24
June, 2026

A News 365Times Venture

24
Wednesday
June, 2026

A News 365Times Venture

మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!

Date:

Telegram Back: దాదాపు వారం రోజుల అంతరాయం తర్వాత మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) భారత్‌లో మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. చాలా మంది వినియోగదారులకు సేవలు సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ.. కొందరు జియో (Jio), ఎయిర్‌టెల్ (Airtel) వినియోగదారులు ఇంకా కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నారు.

జూన్ 16 నుంచి జూన్ 22 వరకు టెలిగ్రామ్ సేవలపై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. NEET-UG పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించిన సమాచారం టెలిగ్రామ్ ద్వారా వ్యాపిస్తోందనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టెలికాం సంస్థలు యాప్‌కు యాక్సెస్‌ను నిలిపివేయగా.. గూగుల్, యాపిల్ కూడా తమ యాప్ స్టోర్‌ల నుంచి టెలిగ్రామ్‌ను తొలగించాయి. అయితే ప్రస్తుతం యాప్ మళ్లీ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. కొంతమంది జియో, ఎయిర్‌టెల్ వినియోగదారులు లాగిన్ సమస్యలు, చాట్‌లు ఓపెన్ కాకపోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కొందరు వినియోగదారులు VPN ఉపయోగించినప్పుడు మాత్రమే యాప్ సరిగా పనిచేస్తోందని చెబుతున్నారు. సేవల పునరుద్ధరణ ప్రాంతాల వారీగా, నెట్‌వర్క్ ప్రొవైడర్ల వారీగా దశలవారీగా జరుగుతోందని తెలుస్తోంది.

టెలిగ్రామ్ ఇంకా పనిచేయకపోతే వినియోగదారులు కొన్ని చర్యలు ప్రయత్నించవచ్చు. యాప్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయడం, యాప్‌ను రీస్టార్ట్ చేయడం, క్యాష్ క్లియర్ చేయడం, నెట్‌వర్క్ సెట్టింగ్‌లను పరిశీలించడం వంటి చర్యలు ఉపయోగపడవచ్చు. అలాగే టెలికాం సంస్థలు పూర్తిస్థాయిలో సేవలను పునరుద్ధరించే వరకు కొంత సమయం వేచి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. టెలిగ్రామ్‌పై విధించిన ఆంక్షలను కంపెనీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. అయితే NEET-UG పరీక్ష ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసమేనని కోర్టు అభిప్రాయపడింది. దీంతో ప్రభుత్వ చర్యలకు న్యాయస్థానం మద్దతు లభించింది.

ఇక టెలిగ్రామ్ మాత్రం తాము ఇప్పటికే లీకైన ప్రశ్నాపత్రాలకు సంబంధించిన 900కు పైగా లింకులను తొలగించామని తెలిపింది. కంపెనీ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ కూడా ఈ నిషేధాన్ని విమర్శిస్తూ, దీనివల్ల సాధారణ వినియోగదారులే ఎక్కువగా నష్టపోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం టెలిగ్రామ్ సేవలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. చాలా మంది వినియోగదారులు యాప్‌ను సాధారణంగా ఉపయోగిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఇంకా సమస్యలు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయిలో సేవలు పునరుద్ధరించబడేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അമേരിക്ക-ഇറാന്‍ ചര്‍ച്ചകളില്‍ ഇസ്രഈല്‍ ഭാഗമല്ല; ഹിസ്ബുല്ലയെ പൂര്‍ണമായും തകര്‍ക്കുന്നത് വരെ ആക്രമണമെന്ന് ഇസ്രഈല്‍

  ടെല്‍ അവീവ്: അമേരിക്കയും ഇറാനും തമ്മില്‍ നടത്തുന്ന നയതന്ത്ര ചര്‍ച്ചകളില്‍...

`தமிழ்நாட்டை விட்டு வெளியே சென்ற முதலீடுகள்' பட்டியலிட்ட கீர்த்தனா; ஏன் சென்றன? – TRB ராஜா விளக்கம்

தமிழ்நாடு சட்டமன்றக் கூட்டத்தொடருக்குப் பின், தமிழ்நாடு தொழிற்துறை அமைச்சர் கீர்த்தனா பத்திரிகையாளர்களிடம்...

ಆಹಾರ ವ್ಯಾಪಾರ ಸಂಸ್ಥೆಗಳ ವಿರುದ್ಧ ವಿಶೇಷ ತಪಾಸಣಾ ಕಾರ್ಯಾಚರಣೆ: 5 ನೋಟಿಸ್ ಜಾರಿ, 43.5 ಕೆಜಿ ಆಹಾರ ಪದಾರ್ಥ ವಶ

ಮೈಸೂರು, ಜೂನ್,23,2026 (www.justkannada.in): ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳ ಸೂಚನೆಯಂತೆ ಮೈಸೂರು ನಗರ ಆಹಾರ...

ഇരകള്‍ 800ലധികം, സുഡാനില്‍ ലൈംഗിക അതിക്രമങ്ങള്‍ ‘യുദ്ധത്തിനുള്ള ആയുധം’; വിറങ്ങലിപ്പിക്കുന്ന ക്രൂരതകളുമായി യു.എന്‍ റിപ്പോര്‍ട്ട്

  ജനീവ: സുഡാനിലെ ആഭ്യന്തര സംഘര്‍ഷങ്ങളില്‍ ലൈംഗിക അതിക്രമങ്ങള്‍ വ്യവസ്ഥാപിതമായി ഒരു...