4
May, 2026

A News 365Times Venture

4
Monday
May, 2026

A News 365Times Venture

Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్‌ఛార్జ్‌ వడ్డింపు..

Date:

Flight Ticket Price Hike: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం విమాన ప్రయాణాల పై ఎఫెక్ట్ పడింది. అమెరికా.. యూరప్ దేశాలకు వెళ్లాలంటే మిడిల్ ఈస్ట్ దేశాల ఎయిర్ స్పేస్ మీదుగానే రూట్ అవుతాయి. ఇక ప్రస్తుతం యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల ఎయిర్ స్పేస్ తాత్కాలికంగా మూసివేయడంతో అనేక విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేశాయి. యుధ్ధం కారణంగా విమాన ప్రయాణాలు ఆగిపోవడంతో ఎమర్జెన్సీ ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగా.. కొన్ని సంస్థలు విమానాలను లిమిటెడ్ గా నడపడంతో టికెట్ ధరలు భారీగా పెరిగాయి. సాధారణ రోజులతో పోల్చితే మూడు రెట్ల అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నాయి.

ఇండియా నుంచి అమెరికా.. యూరప్ దేశాలకు కొన్ని విమానాలు మాత్రమే నడుస్తున్నాయి. అవి కూడా ఎయిర్ ఇండియావే. ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వ అనుమతి వుంటేనే నడుపుతున్నాయి. ఇండియా నుంచి అమెరికా.. యూరప్ వెళ్ళాలంటే టికెట్ ధర వన్ వే కే.. టూ వే టికెట్ ధరలు వసూలు చేస్తున్నాయి సంస్థలు. ఎయిర్ ఇండియా.. ఎతిహాద్.. ఎమిరేట్స్ విమానాల రేట్లకు రెక్కలొచ్చాయి. అమెరికా వెళ్ళాలంటే తొంభై వేల ధర ఉంటే ప్రస్తుతం లక్షన్నర ఉంది. టికెట్ ధరలు ఫ్లైట్ బుకింగ్ టైం లో ఒకలా.. పేమెంట్ టైం లో ఒకలా చూపిస్తున్నాయి. అంటే నిమిషం నిమిషానికి చార్జ్ మారుతోంది. గల్ఫ్ దేశాలకు కొన్ని విమానాలు నడుస్తున్నా అవి టేకాఫ్‌ అవుతాయా లేదా అన్నది మరో డైలమా. ఇంకొన్ని విమానాలు గమ్యస్థానాలకు వెళ్ళే దారి నుంచి వెనక్కి వచ్చేస్తున్నాయి.

హైదరాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు అధికంగా ప్రయాణికులు ఉంటారు. ఒకవేళ విమానాలు షెడ్యూల్ చేసినా ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయో అర్థంకాక ప్యాసింజర్లు ఇబ్బంది పడుతున్నారు. మొత్తంగా..యుద్ధం విమానయాన రంగాన్ని ప్రభావితం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కొన్ని సంస్థలు రిస్క్ ఎందుకులే అని తమ సర్వీసులను ఆపేయగా.. కొన్ని సంస్థలు భారీగా టికెట్ రేట్లు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నాయి. మొత్తంగా యుద్ధ ప్రభావంతో విమాన ప్రయాణాలు భారంగా మారాయి. టికెట్ దొరకడం ఒకెత్తయితే.. రేట్లు మరో ఎత్తు. టికెట్ దొరికినా అది డెస్టినేషన్‌కు పోతుందో….యుద్ధం భయంతో మధ్యలోనే రిటర్న్ అవుతుందో తెలీక ప్రయాణికులకు డైలమా తప్పడం లేదు.

ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు భారత విమానయాన రంగాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించాయి. ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో, Air India తన టిక్కెట్లపై ఇంధన సర్‌ఛార్జ్‌ను పెంచింది. ఈ పెంపు దేశీయ మరియు అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు ₹400 నుండి ₹3,000 వరకు అదనపు ఖర్చును కలిగిస్తుంది.

