25
April, 2026

A News 365Times Venture

25
Saturday
April, 2026

A News 365Times Venture

Maha Shivaratri 2026: ఈ 4 రాశుల వారికి శివయ్య ఆశీస్సులు.. మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి!

Date:

Maha Shivaratri 2026: దేశవ్యాప్తంగా ప్రజలు అందరూ ఈరోజు మహాశివరాత్రి పవిత్ర పండుగ జరుపుకుంటున్నారు. ఈ ఏడాది మహాశివరాత్రి పర్వదినం రోజున బుధాదిత్య, శుక్రదిత్య, లక్ష్మీ నారాయణ రాజ్యయోగంతో సహా అనేక శుభ యోగాలు ఏర్పడ్డాయని పండితులు చెబుతున్నారు. ఇంకా కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువుల నాలుగు గ్రహాల కలయిక కూడా ఏర్పడుతోందని చెప్పారు. జ్యోతిష్కుల ప్రకారం.. మహాశివరాత్రి నాడు ఈ ప్రత్యేక కలయికలు నాలుగు రాశుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయని వెల్లడించారు. ఈ నాలుగు రాశులు ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Ind vs Pak Asia Cup Rising Stars: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో.. పాక్ ను చిత్తుగా ఓడించిన భారత్

మేషరాశి: మహాశివరాత్రి నాడు శుభ గ్రహాల అమరిక మేష రాశి వారికి చాలా శుభప్రదంగా మారవచ్చని జ్యోతిష్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో వారి ఆర్థిక పరిస్థితి బలపడవచ్చు, దీనివల్ల వారికి ఆర్థిక లాభాలు లభిస్తాయని చెబుతున్నారు. వృత్తి, వ్యాపారంలో విజయం, పురోగతికి కొత్త అవకాశాలు సాధ్యమవుతాయని అన్నారు. సామాజిక ప్రతిష్ఠ, గౌరవం కూడా పెరగవచ్చని తెలిపారు. తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయన్నారు.

మకరరాశి: ఈ మహాశివరాత్రి రోజున, మకర రాశి వారు మహాశివుని ఆశీస్సులు పొందవచ్చన్నారు. ఆయన కృప ద్వారా, ఏదైనా అసంపూర్ణమైన పని పూర్తవుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం కావచ్చన్నారు. తగ్గిన ఖర్చులు పొదుపుకు దారితీయవచ్చ, లాభదాయకమైన పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు రావచ్చని చెప్పారు. మీరు మీ పాత స్నేహితుడిని తిరిగి కలవవచ్చని అన్నారు.

కుంభ రాశి: కుంభ రాశి వారికి తమ ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ ప్రయోజనం పొందవచ్చని చెబుతున్నారు. వ్యాపారంలో లాభాలు పెరగవచ్చని, ఉద్యోగస్థులు కొత్త అవకాశాలను పొందవచ్చని చెబుతున్నారు. కుంభ రాశి వారికి ఆర్థిక లాభాలు రావడంతో పాటు, వారి పిల్లలకు సంబంధించిన శుభవార్తలను కూడా అందుతాయన్నారు. ఈ రాశి వారు తమ కుటుంబంతో కలిసి అందమైన ప్రదేశానికి కూడా ప్రయాణించవచ్చని అన్నారు.

కన్య రాశి: ఈ సమయంలో కన్య రాశి వారు భూమికి సంబంధించిన విషయాల వల్ల ప్రయోజనం పొందవచ్చని చెబుతున్నారు. అలాగే ఈ రాశి వారు ఆర్థిక లాభాలను కూడా పొందే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ రాశుల వారు ప్రభావవంతమైన వ్యక్తిని కలవవచ్చని, వాళ్ల ఇంటికి అతిథులు కూడా వస్తారని చెప్పారు. ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు శివయ్య ఆశీస్సులతో కన్య రాశి వారికి సంబంధాలు బలపడవచ్చని అన్నారు.

READ ALSO: Maha Shivaratri Special: ఎన్టీఆర్ నుంచి మెగాస్టార్ వరకు.. శివుడి పాత్రలో ఒదిగిపోయిన హీరోలు వీళ్లే!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇറാനെതിരായ നാവിക ഉപരോധം ആഗോളതലത്തിലേക്ക് വ്യാപിപ്പിക്കാന്‍ അമേരിക്ക; ഹോര്‍മുസ് കടലിടുക്കില്‍ കര്‍ശന നിയന്ത്രണം

  വാഷിങ്ടണ്‍: ഇറാനെതിരെയുള്ള യുണൈറ്റഡ് സ്റ്റേറ്റ്‌സിന്റെ നാവിക ഉപരോധം ആഗോളതലത്തിലേക്ക് വ്യാപിപ്പിക്കുകയാണെന്ന്...

Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..

Off The Record: కాళేశ్వరం కేసులో సీబీఐ దర్యాప్తుపై రాజకీయ పార్టీలు...

ಒಳಮೀಸಲಾತಿ ಹಂಚಿಕೆಗೆ ಸರ್ವಾನುಮತದಿಂದ ಒಪ್ಪಿಗೆ: 56,432 ಹುದ್ದೆಗಳ ಭರ್ತಿಗೆ ಇದೇ ಅನುಪಾತ ಅನ್ವಯ- ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,24,2026 (www.justkannada.in):  ಒಳಮೀಸಲಾತಿ ಹಂಚಿಕೆಗೆ ಸಂಬಂಧ ಇಂದು ಅಂತಿಮ ನಿರ್ಧಾರ...