17
April, 2026

A News 365Times Venture

17
Friday
April, 2026

A News 365Times Venture

Delimitation: డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి లాభమా..నష్టమా..? లెక్కలు ఏం చెబుతున్నాయి..?

Date:

Delimitation: కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన కోసం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్‌లో కీలక బిల్లును తీసుకువచ్చింది. మూడు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చించనున్నారు. అయితే, డీలిమిటేషన్స్ వల్ల అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే, విపక్షాలు మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నాయి. డీలిమిటేషన్స్ వల్ల లోక్‌సభలో ఇప్పుడున్న 543 ఎంపీ సీట్ల సంక్య 850కు పెరుగుతుంది. ఇందులో 815 రాష్ట్రాలకు, 35 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండనున్నాయి. మొత్తం 50 శాతం సీట్ల సంఖ్య పెరగుతున్నాయి. ఇందులో మహిళా రిజర్వేషన్ ద్వారా 273 స్థానాలు కేటాయిస్తారు.

జనాభా ఆధారిత పునర్విభజన వల్ల, అధిక జనాభా పెరుగుదల ఉన్న ఉత్తరాదికి ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుంందని దక్షిణాది రాష్ట్రాల వాదన. మెరుగైన జనాభా నియంత్రణ చేసినందకు మేం ఎందుకు బాధపడాలని ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ పట్టు ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ సంఖ్య పెరిగితే ఆ పార్టీకి ప్రయోజనం చూకూరుతుంది విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల వాదనను పట్టించుకోరని ఆరోపిస్తున్నారు.

అయితే, దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడున్న ఎంపీ స్థానాల శాతం ప్రకారమే, పెరిగిన తర్వాత ఎంపీ సీట్ల శాతం ఉంటుందని లెక్కలేస్తున్నారు. 50 శాతం పెరుగుదలతో దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

Whatsapp Image 2026 04 16 At 10.14.00 Pm

1) తమిళనాడులో ప్రస్తుతం 39 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. మొత్తం ఎంపీ స్థానాలు(ఇప్పుడున్న 543)లో ఇది 7.2 శాతం. లోక్‌సభ స్థానాలు 850కి పెరిగితే, తమిళనాడులో 59 ఎంపీ స్థానాలు అవుతాయి. అప్పుడు మొత్తం ఎంపీ సీట్లలో తమిళనాడు వాటా 7.2గానే ఉంటుంది.

2) కర్ణాటకలో ప్రస్తుతం 28 ఎంపీ సీట్లు ఉంటే, పెరిగిన తర్వాత దీని సంఖ్య 42కు చేరుతాయి. ముందుగా 543లో 5.15 శాతం ఉంటే, 850లో 5.14 శాతం ఉంటుంది.

3) ఆంధ్రప్రదేశ్‌లో 25 స్థానాల నుంచి 38 స్థానాలకు పెరుగాయి. ఇప్పుడు ఎంపీల వాటా 4.6 శాతం ఉంటే, పెరిగిన తర్వాత 4.65 శాతం ఉంటుంది.

4) తెలంగాణలో 17 ఎంపీ సీట్లు 26కు పెరుగుతాయి. వాటా 3.13 శాతం ఉంటే పెరిగిన తర్వాత 3.18 శాతం ఉంటుంది.

5) కేరళలో 20 నుంచి 30కి ఎంపీ సీట్లు పెరుగుతాయి. కేరళ వాటా 3.68 శాతం నుంచి 3.67 శాతం ఉంటుంది.

ఈ లెక్కల్ని చూస్తే పెద్దగా సీట్ల శాతంలో మార్పు లేదు. ప్రస్తుతం 129 ఎంపీ స్థానాలు దక్షిణాది రాష్ట్రాల్లో ఉంటే, పెంపు తర్వాత 195 సీట్లకు పెరుగుతుంది. దక్షిణాది ఎంపీ వాటా 24 శాతంగానే ఉంటుంది. మొత్తంగా వాటాలో పెద్ద మార్పు రాదు. దక్షిణాదిలో సీట్లు పెరిగినప్పటికీ దాని ప్రభావం అలాగే ఉంటుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പശ്ചിമേഷ്യയിൽ വേണ്ടത് നീണ്ടുനിൽക്കുന്ന സമാധാനം; സൈനിക നീക്കങ്ങളിലൂടെ പ്രശ്നപരിഹാരം സാധ്യമല്ല; ഓസ്ട്രിയൻ ചാൻസലറുമായി കൂടിക്കാഴ്ച്ച നടത്തി മോദി

ന്യൂദൽഹി: പശ്ചിമേഷ്യയിൽ നീണ്ടുനിൽക്കുന്ന സമാധാനം വേണമെന്ന് പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദി. സൈനിക...

"தேசப்பற்றை பற்றி எங்களுக்குப் பாடம் எடுக்க வேண்டாம்.!" – பாஜக எம்.பி-க்கு பதிலடி கொடுத்த ஆ.ராசா

நாடாளுமன்ற சிறப்பு கூட்டத்தொடரில் பாஜக எம்.பி தேஜஸ்வி சூர்யாவிற்கு திமுக எம்.பி...

ಅನಧಿಕೃತ ಮದ್ಯ ಮಾರಾಟ ಅಂಗಡಿಗಳ ಮೇಲೆ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಿ- ಶಾಸಕ ಪಿ. ರವಿಕುಮಾರ್ ಸೂಚನೆ

ಮಂಡ್ಯ,ಏಪ್ರಿಲ್,16,2026 (www.justkannada.in): ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಮದ್ಯ ಮಾರಾಟ ಅಂಗಡಿಗಳು ಹೆಚ್ಚುತಿದ್ದು ಸಾರ್ವಜನಿಕ...

സ്ത്രീകൾ നിങ്ങളോട് ക്ഷമിക്കില്ല; പാർലമെന്റിൽ ഭേദഗതികളെ എതിർത്ത പ്രതിപക്ഷത്തിനെതിരെ മോദി

ന്യൂദൽഹി: പാർലമെന്റിൽ ഏകപക്ഷീയമായി അവതരിപ്പിച്ച നിയമഭേദഗതികളെ എതിർത്ത പ്രതിപക്ഷത്തിനെതിരെ പ്രതികരണവുമായി പ്രധാനമന്ത്രി...