13
May, 2026

A News 365Times Venture

13
Wednesday
May, 2026

A News 365Times Venture

Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్‌ కల్యాణ్‌.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక

Date:

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకుని నేడు హైదరాబాద్‌ నుంచి మంగళగిరికి రానున్నారు. గత మూడు వారాలుగా హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్‌ కల్యాణ్‌ తిరిగి అధికారిక కార్యక్రమాలకు హాజరుకానుండటంతో జనసేన శ్రేణులు, అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి పవన్‌ కల్యాణ్‌ బయలుదేరనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ప్రయాణం కానున్నారు. ఇక, ఉదయం 10:40 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న డిప్యూటీ సీఎం, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరికి బయలుదేరనున్నారు. ఉదయం 11:30 గంటలకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకునేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

కాగా, శస్త్రచికిత్స అనంతరం కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకున్న పవన్‌ కల్యాణ్‌.. మళ్లీ ప్రజా కార్యక్రమాల్లో పాల్గొననుండటంతో పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఆయన రాక సందర్భంగా గన్నవరం నుంచి మంగళగిరి వరకు జనసేన నాయకులు, అభిమానులు భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ మధ్య హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. స్వయంగా పవన్‌ కల్యాణ్‌ నివాసానికి వెళ్లి.. పవన్‌ను పరామర్శించిన విషయం విదితమే..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സി.ബി.ഐ ഡയറക്ടർ നിയമനം: കേന്ദ്രത്തിനെതിരെ രൂക്ഷവിമർശനവുമായി രാഹുൽ ഗാന്ധി; പ്രതിപക്ഷ നേതാവ് റബ്ബർ സ്റ്റാമ്പല്ലെന്ന് കത്ത്

ന്യൂദൽഹി: പുതിയ സി.ബി.ഐ ഡയറക്ടർ തെരഞ്ഞെടുപ്പ് രീതികളിൽ വിമർശനവുമായി ലോക്സഭാ പ്രതിപക്ഷ...

தமிழ்நாடு சட்டமன்றத்தில் இன்று 'நம்பிக்கை வாக்கெடுப்பு' – பெரும்பான்மையை நிரூபிப்பாரா விஜய்?|Live Updates

ஒரு வாக்கால் ஒரு வாக்கு மிஸ் ஆகிறதுமுன்னாள் திமுக அமைச்சர் பெரிய...

ಮೀಸಲಾತಿ ಹೆಚ್ಚಳ ಶೆಡ್ಯೂಲ್ 9ಗೆ ಸೇರಿಸಲು ಒತ್ತಡ: ಸರ್ವಪಕ್ಷ ನಿಯೋಗಕ್ಕೆ  ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸಹಮತ

ಬೆಂಗಳೂರು,ಮೇ,12,2026 (www.justkannada.in):   ಪರಿಶಿಷ್ಟ ಜಾತಿ ಮತ್ತು ಪರಿಶಿಷ್ಟ ಪಂಗಡದ ಮೀಸಲಾತಿ...

ബ്രാഹ്‌മണ പൂജാരിമാരുടെ ആധിപത്യത്തിനു കീഴടങ്ങാത്ത ‘ക്ഷേത്ര’ങ്ങളിലാണ് അദ്ദേഹം പോയത്; ജയരാജന്റെ കൊടുങ്ങല്ലൂര്‍ സന്ദര്‍ശനത്തില്‍ വിനില്‍ പോള്‍

കോഴിക്കോട്: ഗ്രന്ഥരചനയുടെ ഭാഗമായി കൊടുങ്ങല്ലൂര്‍ ക്ഷേത്രത്തിലെത്തിയ പി. ജയരാജനെതിരെയുള്ള വിമര്‍ശനങ്ങളില്‍ പ്രതികരണവുമായി...