25
May, 2026

A News 365Times Venture

25
Monday
May, 2026

A News 365Times Venture

Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి

Date:

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే చకచకా పనులు జరిగిపోతున్నాయి. తాజాగా కోల్‌కతా మెట్రో ఆరెంజ్ లైన్‌లోని చింగ్రిఘాట క్రాసింగ్ సెక్షన్‌లో గత టీఎంసీ ప్రభుత్వం హయాంలో 15 ఏళ్లు ఆలస్యమైన గర్డర్ లాంచింగ్ పనులను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం 15 రోజుల్లోనే పూర్తి చేసిందని బీజేపీకి చెందిన అమిత్ మాల్వీయా తెలిపారు. 366 మీటర్ల పొడవున్న ఈ అసంపూర్ణ మార్గం కోల్‌కతా దక్షిణ శివారు ప్రాంతాలను సెక్టార్ Vతో కలుపుతుందని అన్నారు. ఆర్‌వీఎన్ఎల్ ఈ పనిని వరుసగా రెండు వారాంతాల్లో పూర్తి చేసిందని చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో పేర్కొన్నారు.

 

‘‘మమతా బెనర్జీ 15 ఏళ్లలో చేయలేని పనిని సువేందు అధికారి, బీజేపీ ప్రభుత్వం కేవలం 15 రోజుల్లోనే పూర్తిచేశారు. కోల్‌కతా మెట్రో ఆరెంజ్ లైన్‌లోని చింగ్రిఘాట క్రాసింగ్ సెక్షన్ దగ్గర చాలాకాలంగా ఆలస్యమైన గర్డర్ లాంచింగ్ పనులను ఆర్‌విఎన్‌ఎల్ (RVNL) నిర్ణీత గడువు కంటే ముందే విజయవంతంగా పూర్తి చేసింది. కోల్‌కతా దక్షిణ శివారు ప్రాంతాలను సెక్టార్ Vలోని ఐటీ హబ్‌తో అనుసంధానించే న్యూ గరియా-ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్‌ను పూర్తి చేయడానికి.. ఈ 366 మీటర్ల లోపించిన భాగం చాలా కీలకం. ఈ ప్రాజెక్ట్ సంవత్సరాల తరబడి ఎందుకు నిలిచిపోయింది?, ఎందుకంటే మమతా బెనర్జీ ప్రభుత్వం ట్రాఫిక్ మళ్లింపునకు పదేపదే అనుమతి నిరాకరించింది. పనిని పూర్తి చేయడానికి ఆర్‌విఎన్‌ఎల్ కేవలం వరుసగా రెండు వారాంతాల పాటు రాత్రిపూట ట్రాఫిక్ దిగ్బంధనాలకు మాత్రమే అనుమతి కోరింది. రాజకీయ అడ్డంకి తొలగిపోయిన వెంటనే పనులు వేగవంతమయ్యాయి. సంవత్సరాలుగా, ఈ ఆలస్యాలకు కారణం “సాంకేతిక కారణాలే” అని బెంగాల్ ప్రజలకు చెబుతూ వచ్చారు. కానీ, అసలు అతిపెద్ద సాంకేతిక సమస్య టీఎంసీ ప్రభుత్వమే అని తేలింది.’’ అని రాసుకొచ్చారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అనంతరం సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర మద్దతుతో బెంగాల్ లో పనులు వేగవంతం అయ్యాయి.

 

 


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പ്ലസ് വണ്‍ പ്രവേശനം; ബാച്ചുകളും സീറ്റുകളും വര്‍ധിപ്പിച്ചു

തിരുവനന്തപുരം: സംസ്ഥാനത്ത് പ്ലസ് വണ്‍ സീറ്റുകള്‍ വര്‍ധിപ്പിച്ചു. അധിക സീറ്റുകളും ബാച്ചുകളും...

எம்‌.எல்.ஏ பதவியை ராஜினாமா செய்த தாராபுரம் சத்யபாமா, பெருந்துறை ஜெயக்குமார்! – பின்னணி என்ன?

ஈரோடு மாவட்டம், பெருந்துறை சட்டமன்றத் தொகுதியில் அ.தி.மு.க தரப்பில் போட்டியிட்டு மக்களால்...

ಸಿಎಂ ಸಿದ್ದು ಸು”ಭದ್ರ”; ಡಿಕೆಶಿಗೆ “ಗೃಹ”, ಡಿಕೆಸುಗೆ “ರಾಜ್ಯಸಭಾ” ಸ್ಥಾನ..? ಹೈಕಮಾಂಡ್‌ ತಂತ್ರ .!

ಬೆಂಗಳೂರು: ರಾಜ್ಯ ಕಾಂಗ್ರೆಸ್‌ನಲ್ಲಿ ಮತ್ತೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಹುದ್ದೆ ಕುರಿತ ಚರ್ಚೆಗಳು...