18
May, 2026

A News 365Times Venture

18
Monday
May, 2026

A News 365Times Venture

TGSRTC: ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్స్ ఇవే.. తప్పక తెలుసుకోండి..

Date:

TGSRTC: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. ఆర్టీసీ సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఆర్టీసీ సమ్మెతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని ఆర్టీవోలకు ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వీలైనన్ని ఎక్కువ ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. దీంతో అద్దె బస్సులు ఆర్టీసీ యాజమాన్యం యథావిధిగా నడుపుతోంది. అసలు ఆర్టీసీ కార్మికులు సమ్మే చేయడానికి గల కారణాలు ఏంటి? వారి ప్రధాన డిమాండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

1.‘ప్రభుత్వంలో విలీనం’ అతి ముఖ్యమైన డిమాండ్
2. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వ శాఖగా గుర్తించాలి.
3. ఉద్యోగులందరినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలి.
4. 2021 నుంచి పెండింగ్‌లో ఉన్న 30 శాతం ఫిట్‌మెంట్ (PRC) అమలును తక్షణమే చేపట్టాలి.
5.కేవలం వేతనాలే కాకుండా, గత ఏడేళ్లుగా (2017 నుంచి) పెండింగ్‌లో ఉన్న వివిధ అలవెన్సులను క్లియర్ చేయాలి
6.ఆర్టీసీ సంస్థపై ఉన్న అప్పుల భారాన్ని ప్రభుత్వం స్వీకరించి, సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలి.
7. రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 3 శాతం నిధులను ఆర్టీసీకి కేటాయించి కొత్త బస్సుల కొనుగోలు, పాత బస్సుల మరమ్మతులు, వర్క్‌షాపుల ఆధునికీకరణ చేపట్టాలి.
8. కార్మికుల సంక్షేమంలో భాగంగా 8 గంటల పని షిఫ్ట్‌ను ఖచ్చితంగా అమలు చేయాలి.
9. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేయాలి.
10. చర్చల పేరుతో కాలయాపన చేయకుండా, స్పష్టమైన ఉత్తర్వులు వచ్చే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.

READ MORE: TGSRTC: ఆర్టీసీ సమ్మె షురూ.. రాష్ట్రవ్యాప్తంగా డిపోలకే పరిమితమైన బస్సులు..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഒ.ബി.സി വിഭാഗങ്ങൾക്കുള്ള സംവരണം നിർത്തലാക്കി ബംഗാളിലെ ബി.ജെ.പി സർക്കാർ

കൊൽക്കത്ത: ഒ.ബി.സി വിഭാഗക്കാർക്കുള്ള സംവരണം നിർത്തലാക്കി ബംഗാളിൽ പുതുതായി അധികാരത്തിലേറിയ സുവേന്ദു...

ராகுல் காந்தி, பினராயி விஜயன் முன்னிலையில் வி.டி.சதீசன் கேரள முதல்வராக பதவியேற்பு Photo Album

ராகுல் காந்தி, பிரியங்கா காந்தி, பினராயி விஜயன் உள்ளிட்ட முக்கிய தலைவர்கள்...

Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!

ఆస్తుల కోసం రక్త సంబంధీకులే పగవాళ్లుగా మారుతున్నారు. సొంత వారిని హత్య...