20
June, 2026

A News 365Times Venture

20
Saturday
June, 2026

A News 365Times Venture

Akash Deep Wedding: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇంట పెళ్లి బాజాలు.. పూర్తి షెడ్యూల్ విడుదల

Date:

Akash Deep Wedding: భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఆకాశ్‌దీప్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బీహార్‌లోని రోహ్తాస్ జిల్లా బడ్డీ గ్రామానికి చెందిన ఈ యువ క్రికెటర్, జూన్ 24న అక్షిత రాజ్‌ను వివాహం చేసుకోనున్నాడు. ఈ పెళ్లి వార్తతో అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఆకాశ్‌దీప్‌కు కాబోయే వధువు అక్షిత రాజ్ దేహ్రీలోని మాణిక్‌పూర్‌కు చెందిన యువతి. వీరి వివాహ వేడుకలు పలు రోజుల పాటు సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. జూన్ 21న బడ్డీ గ్రామంలో తిలక్ కార్యక్రమంతో పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి.

తదుపరి రోజు జూన్ 22న మెహందీ వేడుక, జూన్ 23న హల్దీ కార్యక్రమం జరగనుంది. అనంతరం జూన్ 24న ఆకాశ్‌దీప్ పెళ్లి ఊరేగింపు వారణాసిలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు చేరుకోనుంది. అక్కడ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రత్యేక ఆహ్వానితుల సమక్షంలో వివాహం ఘనంగా జరగనుంది. ఈ వివాహానికి బీహార్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో బడ్డీ గ్రామంలో ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు తమ ప్రాంతానికి చెందిన క్రికెట్ స్టార్ వివాహాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా, బీహార్ ఉప ముఖ్యమంత్రి Samrat Choudhary మంగళవారం ఆకాశ్‌దీప్ స్వగ్రామాన్ని సందర్శించి, అతని కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఆకాశ్‌దీప్‌కు వివాహ శుభాకాంక్షలు తెలియజేసి, కొత్త జీవితంలో ఆనందం, విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథి రాకతో కుటుంబ సభ్యుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఆకాశ్‌దీప్ తల్లి శాలువా కప్పి సమ్రాట్ చౌదరిని సత్కరించగా, ఆకాశ్‌దీప్ స్వయంగా పూలగుత్తి అందించి స్వాగతం పలికాడు. కుటుంబ సభ్యులు కూడా ఆయనతో సమావేశమై కృతజ్ఞతలు తెలిపారు. తన అద్భుతమైన బౌలింగ్‌తో భారత జట్టులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆకాశ్‌దీప్ ఇప్పుడు జీవితంలో మరో కీలక మైలురాయిని చేరుకోబోతున్నాడు. అతని వివాహ వేడుకల కోసం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അമേരിക്കയുടെ ആഗോള മേധാവിത്വ മോഹങ്ങള്‍ക്ക് ഇറാന്‍ പൂട്ടിട്ടു; സമാധാന കരാര്‍ യു.എസിനുള്ള തിരിച്ചടി: റഷ്യന്‍ രാഷ്ട്രീയ നിരീക്ഷകന്‍

മോസ്‌ക്കോ: അമേരിക്കയുടെ ആഗോള ആധിപത്യം വീണ്ടും ഉറപ്പിക്കനുള്ള യു.എസ് പ്രസിഡന്റ് ഡൊണാള്‍ഡ്...

விஜய் படங்களுக்கு பணியாயாற்றிய பிரபல ஒளிப்பதிவாளர்! – மனோஜ் பரமஹம்சாவுக்கு அரசுப் பொறுப்பு

பிரபல ஒளிப்பதிவாளர் மனோஜ் பரமஹம்சாவுக்கு தமிழ்நாடு அரசுப் பொறுப்பு வழங்கப்பட்டுள்ளது. 'ஈரம்',...

Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!

Monsoon 2026: దేశవ్యాప్తంగా దాదాపు రెండు వారాలుగా నత్తనడకన సాగుతూ, తీవ్ర...

ನಗರಾಭಿವೃದ್ಧಿ ಪ್ರಾಧಿಕಾರಗಳು ಕಡ್ಡಾಯವಾಗಿ ಪ್ರತಿ ತಿಂಗಳು ಸಭೆ ನಡೆಸಬೇಕು- ಸಚಿವ ಡಾ. ಯತೀಂದ್ರ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ಜೂನ್,19,2026 (www.justkannada.in): ನಗರಾಭಿವೃದ್ಧಿ ಪ್ರಾಧಿಕಾರಗಳು ಕಾಲ ಕಾಲಕ್ಕೆ ಪ್ರಾಧಿಕಾರದ ಸಭೆ...