28
May, 2026

A News 365Times Venture

28
Thursday
May, 2026

A News 365Times Venture

Sun Risers Hyderabad: పెవిలియన్‌కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..

Date:

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. ‘కాటేరమ్మ కొడుకులు’ అంటూ సోషల్ మీడియాలో భారీ హైప్ తెచ్చుకున్న హైదరాబాద్ పవర్‌హౌస్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు, రాజస్థాన్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగే బౌలింగ్ దాటికి క్రీజులో నిలవలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. కేవలం 5.1 ఓవర్లలోనే 63 పరుగులకే 4 ముఖ్యమైన వికెట్లు కోల్పోయి హైదరాబాద్ కోలుకోలేని దెబ్బతింది. ప్రస్తుతం పవర్ ప్లే ముగిసే సరికి హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 71 పరుగులు పూర్తి చేశారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఎదుర్కొన్న రెండో బంతికే జోఫ్రా ఆర్చర్ వేసిన బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత డేంజర్ మ్యాన్ ట్రావిస్ హెడ్ 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 17 పరుగులు చేసి ఊపు మీదున్నట్లు కనిపించినా, అతడిని కూడా ఆర్చర్ క్లీన్ బౌల్డ్ చేసి క్లీన్ స్వీప్ చేశాడు. దీంతో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడింది.

మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఒంటరి పోరాటం చేస్తూ కేవలం 11 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 33 పరుగులు బాది రన్‌రేట్‌ను పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, జోఫ్రా ఆర్చర్ మూడో ఓవర్లో ఇషాన్ కిషన్‌ను కూడా ఫెరీరా చేతికి క్యాచ్ చిక్కేలా చేసి సన్‌రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. కేవలం 3 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చినప్పటికీ, ప్రత్యర్థి జట్టుకు వెన్నుముక లాంటి 3 కీలక వికెట్లను ఆర్చర్ పడగొట్టడం విశేషం.

ఇక ఆర్చర్‌కు తోడుగా నండ్రే బర్గర్ కూడా లైనప్‌ను దెబ్బతీశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన స్మరణ్ రవిచంద్రన్ (1) బర్గర్ బౌలింగ్‌లో ఆర్చర్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో పవర్‌ప్లే ముగియక ముందే 63 పరుగులకే సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. ప్రస్తుతం క్రీజులో హెన్రిచ్ క్లాసెన్ (4), నితీష్ కుమార్ రెడ్డి (2) ఉన్నారు. హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో నిలవాలంటే ఈ జోడి అద్భుతం చేయాల్సిందే.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കോംഗോയില്‍ എബോളയും യുദ്ധവും വിനാശകരമായ കൂട്ടിമുട്ടലില്‍; വെടിനിര്‍ത്തലിന് ആഹ്വാനം ചെയ്ത് ലോകാരോഗ്യ സംഘടന

  ജനീവ: ഡെമോക്രാറ്റിക് റിപ്പബ്ലിക് ഓഫ് കോംഗോയുടെ കിഴക്കന്‍ മേഖലയില്‍ പടരുന്ന...

ಕಾಂಗ್ರೆಸ್ ಹೈಕಮಾಂಡ್ ಸದ್ಯಕ್ಕೆ ಯಾವುದೇ ನಿರ್ಧಾರಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ-ರಣದೀಪ್ ಸಿಂಗ್ ಸುರ್ಜೇವಾಲ

ಬೆಂಗಳೂರು,ಮೇ,27,2026 (www.justkannada.in): ಸಿಎಂ ಬದಲಾವಣೆ ವಿಚಾರ ಸಂಬಂಧ ರಾಜ್ಯ ಕಾಂಗ್ರೆಸ್...

ഏകീകൃത സിവില്‍ കോഡ് പാസാക്കുന്ന മൂന്നാം സംസ്ഥാനമായി അസം; വടക്കുകിഴക്കന്‍ ഇന്ത്യയില്‍ ആദ്യം

ദിസ്പൂര്‍: ഏകീകൃത സിവില്‍ കോഡ് ബില്‍ പാസാക്കി അസം. അഞ്ച് മണിക്കൂര്‍...