25
May, 2026

A News 365Times Venture

25
Monday
May, 2026

A News 365Times Venture

Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్‌పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్

Date:

Virat Kohli: ఐపీఎల్ 2026 చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్ క్వాలిఫయర్స్ ఎవరో తేలిపోయింది. ముంబై ఇండియన్స్ పై విజయం సాధించిన రాజస్థాన్ జట్టు నాల్గవ క్వాలిఫయర్ గా చేరింది. దీనితో ఇప్పుడు అందిరి చూపు క్వాలిఫయర్-1 మ్యాచ్‌ పై పడింది. అయితే ఇది ఇలా ఉండగా క్వాలిఫయర్-1 మ్యాచ్‌ ముందు విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధర్మశాలలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య కీలక పోరుకు ముందు ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా కోహ్లీ, గిల్ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సరదా చర్చ సాగింది. ఈ సమయంలో గిల్ కొత్త గడ్డం లుక్‌ ను చూసిన కోహ్లీ సరదాగా ఆటపట్టించడం వీడియోలో కనిపించింది. కోహ్లీ వ్యాఖ్యలకు గిల్ కూడా నవ్వుతూ స్పందించడంతో అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం గిల్ హెవీ బీర్డ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. సాధారణంగా క్లీన్ షేవ్ లేదా తక్కువ గడ్డంతో కనిపించే గిల్, ఈసారి పూర్తిగా కొత్త స్టైల్‌లో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ లుక్ తనకు “లక్ చార్మ్”గా మారిందని గిల్ ఇప్పటికే సరదాగా చెప్పాడు. గిల్‌కు ఈ సీజన్ అద్భుతంగా సాగుతోంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ముందుండి జట్టును నడిపిస్తున్న అతడు, టాప్ ఆర్డర్‌లో భారీ పరుగులు చేస్తూ జట్టును ప్లేఆఫ్స్‌లో టాప్-2 స్థానం వరకు తీసుకెళ్లాడు.

ఇకపోతే భారత జట్టులో కలిసి ఆడిన కోహ్లీ, గిల్ మధ్య మంచి అనుబంధం ఉంది. యువ ఆటగాడిగా గిల్ ఎదుగుదలలో కోహ్లీ ప్రోత్సాహం ఎంతో ఉందని పలుమార్లు చర్చ జరిగింది. కోహ్లీ ఆగ్రెసివ్ ఆటతీరు, ఫిట్‌నెస్, పెద్ద మ్యాచ్‌లలో ఒత్తిడిని ఎదుర్కొనే విధానం నుంచి చాలా నేర్చుకున్నానని గిల్ కూడా గతంలో చెప్పాడు. ఇక ఈ వీడియో బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియాలో భారీగా షేర్ చేస్తున్నారు. “సీనియర్-జూనియర్ మోమెంట్”, “కోహ్లీ-గిల్ బాండింగ్ సూపర్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సరదా ఘటనతో క్వాలిఫయర్-1పై మరింత ఆసక్తి పెరిగింది. కోహ్లీ ఆర్సీబీ, గిల్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే ఈ పోరులో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2026 ఫైనల్‌కు అర్హత సాధించనుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో తలపడనుంది.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..

తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలను (SHGs) మరింత బలోపేతం చేయడమే...

‘ഇവനോടല്ലേ കടക്ക് പുറത്ത് പറയേണ്ടത്,’: സേവ് സിപി.ഐ.എം എന്ന പേരില്‍ എ. വിജയരാഘവനെതിരെ ഫ്‌ളക്‌സ്

തിരൂര്‍: സി.പി.ഐ.എം പൊളിറ്റ് ബ്യൂറോ അംഗം എ.വിജയരാഘവനെതിരെ തിരൂരില്‍ ഫ്‌ളക്‌സ് ബോര്‍ഡ്....

‘കോരന്റെ മകനെ അംഗീകരിക്കാനാവാത്ത ഫ്യൂഡല്‍ വരേണ്യത സഖാവിനെ ആക്രമിച്ചുകൊണ്ടേയിരിക്കുന്നു’; പിണറായി വിജയന് ജന്മദിനാംശസയുമായി റിയാസ്

കോഴിക്കോട്: സംസ്ഥാന മുന്‍ മുഖ്യമന്ത്രിയും ഇപ്പോഴത്തെ പ്രതിപക്ഷ നേതാവുമായ പിണറായി വിജയന്...