28
May, 2026

A News 365Times Venture

28
Thursday
May, 2026

A News 365Times Venture

Putin: కజకిస్థాన్‌లో పుతిన్ పర్యటన.. అణు విద్యుత్ శక్తిపై కీలక ఒప్పందం

Date:

రష్యా అధ్యక్షుడు పుతిన్ కజకిస్థాన్‌లో పర్యటిస్తున్నారు. రాజధాని అస్తానాలో కజకిస్థాన్ అధ్యక్షుడు కాసిమ్-జొమార్ట్ టోకాయెవ్‌తో పుతిన్ సమావేశమయ్యారు. ఇక పర్యటనలో భాగంగా మధ్య ఆసియా దేశమైన కజకిస్థాన్‌లో తొలి అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి రష్యా-కజకిస్థాన్ కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారీ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

ఈ సందర్భంగా మాట్లాడిన టోకాయెవ్.. “ఈ రోజు కుదిరిన బాల్కాష్ అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణ ఒప్పందం ఎంతో ప్రాధాన్యత కలిగినది” అని పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ అమలులో రష్యా అందిస్తున్న సహకారానికి పుతిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కోసం రష్యా ఎగుమతి రుణ సాయం కూడా అందించనుంది. కజకిస్థాన్ అణుశక్తి సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 15 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో దాదాపు 85 శాతం నిధులను రష్యానే సమకూర్చనుంది. ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని కజకిస్థాన్ ఆగ్నేయ ప్రాంతంలోని బాల్కాష్ సరస్సు తీరంలో ఉన్న ఉల్కెన్ గ్రామం సమీపంలో నిర్మించనున్నారు. ఇందులో రెండు అణు రియాక్టర్లు ఏర్పాటు చేయనున్నారు.

ప్రపంచంలోనే అత్యధిక యురేనియం ఉత్పత్తి చేసే దేశంగా కజకిస్థాన్‌కు గుర్తింపు ఉంది. అయినప్పటికీ అణు విద్యుత్ వినియోగంపై గత రెండు దశాబ్దాలుగా ఆ దేశంలో చర్చలు సాగుతున్నాయి. సోవియట్ కాలంలో జరిగిన అణు పరీక్షల వల్ల పర్యావరణం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడటంతో కజకిస్థాన్ ఇప్పటి వరకు అణు విద్యుత్ విషయంలో జాగ్రత్తగానే వ్యవహరించింది. అయితే 2024లో నిర్వహించిన జాతీయ ప్రజాభిప్రాయ సేకరణలో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ప్రజలు మద్దతు తెలిపారు. దీంతో ఇప్పుడు రష్యాతో కలిసి ఈ ప్రాజెక్ట్ అమలు దిశగా కజకిస్థాన్ అడుగులు వేస్తోంది.

సుమారు 2.05 కోట్ల జనాభా కలిగిన కజకిస్థాన్.. 2035 నాటికి 2.4 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీర్ఘకాలిక ఇంధన వ్యూహంలో భాగంగా విద్యుత్ ఉత్పత్తి వనరులను విభిన్నీకరించేందుకు ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഗോവധ നിരോധനം: സുപ്രീം കോടതിയെ സമീപിക്കുമോ അതോ സര്‍ക്കാരിന് ബുദ്ധിമുട്ടുണ്ടാക്കാതിരിക്കാന്‍ മിണ്ടാതിരിക്കുമോ; ലീഗിനോട് ഡി.എം.കെ

ചെന്നൈ: മദ്രാസ് ഹൈക്കോടതിയുടെ ഗോവധ നിരോധന ഉത്തരവില്‍ മുസ്‌ലിം ലീഗിനോട് ചോദ്യങ്ങളുമായി...

வேலூர்: குறைகளைச் சொன்ன தூய்மைப் பணியாளர்கள்; குறிப்பெடுத்துக்கொண்ட தவெக எம்எல்ஏ வினோத் கண்ணன்!

உலக பட்டினி தினத்தையொட்டி, வேலூர் சட்டமன்றத் தொகுதி த.வெ.க சார்பாக இன்றைய...

Kuwait-Iran: కువైట్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి.. పశ్చిమాసియాలో టెన్షన్

అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని అమెరికా సెంట్రల్...

ಶಾಸಕ ಸ್ಥಾನದಿಂದ ಸಿಎಂ ಸ್ಥಾನದವರೆಗೆ: ಸಿದ್ದರಾಮಯ್ಯನವರ ಸುದೀರ್ಘ ರಾಜಕಾರಣದ ಹಾದಿ ಹೀಗಿತ್ತು..!

ಬೆಂಗಳೂರು, ಮೇ, 28,2026 (www.justkannada.in):  ಕೊಟ್ಟ ಮಾತಿನಂತೆ ಹೈಕಮಾಂಡ್ ಸಲಹೆಯಂತೆ...