27
June, 2026

A News 365Times Venture

27
Saturday
June, 2026

A News 365Times Venture

Mohanlal: ‘ఏజ్‌ ఈజ్ జస్ట్‌ నంబర్‌’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!

Date:

Mohanlal: మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ మరోసారి డ్యాన్స్ మూవ్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్’ అనేలా 65 ఏళ్ల వయసులోనూ స్టేజ్‌పై ఉత్సాహంగా డ్యాన్స్ చేసి మెప్పించారు. ప్రస్తుతం ఆయన చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.

జర్మనీలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మోహన్‌లాల్.. ప్రేక్షకుల కోసం పలు పాటలకు స్టెప్పులు వేశారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘మనోహరి’కి ఆయన చేసిన డ్యాన్స్ హైలెట్ గా నిలిచింది. ఇద్దరు నటీమణులతో కలిసి స్టేజ్‌పై డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ఒరిజినల్‌గా ఈ పాటలో ప్రభాస్ ముగ్గురు నటీమణులతో కలిసి కనిపించగా.. మోహన్‌లాల్ మాత్రం ఇద్దరు నటీమణులతో కలిసి తనదైన స్టైల్‌లో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. బాహుబలి చిత్రంలోని కాస్ట్యూమ్స్‌ను గుర్తుకు తెచ్చేలా రూపొందించిన దుస్తుల్లో ఈ ప్రదర్శన మరింత ప్రత్యేకంగా నిలిచింది.

కేవలం డ్యాన్స్ మాత్రమే కాకుండా.. ఈ కార్యక్రమంలో మోహన్‌లాల్ కొన్ని పాటలు కూడా పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆయన ఉత్సాహం, స్టేజ్ ప్రెజెన్స్, డ్యాన్స్ స్టెప్పులు చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మనోహరి’ పాటకు మోహన్‌లాల్ వేసిన స్టెప్పులు చూసి ప్రభాస్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘బాహుబలి’ పాటలు భాషా భేదం లేకుండా అందరినీ ఆకట్టుకున్నాయని.. ఇప్పుడు మోహన్‌లాల్ పర్ఫార్మెన్స్‌తో ఆ పాటకు మరోసారి కొత్త క్రేజ్ వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കരാറിലെ ഓരോ നിബന്ധനയും ഇസ്രഈലിന് അനുകൂലമെന്ന്; ബെയ്‌റൂട്ടില്‍ ഹിസ്ബുല്ല അനുകൂലികളുടെ പ്രതിഷേധം

ബെയ്‌റൂട്ട്: ഇസ്രഈലും ലെബനനും തമ്മില്‍ അമേരിക്കയുടെ മധ്യസ്ഥതയില്‍ വാഷിങ്ടണില്‍ ഒപ്പുവെച്ച കരാറിനെതിരെ...

தனியார் பள்ளிகள் சங்க தலைவர் பி.டி.அரசகுமார் மீது வழக்கு பதிவு: மத்திய குற்றப்பிரிவு நடவடிக்கை!

தமிழ்நாடு தனியார் பள்ளிகள் சங்கம் (பதிவு செய்யப்படாத அமைப்பு) நிறுவனர் தலைவரான...

ಬಿಡದಿ ಟೌನ್ ಶಿಪ್: ಸಿಎಂ  ಚಿಂತನೆ ಮಾಡಿ ಸೂಕ್ತ ನಿರ್ಧಾರ ಕೈಗೊಳ್ಳಲಿ- ಕೇಂದ್ರ ಸಚಿವ ವಿ.ಸೋಮಣ್ಣ

ದಾವಣಗೆರೆ,ಜೂನ್,27,2026 (www.justkannada.in): ಬಿಡದಿಯ ಟೌನ್ ಶಿಪ್ ನಿರ್ಮಾಣ ವಿಚಾರಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ...

‘ഒരു കാരണവശാലും കൊടുക്കില്ല’, മുഖ്യമന്ത്രി പറഞ്ഞത് എന്നോട്; ന്യായീകരണവുമായി കുഞ്ഞാലിക്കുട്ടി

മലപ്പുറം: മൂലം വള്ളംകളിയുമായി ബന്ധപ്പെട്ട് പ്രാദേശിക അവധി ആവശ്യപ്പെട്ട കുട്ടനാട് എം.എല്‍.എയുടെ...