27
June, 2026

A News 365Times Venture

27
Saturday
June, 2026

A News 365Times Venture

TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..

Date:

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. ఇటీవల వరుసగా మూడు నోటిఫికేషన్లను విడుదల చేసిన కమిషన్, తాజాగా విద్యాశాఖలో కీలకమైన పోస్టుల భర్తీకి సరికొత్త నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (Deputy Educational Officers) / గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-1  పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 01 జూలై 2026 నాటికి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్ఠంగా 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ముఖ్యమైన తేదీలు ఇవే.. 
ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 12 జూన్ 2026 కాగా.. దరఖాస్తులకు చివరి తేదీ: 19 జూలై 2026

అర్హులైన అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in సందర్శించి ఆన్‌లైన్ ప్రొఫార్మా ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. విద్యార్హతలు, సిలబస్, పరీక్షా విధానం మరియు ఫీజు వివరాలతో కూడిన సమగ్రమైన నోటిఫికేషన్ త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తుందని కమిషన్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇటీవలి కాలంలో టీజీపీఎస్సీ వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తుండటంతో నిరుద్యోగుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. చాలా కాలంగా విద్యాశాఖలో గెజిటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు. అభ్యర్థులు ఆలస్యం చేయకుండా నిబంధనలను పరిశీలించి, జూన్ 12 నుంచి జూలై 19 లోపు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్‌కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..

Shoaib Akhtar: పాకిస్థాన్‌లో ఉగ్రవాదం రోజు రోజుకూ మితిమీరిపోతోంది. తాజాగా మాజీ...

ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಒಂದು ಇಂಚು ಭೂಮಿ ಕೊಡಬೇಡಿ- ರೈತರಿಗೆ HDK ಕಿವಿಮಾತು

ರಾಮನಗರ,ಜೂನ್,27,2026 (www.justkannada.in): ಬಿಡದಿ ಟೌನ್ ಶಿಪ್ ನಿರ್ಮಾಣ ವಿಚಾರ ಸಂಬಂಧ...

കരാറിലെ ഓരോ നിബന്ധനയും ഇസ്രഈലിന് അനുകൂലമെന്ന്; ബെയ്‌റൂട്ടില്‍ ഹിസ്ബുല്ല അനുകൂലികളുടെ പ്രതിഷേധം

ബെയ്‌റൂട്ട്: ഇസ്രഈലും ലെബനനും തമ്മില്‍ അമേരിക്കയുടെ മധ്യസ്ഥതയില്‍ വാഷിങ്ടണില്‍ ഒപ്പുവെച്ച കരാറിനെതിരെ...

தனியார் பள்ளிகள் சங்க தலைவர் பி.டி.அரசகுமார் மீது வழக்கு பதிவு: மத்திய குற்றப்பிரிவு நடவடிக்கை!

தமிழ்நாடு தனியார் பள்ளிகள் சங்கம் (பதிவு செய்யப்படாத அமைப்பு) நிறுவனர் தலைவரான...