6
July, 2026

A News 365Times Venture

6
Monday
July, 2026

A News 365Times Venture

Google Fitbit Air: మీ మెడికల్ రిపోర్టులను విశ్లేషించే AI కోచ్.. గూగుల్‌ నుంచి స్క్రీన్ లేని వినూత్న ఫిట్‌నెస్ ట్రాకర్ ..

Date:

Google Fitbit Air: గూగుల్ తన ఫిట్‌నెస్ విభాగంలో ఓ వినూత్న మార్పుకు శ్రీకారం చుట్టింది. స్మార్ట్‌వాచ్ ఫీచర్ల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఆరోగ్య మార్గదర్శకత్వానికే ప్రాధాన్యతనిస్తూ ‘ఫిట్‌బిట్ ఎయిర్’ (Fitbit Air) పేరుతో సరికొత్త ఫిట్‌నెస్ ట్రాకర్‌ను పరిచయం చేసింది. దీంతో పాటు ‘గూగుల్ హెల్త్’ యాప్‌ను తయారు చేసింది. అంతేకాదు.. ‘AI హెల్త్ కోచ్’ సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. హార్డ్‌వేర్ కంటే సాఫ్ట్‌వేర్ ఆధారిత ఆరోగ్య సాధనాలపై గూగుల్ తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. సాధారణ ఫిట్‌నెస్ బ్యాండ్‌లకు భిన్నంగా ఫిట్‌బిట్ ఎయిర్‌ ఉంటుంది. ఇందులో ఎటువంటి స్క్రీన్, నోటిఫికేషన్లు లేదా గడియారం ఉండవు. ఇది కేవలం 12 గ్రాముల బరువుతో అత్యంత తేలికగా ఉంటుంది. దీని ధర 100 డాలర్లు (సుమారు రూ.8,300) కాగా, బాస్కెట్‌బాల్ దిగ్గజం స్టీఫెన్ కర్రీ స్పెషల్ ఎడిషన్ ధరను 130 డాలర్లుగా నిర్ణయించారు. వినియోగదారుడు పదేపదే స్క్రీన్ వైపు చూడకుండా, నిశ్శబ్దంగా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆరోగ్య డేటాను సేకరించడం దీని లక్ష్యం.

ఇది హృదయ స్పందన రేటు (Heart Rate), నిద్ర దశలు, స్లీప్ స్కోర్, గుండె లయలో మార్పుల (AFib alerts)ను ఇది పర్యవేక్షిస్తుంది. ఒత్తిడి స్థాయిలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే హెచ్ఆర్‌వీ (HRV) డేటాను సైతం ఇది అందిస్తుంది. నడక, రన్నింగ్, సైక్లింగ్, రోయింగ్ వంటి దాదాపు 140 రకాల వ్యాయామాలను ఇది ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. సేకరించిన డేటాను గూగుల్ జెమిని (Gemini) ఆధారిత AI విశ్లేషించి, వినియోగదారులకు వ్యక్తిగత ఫిట్‌నెస్ ప్లాన్‌లు, నిద్ర సూచనలను అందిస్తుంది. స్మార్ట్ వేక్ అలారం, సైలెంట్ వైబ్రేషన్ అలారం, రెడీనెస్ స్కోర్, కార్డియో లోడ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మునుపటి మోడళ్ల కంటే ఇది 15 శాతం ఎక్కువ ఖచ్చితత్వంతో పనిచేస్తుందని గూగుల్ పేర్కొంది.

ఇక, మే 19 నుంచి ప్రస్తుతం ఉన్న ఫిట్‌బిట్ యాప్ ఆటోమేటిక్‌గా ‘గూగుల్ హెల్త్’ యాప్‌గా అప్‌డేట్ అవుతుందని కంపెనీ వివరించింది. ఫిట్‌బిట్ వినియోగదారుల పాత డేటా అంతా ఇందులోకి మారుతుంది. ఈ కొత్త యాప్‌లో నాలుగు విభాగాలు (Today, Fitness, Sleep, Health) ఉంటాయి. ఇది వేరబుల్స్ డేటాతో పాటు ఆపిల్ హెల్త్, హెల్త్ కనెక్ట్, మెడికల్ రికార్డులను ఒకే చోట పొందుపరుస్తుంది. అలాగే, గూగుల్ హెల్త్ ప్రీమియం సభ్యుల కోసం ‘AI హెల్త్ కోచ్’ అందుబాటులోకి వస్తోంది. ఇది యూజర్ డేటాతో పాటు అప్‌లోడ్ చేసిన మెడికల్ రిపోర్టులు, ఫోటోలను విశ్లేషించి సరైన వర్కవుట్ ప్లాన్‌లు, రికవరీ సలహాలను ఇస్తుంది. ఫిట్‌బిట్ ఎయిర్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. మే 26 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. భారత్‌లో దీని విడుదలపై గూగుల్ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വഖഫ് ബോര്‍ഡില്‍ ഹിന്ദു അംഗങ്ങളെ നിയമിച്ച് മധ്യപ്രദേശ് സര്‍ക്കാര്‍; വഖഫ് നിയമഭേദഗതിയിലെ വിവാദ വ്യവസ്ഥ നടപ്പിലാക്കുന്ന ആദ്യ സംസ്ഥാനം

  ഭോപ്പാല്‍: ചരിത്രത്തിലാധ്യമായി വഖഫ് ബോര്‍ഡില്‍ രണ്ട് ഹിന്ദു അംഗങ്ങളെ ഉള്‍പ്പെടുത്തി...

தமிழ்நாடு அரசு போக்குவரத்து கழகத்துக்கு 2,000 புதிய மின்சார ஏசி பேருந்துகள்! – விரைவில் டெண்டர்

தமிழ்நாட்டில் பொதுப் போக்குவரத்து சேவையை மேம்படுத்தும் நடவடிக்கைகளின் ஒரு பகுதியாக, தமிழ்நாடு...

മുന്‍ കോളനികള്‍ ബ്രിട്ടന് നഷ്ടപരിഹാരം നല്‍കണമെന്ന് മുന്‍ ആഭ്യന്തര മന്ത്രി; ഈ രാജ്യങ്ങള്‍ വളരാന്‍ കാരണം ബ്രിട്ടനെന്നും വാദം, പ്രതിഷേധം

ലണ്ടന്‍: ബ്രിട്ടന്റെ മുന്‍ കോളനികള്‍ ബ്രിട്ടന് തിരിച്ച് നഷ്ടപരിഹാരം നല്‍കണമെന്ന് മുന്‍...