28
August, 2026

A News 365Times Venture

28
Friday
August, 2026

A News 365Times Venture

BCB: వరల్డ్ కప్ బహిష్కరణపై బంగ్లాదేశ్‌లో గందరగోళం.. ఎవరు బ్యాన్ చేయమన్నారో నో క్లారిటీ?

Date:

Bangladesh T20 World Cup Boycott Confusion: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో గందరగోళం నెలకొంది. ఇంతకీ టీ20 వరల్డ్ కప్‌ను ఎవరు చెబితే బహిష్కరించారు? అనేది వాళ్లకే తెలియడం లేదు! ఓవైపు ప్లేయర్స్ నిర్ణయం మేరకే బ్యాన్ చేశామని చెబుతున్నారు. మరోవైపు.. ప్రభుత్వం వల్లే వెనుదిరిగామని వాదిస్తున్నారు. అయితే.. ఒక రోజు ముందు మీడియాతో చెప్పిన మాటలకు మరుసటి రోజు స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి బంగ్లాదేశ్ క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్‌కు వచ్చింది. మంగళవారం మీడియాతో మాట్లాడిన నజ్రుల్, వరల్డ్ కప్‌ ఆడొద్దని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఆటగాళ్లే నిర్ణయించినట్లు చెప్పారు. ఈ వ్యాఖ్య వెంటనే చర్చకు దారి తీసింది. ఎందుకంటే ఇంతకుముందు భద్రతా కారణాల వల్ల ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మంగళవారం నజ్రుల్ మాట మార్చడంతో అసలు ఈ నిర్ణయం ఎవరిది? ప్రభుత్వం బాధ్యత తప్పించుకుంటుందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ విమర్శల మధ్య బుధవారం నజ్రుల్ మళ్లీ మీడియా ముందుకు వచ్చాడు. “వరల్డ్ కప్‌లో ఆడకూడదనే నిర్ణయం పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంది” అని మరోసారి మాట మార్చాడు. బీసీబీ, ప్లేయర్స్ వల్ల మ్యాచ్ బహిష్కరించినట్లు తాను చెప్పలేదని, తన మాటలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని కవర్ చేశాడు.

READ MORE: Lavanya Tripathi : మా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకోను.. ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన లావణ్య

నజ్రుల్ తాజాగా బుధవారం చెప్పిన వివరాల ప్రకారం.. జనవరి ప్రారంభంలోనే భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకుని భారత్‌కు జట్టును పంపకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని తాను గతంలోనూ పలుమార్లు చెప్పానని గుర్తు చేశారు. మొదటి వ్యాఖ్యలో బీసీబీ, ఆటగాళ్లే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పడంతో పెద్ద చర్చ మొదలైంది. ప్రభుత్వం బాధ్యతను బోర్డుపైకి నెట్టిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే తాజా వివరణలో నజ్రుల్, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బోర్డు, ఆటగాళ్లు ఎలాంటి అభ్యంతరం లేకుండా అంగీకరించారని చెప్పారు. వరల్డ్ కప్ బహిష్కరణ వల్ల ఆర్థిక నష్టాలు, మ్యాచ్‌ల కోత, శిక్షల అవకాశాలు ఉన్నప్పటికీ వారు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా నిలిచారని ప్రశంసించారు. జాతీయ భద్రత, గౌరవం దృష్ట్యా తీసుకున్న నిర్ణయానికి తోడుగా నిలిచిన కీర్తి వారిదే కొనియాడారు. ఈ వ్యాఖ్యలతో వరల్డ్ కప్‌ను బహిష్కరించమని ఎవరు చెప్పారో వాళ్లకే క్లారిటీ లేదని స్పష్టమవుతోంది!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಆ.29ಕ್ಕೆ ಡಾ. ಶಿವರಾತ್ರಿ ರಾಜೇಂದ್ರ ಶ್ರೀಗಳ 111ನೇ ಜಯಂತಿ: ಭಾಗಿಯಾಗಲಿದ್ದಾರೆ ಸಿಎಂ ಡಿಕೆಶಿ, ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಮೈಸೂರು, ಆಗಸ್ಟ್,27,2026 (www.justkannada.in): ಸುತ್ತೂರು ಜಗದ್ಗುರು ಶ್ರೀ ವೀರಸಿಂಹಾಸನ ಮಹಾಸಂಸ್ಥಾನ...

പിടികിട്ടാപ്പുള്ളി സുകുമാര കുറിപ്പിനെ തപ്പി വീണ്ടുമിറങ്ങും: ബ്രൂണോയിലെ വയോധികനെ കണ്ടെത്താന്‍ ചെന്നിത്തലയുടെ നിര്‍ദേശം: അന്വേഷണം ക്രൈം ബ്രാഞ്ചിന്

തിരുവനന്തപുരം: പിടികിട്ടാപ്പുള്ളി സുകുമാര കുറുപ്പിന്റെ രൂപ സാദൃശ്യമുള്ള വയോധികനെ ബ്രൂണോയില്‍ കണ്ടെത്തിയതിന്...

"மேகதாது அணை தமிழகத்திற்கே உதவும்; உச்ச நீதிமன்றத் தீர்ப்பைக் காப்பாற்றுவேன்" – கர்நாடக முதல்வர்

கர்நாடகாவின் முதலமைச்சராக டி.கே.சிவகுமார் பதவியேற்ற பின், தமிழ்நாட்டிலும், கர்நாடகாவிலும் மேகதாது அணைப்...

OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్

OTR: యాందిసామీ…. దుడ్లెట్టా…! ఎవుడు పెట్టుకుంటాడు? ఉమ్మడి చిత్తూరు జిల్లా కూటమిలో...