23
September, 2026

A News 365Times Venture

23
Wednesday
September, 2026

A News 365Times Venture

Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

Date:

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీల్లో జరిగిన భారీ అవకతవకలపై విజిలెన్స్ విభాగం విచారణ పూర్తి చేసింది. క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో సుమారు 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మొదట 40 కోట్ల రూపాయలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ చివరకు వంద కోట్లకు చేరడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని, ఇందులో సుమారు 40 కోట్ల రూపాయలకు పైగా ప్రజా ధనం పక్కదారి పట్టినట్లు విచారణలో తేలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఫిర్యాదుల మేరకు విజిలెన్స్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరించి సుమారు 3000 పేజీల భారీ నివేదికను సిద్ధం చేశారు.

Varanasi: వారణాసి కథ ఇదేనా? గూస్‌బంప్స్ గ్యారెంటీ..

ఈ కుంభకోణానికి సంబంధించి సిద్ధమైన నివేదికలో అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా , శాప్ (SAAP) మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలు కీలక పాత్ర పోషించినట్లు విజిలెన్స్ స్పష్టంగా గుర్తించింది. వీరిద్దరితో పాటు అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, ఐఏఎస్ అధికారి ధ్యాన్ చంద్, రిటైర్డ్ ఐఏఎస్ వాణి మోహన్ , శాప్ ఐటి విభాగానికి చెందిన పలువురు అధికారుల పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో బాధ్యులైన నేతలు , అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉండి, నిధుల వినియోగంలో పారదర్శకత పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నారు.

Pawan : పవన్‌కల్యాణ్‌ను వెంటాడిన సెంటిమెంట్?

ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందిస్తూ, తప్పు చేయనప్పుడు మాజీ మంత్రి రోజా ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజల రక్తమాంసాలను పంచుకుని తిన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అది అధికారులైనా లేదా రాజకీయ నాయకులైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన హెచ్చరించారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణం ఉందా లేదా అనే అంశం కూడా నివేదిక అందిన తర్వాత స్పష్టమవుతుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడిన రోజా , బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలకు ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఇప్పుడు పెద్ద చిక్కుగా మారింది. త్వరలోనే ఈ నివేదిక అధికారికంగా ప్రభుత్వానికి చేరనుండటంతో, ప్రభుత్వం తీసుకునే చర్యలపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇതിഹാസങ്ങളെ ഒന്നടങ്കം വെട്ടിനിരത്തി; ഇംഗ്ലണ്ടിന്റെ ‘രാജാവ്’ ഇനി ലോകത്തിന്റെയും തലവന്‍!

ഇംഗ്ലണ്ടും ശ്രീലങ്കയും തമ്മിലുള്ള മൂന്ന് ഏകദിന മത്സരങ്ങള്‍ അടങ്ങുന്ന പരമ്പരയിലെ ആദ്യ...

"கம்யூனிஸ்ட்களின் வரலாற்றை ஆதவ் அர்ஜுனா படித்து முதல்வருக்கும் சொல்ல வேண்டும்" – வீரபாண்டியன் பதிலடி

"கம்யூனிஸ்ட் வரலாற்றை ஆதவ் அர்ஜுனா படித்து முதல்வருக்கும் சொல்ல வேண்டும்" என்று...

Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!

Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్ల...

മാധ്യമ ബഹിഷ്‌കരണത്തിന് പിന്നാലെ ട്രംപ് ടി.വി; വൈറ്റ് ഹൗസില്‍ നിന്ന് 24 മണിക്കൂര്‍ യൂട്യൂബ് ചാനല്‍

വാഷിങ്ടണ്‍: പ്രമുഖ അമേരിക്കന്‍ മാധ്യമസ്ഥാപനങ്ങള്‍ പ്രസിഡന്റ് ഡൊണാള്‍ഡ് ട്രംപിന്റെ പരിപാടികളുടെ ടെലിവിഷന്‍...