20
May, 2026

A News 365Times Venture

20
Wednesday
May, 2026

A News 365Times Venture

Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం

Date:

తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి (కేబినెట్) సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీన (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని సమావేశ మందిరంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు , కార్యదర్శులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశంలో చర్చించాల్సిన ఎజెండా అంశాలను, వాటి పక్కా తెలుగు అనువాదంతో కలిపి మంగళవారం సాయంత్రం 6 గంటల లోపు తప్పనిసరిగా సాధారణ పరిపాలన (కేబినెట్) శాఖకు పంపాలని సీఎస్ స్పష్టం చేశారు. ఒకవేళ ఏ శాఖకైనా కేబినెట్ చర్చ పరిధిలోకి వచ్చే ఎజెండా అంశాలు లేకపోయినా.. ఆ వివరాలతో కూడిన ‘నిల్’ (NIL) నివేదికను కూడా నిర్దేశిత గడువులోగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, కేబినెట్ సమావేశం జరిగే సమయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు , ప్రభుత్వ కార్యదర్శులందరూ ఏ ఒక్కరూ సెలవు పెట్టకుండా తప్పనిసరిగా హెడ్‌క్వార్టర్స్ (కార్యాలయాల) లోనే అందుబాటులో ఉండాలని సీఎస్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు కీలక నిర్ణయాలు, తాజా రాజకీయ, పరిపాలనాపరమైన అంశాలపై ఈ కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഉമര്‍ ഖാലിദിന്റെ ജാമ്യാപേക്ഷ ദല്‍ഹി കോടതി തള്ളി

ന്യൂദല്‍ഹി: പൗരത്വ സമരകാലത്തെ കേസുകളില്‍ വിചാരണ തടവില്‍ കഴിയുന്ന ഉമര്‍ ഖാലിദിന്റെ...

AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..

AP Heatwave Alert: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని రాష్ట్ర...

ಹೈಕಮಾಂಡ್ ಸಿಎಂ, ಡಿಸಿಎಂ ಕರೆಸಿ ಮಾತನಾಡ್ತಾರೆ, ನಮ್ಮನ್ನಲ್ಲ- ಸಚಿವ ಸತೀಶ್ ಜಾರಕಿಹೊಳಿ

ಬೆಂಗಳೂರು,ಮೇ,19,2026 (www.justkannada.in):  ಸಿಎಂ ಬದಲಾವಣೆ ವಿಚಾರ ಚರ್ಚೆಯಾಗುತ್ತಿದ್ದು ಈ ಮಧ್ಯೆ...