21
May, 2026

A News 365Times Venture

21
Thursday
May, 2026

A News 365Times Venture

Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్‌లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్

Date:

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడీ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ‘‘నెతన్యాహు చాలా మంచి వ్యక్తి. నేను కోరుకున్నది ఏదైనా సరే.. ఆయన చేస్తారు. చాలా మంచి మనిషి. నేను ఏం చెప్పినా అదే చేస్తారు. నా మాట వింటారు’’ అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు సరైన గౌరవం దక్కడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘నా అభిప్రాయం ప్రకారం ఇజ్రాయెల్‌లో ఆయనకు సరైన గౌరవం దక్కడం లేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రజల్లో నాకు 99 శాతం మద్దతు ఉంది. నేను అక్కడ ప్రధాని పదవికి పోటీ చేసినా గెలిచే పరిస్థితి ఉంది.’’ అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్-నెతన్యాహు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా.. ఇప్పుడు చేసిన ఈ కామెంట్స్ మరింత హాట్ టాపిక్‌గా మారాయి.

 


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

14 വർഷങ്ങൾക്ക് ശേഷം ഇങ്ങനെയൊന്ന് ആദ്യം; വമ്പൻ നാണക്കേടിൽ തിലക്

ഐ.പി.എല്ലിൽ കൊൽക്കത്ത നൈറ്റ് റൈഡേഴ്സും മുംബൈ ഇന്ത്യൻസും ഈഡൻ ഗാർഡൻസിൽ ഏറ്റുമുട്ടുകയാണ്....

'ரஹ்மான் கலி' டு 'ராம் கலி' : 80 ஆண்டுகளுக்குப் பின் பழைய பாரம்பர்யத்தை மீட்டெடுக்கும் பாகிஸ்தான்!

பாகிஸ்தான் அரசு தன் நாட்டின் பழமையை பாதுகாக்கும் வகையில் தன் நாட்டின்...

KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..

ఐపీఎల్ 2026 లీగ్ దశలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా...

ಇಡೀ ದೇಶವನ್ನೇ ಮುಳುಗಿಸಿ ಬಿಟ್ಟಲ್ರಿ- ಮೋದಿ ವಿರುದ್ದ ಸಚಿವ ಸಂತೋಷ್ ಲಾಡ್ ಕಿಡಿ

ಬೆಂಗಳೂರು,ಮೇ,20,2026 (www.justkannada.in): ಪಾಕಿಸ್ತಾನಕ್ಕಿಂತ ಕೆಟ್ಟ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಭಾರತದ ಕರೆನ್ಸಿ ಇದೆ....