ప్రధాన కారణాలు
– పశ్చిమాసియాలో యుద్ధం మూడవ జెట్ ఇంధన సరఫరాకు దెబ్బతీస్తుంది.
– భారతదేశం దేశీయ చమురు మరియు గ్యాస్ అవసరంలో సుమారు 50% గల్ఫ్ దేశాల నుండి దిగుమతి చేస్తుంది.
– LPG ధరలు సిలిండర్‌కు ₹60 (గృహ) మరియు ₹115 (వాణిజ్య) పెరిగాయి.
– విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చుల్లో ATF (Aviation Turbine Fuel) 40% వాటా కలిగి ఉండడం వల్ల, ఇంధన ధరలు పెరగడం టికెట్ ఖర్చులను నేరుగా ప్రభావితం చేస్తాయి.

ఎయిర్ ఇండియా సర్‌ఛార్జ్ వివరాలు
– దేశీయ మార్గాల టిక్కెట్లు: సుమారు ₹399 వరకు అధికం.
– పశ్చిమాసియా విమానాలు: $10 పెరుగుదల.
– ఆగ్నేయాసియా విమానాలు: $20 పెరుగుదల.
– ఆఫ్రికా విమానాలు: $30 పెరుగుదల.

భవిష్యత్తు ప్రభావం
– ATF ధరలు పెరుగుతూ ఉంటే, విమాన టికెట్ ధరలు ఇంకా ఎక్కువవుతాయి.
– ప్రధాన నగరాల్లో (ఢిల్లీ, ముంబై) ATFపై అధిక ఎక్సైజ్ సుంకం మరియు VAT కారణంగా, విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు మరింత పెరుగుతాయి.
– ఎయిర్ ఇండియా ప్రకారం, కొత్త ఇంధన సర్‌ఛార్జ్ వ్యవస్థను మూడు దశల్లో అమలు చేస్తారు మరియు అన్ని విమానాలకు వర్తిస్తాయి.
– పరిస్థితులు అదే విధంగా కొనసాగితే, భవిష్యత్తులో భారతీయ విమాన ప్రయాణం మరింత ఖరీదైనదిగా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പൂട്ടിയ അക്കൗണ്ടിനൊപ്പം ഒന്നുകൂടി തുറന്ന് ബി.ജെ.പി; എല്‍.ഡി.എഫിന്റെ ജനപ്രിയരെ തോല്‍പ്പിച്ചും യു.ഡി.എഫിന് നേട്ടം സമ്മാനിച്ചും തിരുവനന്തപുരം

കഴിഞ്ഞ തെരഞ്ഞെടുപ്പില്‍ എല്‍.ഡി.എഫിനെ അകമഴിഞ്ഞ് സഹായിച്ച ജില്ലയായിരുന്നു തിരുവന്തപുരം. ആകെയുള്ള 14ല്‍...

அன்று எம்.ஜி.ஆர், இன்று விஜய்; ஆயிரம் விளக்கில் தவெக வென்றது எப்படி?

சென்னை ஆயிரம் விளக்கு தொகுதி எப்போதுமே ஒரு வி.ஐ.பி தொகுதியாகவே பார்க்கப்படும்....

West Bengal CM: బెంగాల్ సీఎం రేసులో ఆ నలుగురు.. చరిత్ర తిరగరాసేది ఎవరో..?

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ  సాధించిన చారిత్రాత్మక...

ಬೈ ಎಲೆಕ್ಷನ್ ನಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಗೆಲುವು: ಮತದಾರರಿಗೆ  ಧನ್ಯವಾದ ಅರ್ಪಿಸಿದ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ಮೇ,4,2026 (www.justkannada.in): ದಾವಣಗೆರೆ ದಕ್ಷಿಣ ಮತ್ತು ಬಾಗಲಕೋಟೆ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ...