19
May, 2026

A News 365Times Venture

19
Tuesday
May, 2026

A News 365Times Venture

Iran-US Talks: ఇరాన్-అమెరికా తదుపరి చర్చలపై అప్‌డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!

Date:

అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి చర్చలకు మార్గం సుగమం అయినట్లుగా తెలుస్తోంది. గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా 21 గంటల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఇంకోవైపు రెండు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఈనెల 21తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొన వచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ ఇరాన్‌లో పర్యటిస్తున్నాడు. తదుపరి చర్చల కోసం ఒప్పించేందుకు ఇరాన్ పెద్దలతో సమావేశం అయ్యారు. మొత్తానికి చర్చలపై క్లారిటీ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

సోమవారం ఇస్లామాబాద్ వేదికగా మరోసారి అమెరికా-ఇరాన్ చర్చలు ఉండొచ్చని నివేదికలు అందుతున్నాయి. ఈ మేరకు ఇరాన్ అధికారి ఒకరు మీడియాకు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అమెరికా అధికారులు మాత్రం అధికారికంగా ధృవకరించలేదు.

ఇది కూడా చదవండి: Modi Cabinet: ఉ.11:30కి మోడీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

ఇదిలా ఉంటే యురేనియం మొత్తం అమెరికాకు అప్పగించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించారు. మొత్తానికి పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఒకవేళ చర్చలు ఫలిస్తే.. సంతకాల కోసం తాను వ్యక్తిగతంగా పాకిస్థాన్ వెళ్తానని ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి అసిమ్ మునీర్ చాలా మంచి పని చేస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഒ.ബി.സി വിഭാഗങ്ങൾക്കുള്ള സംവരണം നിർത്തലാക്കി ബംഗാളിലെ ബി.ജെ.പി സർക്കാർ

കൊൽക്കത്ത: ഒ.ബി.സി വിഭാഗക്കാർക്കുള്ള സംവരണം നിർത്തലാക്കി ബംഗാളിൽ പുതുതായി അധികാരത്തിലേറിയ സുവേന്ദു...

ராகுல் காந்தி, பினராயி விஜயன் முன்னிலையில் வி.டி.சதீசன் கேரள முதல்வராக பதவியேற்பு Photo Album

ராகுல் காந்தி, பிரியங்கா காந்தி, பினராயி விஜயன் உள்ளிட்ட முக்கிய தலைவர்கள்...

Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!

ఆస్తుల కోసం రక్త సంబంధీకులే పగవాళ్లుగా మారుతున్నారు. సొంత వారిని హత్య...