకుంది. ఒకప్పుడు ప్రేమించి, ఆ తర్వాత మనస్పర్థలతో దూరమైన ఓ యువతిని బలవంతంగా కిడ్నాప్ చేసిన మాజీ ప్రియుడు.. కదులుతున్న కారులోనే ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఆ ప్రమాదం నుంచి ఆమె చాకచక్యంగా తప్పించుకుని కారులోంచి కిందకు దూకేయగా.. మరుక్షణమే ఆ కారు భారీ పేలుడుతో నిప్పుల కొలిమిగా మారింది. ఈ ఘోర ప్రమాదంలో కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగేంద్ర (30) అనే యువకుడు కారులోనే సజీవ దహనమయ్యాడు.

పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరులోని జయనగర్‌లో ఓటీ (OT) టెక్నీషియన్‌గా పనిచేస్తున్న యువతి, నాగేంద్ర గతంలో ప్రేమించుకున్నారు. అయితే ఇటీవల వ్యక్తిగత విభేదాల కారణంగా వారిద్దరూ విడిపోయారు. ఆ యువతి నాగేంద్ర ఫోన్ నంబర్‌ను కూడా బ్లాక్ చేసింది. దీనిపై తీవ్ర కక్ష పెంచుకున్న నాగేంద్ర.. శనివారం ఉదయం బెంగళూరులోని ఆమె నివాసానికి వెళ్లి గొడవపడ్డాడు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా ఒక ఉబెర్ (Uber) క్యాబ్‌లోకి నెట్టి కిడ్నాప్ చేశాడు. కుమార్తె కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు జయనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. క్యాబ్‌లో అంకోలా వైపు వెళ్తుండగా, నిన్ను చంపి నేను కూడా చచ్చిపోతానంటూ నాగేంద్ర ఆమెను తీవ్రంగా బెదిరించాడు. అంతేకాకుండా తన వద్ద ఉన్న ఓ పేలుడు పదార్థాన్ని కూడా ఆమెకు చూపించాడు. జాతీయ రహదారి-48 పై తుమకూరు జిల్లా సిరా తాలూకాలోని జోగిహళ్లి సమీపానికి రాగానే, నాగేంద్ర కదులుతున్న కారులోనే ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన క్యాబ్ డ్రైవర్ ప్రవీణ్ వెంటనే వాహనాన్ని ఆపాడు. ఆ క్షణంలోనే యువతి కారు డోర్ లాక్ తెరిచి బయటకు దూకేసి ప్రాణాలు దక్కించుకుంది.

ఆమె కిందకు దూకిన మరుక్షణమే కారులో ఒక్కసారిగా శక్తివంతమైన పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. కారులోనే చిక్కుకుపోయిన నాగేంద్ర సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదంలో గాయపడిన యువతిని, క్యాబ్ డ్రైవర్ ప్రవీణ్‌ను వెంటనే తుమకూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ భారీ పేలుడు కారణంగా బిజీగా ఉండే ఆ హైవేపై కిలోమీటరు మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘటనపై తుమకూరు ఎస్పీ అశోక్ కె.వి. తెలిపిన వివరాల ప్రకారం.. నాగేంద్ర తన వెంట బాంబు లాంటి పేలుడు పదార్థాన్ని తెచ్చుకున్నాడని, అతడే ఉద్దేశపూర్వకంగా ఈ పేలుడుకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కారు శిథిలాల నుంచి పోలీసులు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అసలు నాగేంద్ర ఆ బాంబును ఎక్కడి నుంచి తెచ్చాడు? అది ఎలా పేలింది? అనే కోణంలో కల్లంబెల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വധശിക്ഷയാവുന്ന വിചാരണത്തടവ്; ‘ജാമ്യവും ചികിത്സയും ലഭിച്ചിരുന്നെങ്കിൽ അബ്ദുല്‍ ഖാദർ മരിക്കുമായിരുന്നില്ല’

ബെംഗളൂരു സ്ഫോടന കേസില്‍ 17 വര്‍ഷത്തോളമായി വിചാരണത്തടവുകാരനായി കഴിയുകയായിരുന്ന കുടക് സ്വദേശി...

”அடுத்த சட்டமன்றத் தொடரில் Dance Performance இருக்கும்” – முதல்வர் விஜய்யைச் சாடிய உதயநிதி

தஞ்சாவூர் மாவட்டம் ஒரத்தநாடு பகுதிகளில் இரண்டு திமுக நிர்வாகிகளின் இல்லத் திருமணம்...

ಪ್ರತಿ ವರ್ಷ ಬೆಂಗಳೂರಿನ ಒಂದೊಂದು ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಕೆಂಪೇಗೌಡ ಜಯಂತಿ- ಸಿಎಂ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್

ಬೆಂಗಳೂರು, ಜೂನ್, 27,2026 (www.justkannada.in):  ಇನ್ಮುಂದೆ ಬೆಂಗಳೂರಿನ 28 ವಿಧಾನಸಭಾ...

ലെബനന്റെ പരമാധികാരം ഇസ്രഈലിന് മുമ്പില്‍ അടിയറവ് വെക്കുന്ന നീക്കം; ലെബനന്‍-ഇസ്രഈല്‍ കരാര്‍ തള്ളി ഹിസ്ബുല്ല

  ബെയ്‌റൂട്ട്: അമേരിക്കയുടെ മധ്യസ്ഥതയില്‍ ലെബനനും ഇസ്രഈലും തമ്മില്‍ വാഷിങ്ടണില്‍ വെച്ച്...