15
June, 2026

A News 365Times Venture

15
Monday
June, 2026

A News 365Times Venture

Shadi Mubarak Scam: ‘షాదీ ముబారక్’ పేరుతో భారీ దోపిడి.. రూ. 21 లక్షల ప్రభుత్వ నిధులు స్వాహా.!

Date:

Shadi Mubarak Scam: షాదీ ముబారక్ పేరుతో భారీ దోపిడికి పాల్పడ్డ అంతర్రాష్ట్ర ముటా సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో నిందితులకు రెవెన్యూ మున్సిపల్ అధికారులు సహకరించినట్టు గుర్తించారు. నిందితులు ఏకంగా రూ. 21 లక్షల ప్రభుత్వ నిధులను స్వాహా చేసినట్టు నిర్ధారించారు అధికారులు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంక్షేమ పథకమైన షాదీ ముబారక్ పేరుతో నకలి పత్రాలు సృష్టించి సుమారు 21 లక్షల ప్రభుత్వ నిధులను కాజేసిన అంతర్రాష్ట్ర ముటాను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. హసర్ నగర్ లోని ఫాతిమా కాలనీలో ఒక ఇంటిలో షాదీ ముబారక్ పథకానికి సంబంధించిన నకలి పాత్రాలు తయారు చేస్తున్నారని సమాచారం అందడంతో.. అత్తాపూర్ పోలీసులు దాడులు నిర్వహించారు.

ప్రధాన నిందితుడు మహమ్మద్ ఎతిమాద్ ఉల్హక్ నివాసంలో నిర్వహించిన తనికిల్లో భారి ఎత్తున నకలీ దరఖాస్తులు, ఐడి ప్రూఫ్లు, కంప్యూటర్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ ఎతిమాద ఆధార్ ఆపరేటర్ గా పనిచేస్తూ కంప్యూటర్ సాఫ్ట్వేర్ సహాయంతో వధువుల ఫోటోలు వివాహ ధృవీకరణ పత్రాలు, ఇతర అవసరమైన పత్రాలను ఫోర్జరీ చేసి నకలీ దరఖాస్తులు తయారు చేసినట్లుగా తేలింది. అనంతరం ఈ దరఖస్తులను బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించి ప్రభుత్వ నిధులు మంజూరయ్యేలా కుట్ర పండినట్లుగా పోలీసులు గుర్తించారు.

ఈ వ్యవహారంలో బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ధరావత అశోక్ కిరణ్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడయింది. క్షేత్ర స్థాయి పరిశీలన లేకుండానే నిధులు మంజూరయ్యేలా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన నిందితలు నకలి లబ్దిదరులను గుర్తించడం, బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించడం, అక్రమంగా వచ్చిన సొమ్మును పంచుకోవడంలో భాగస్వామ్యులైనట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఈ ముఠా ఇప్పటివరకు సుమారు 21 లక్షల మేర ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు. నిందుతుల వద్ద నుంచి ఒక లాప్టాప్, డెస్క్టాప్ కంప్యూటర్ ఆరు మొబైల్ ఫోన్లు, నకలి దరఖాస్తులు, ఫోర్జరీ చేసిన ఐడి ప్రూఫ్ లో 21 లక్షల విలువైన 21 చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. అత్తాపుర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేని నిందితులను కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

യു.ഡി.എഫ് നേതാക്കളും തോറ്റ സ്ഥാനാര്‍ത്ഥികളും പ്രിയദര്‍ശിനി പദ്ധതി ഉദ്ഘാടനം ചെയ്തത് തെറ്റെന്ന് കെ.എന്‍ ബാലഗോപാല്‍

തിരുവനന്തപുരം: സംസ്ഥാന സര്‍ക്കാര്‍ കെ.എസ്.ആര്‍.ടി.സി ഓര്‍ഡിനറി ബസ്സുകളില്‍ സ്ത്രീകള്‍ക്ക് യാത്ര സൗജന്യമാക്കുന്നതിനായി...

TASMAC: “இது வெறும் 'எண்' துடைப்பு" – டாஸ்மாக் விவகாரத்தில் நயினார் நாகேந்திரன் சொல்வது என்ன?

தமிழ்நாட்டில் 4,829 டாஸ்மாக் கடைகள் மூலம் மாதம் ரூ.4,000 கோடியும், கடந்த...

Land Missile: భారత అంబులపొదిలో మరో అస్త్రం.. భూతల దాడి క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి...

ಸರ್ಕಾರದ ಆರ್ಥಿಕ ಪರಿಸ್ಥಿತಿ ಬಗ್ಗೆ ಸಿಎಂ ಶ್ವೇತಪತ್ರ ಮಂಡಿಸಲಿ- ಬಿವೈ ವಿಜಯೇಂದ್ರ

ಶಿವಮೊಗ್ಗ,ಜೂನ್,15,2026 (www.justkannada.in):  ಸರ್ಕಾರ ಹಣವಿಲ್ಲದ ಬಗ್ಗೆ ಒಪ್ಪಿಕೊಳ್ಳದೆ ಗ್ಯಾರಂಟಿ ಪರಿಷ್ಕರಣೆಯ...