28
August, 2026

A News 365Times Venture

28
Friday
August, 2026

A News 365Times Venture

Najam Sethi: “మేము కాదు.. వాళ్లే వెనక్కి తగ్గారు”.. పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రెచ్చగొట్టే ప్రకటన!

Date:

Former PCB chairman Najam Sethi: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌పై ఓ క్లారిటీ వచ్చేసింది. తాము భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని పాకిస్థాన్ స్పష్టం చేసింది. ఇంతటితో వివాదం ముగిసిందని అందరూ అనుకున్నారు. అయితే.. తాజాగా ఈ వ్యవహారంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ నజామ్ సేథీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఈ విషయంలో పాకిస్థాన్ వెనక్కి తగ్గలేదని.. ఐసీసీయే ఒక అడుగు వెనక్కి వేసిందని వాదిస్తున్నారు. “నిజానికి ఐసీసీయే కొంచెం సడలించింది. బంగ్లాదేశ్‌పై కొంత అనుకూలంగా ప్రవర్తించాలని నిర్ణయించింది. పాకిస్థాన్ చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ఆడకపోతే ఎలాంటి శిక్షలు ఉండవని ముందే తెలుసుకున్నారు. దేశంలో, విదేశాల్లో ఉన్న ప్రముఖ న్యాయ నిపుణులతో మాట్లాడి ఈ నిర్ణయానికి వచ్చారు” అని సేథీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలు పాకిస్థాన్‌కు బలం ఇచ్చాయని సేథీ చెప్పారు. మహా అంటే ఒక పాయింట్ కోల్పోయేవాళ్లం. అంతకంటే పెద్ద నష్టం ఏమీ ఉండేది కాదు. ఇది ఐసీసీకి కూడా అర్థమైంది. అందుకే ఐసీసీ స్వయంగా ముందుకు వచ్చి చర్చలు ప్రారంభించింది. డిప్యూటీ చీఫ్ ఇమ్రాన్ ఖవాజా రంగంలోకి దిగారు. బంగ్లాదేశ్ అధికారులు చర్చలకు వచ్చారు. ఆ తర్వాతే పాకిస్థాన్ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించిందని వివరించారు.

READ MORE: UP: భార్య చనిపోయిన 2 ఏళ్లకు ‘ఓటీపీ’.. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..!

ఇక ఆర్థిక విషయంపై సేథీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ నిధులపై ఆధారపడేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు. ఇప్పుడు పీఎస్‌ఎల్ భారీగా ఎదిగిందని.. పీఎస్‌ఎల్ నుంచి వచ్చే ఆదాయం ఐసీసీ కంటే ఎక్కువ అని చెప్పారు. కాబట్టి పాకిస్థాన్‌కు వనరుల కొరత అనే సమస్య లేదన్నారు. ఈ విషయంలో ఎప్పుడూ ఒత్తిడి అనేది లేదని అని స్పష్టం చేశారు. అయినా.. ఇక ముందు కూడా ఐసీసీ నుంచి కొన్ని సడలింపులు లేదా లాభాలు పాకిస్థాన్‌కు దక్కవచ్చు. మార్చి నాటికి మీరు కొన్ని కొత్త నిర్ణయాలు చూడవచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. మొత్తానికి, పాకిస్థాన్ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలపై ఇరు వర్గాల కథనాలు భిన్నంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు ఇది చర్చల ఫలితమని ఐసీసీ వర్గాలు చెబుతుండగా, మరోవైపు పాకిస్థాన్ బలమైన స్థితిలో ఉండటమే మార్పుకు కారణమని సేథీ వాదిస్తున్నారు.

READ MORE: Pakistan vs USA: “ఇదెక్కడి దిక్కు మాలిన బౌలింగ్‌ రా మావా?”.. పాక్ బౌలర్‌పై ట్రోలింగ్స్..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പിടികിട്ടാപ്പുള്ളി സുകുമാര കുറിപ്പിനെ തപ്പി വീണ്ടുമിറങ്ങും: ബ്രൂണോയിലെ വയോധികനെ കണ്ടെത്താന്‍ ചെന്നിത്തലയുടെ നിര്‍ദേശം: അന്വേഷണം ക്രൈം ബ്രാഞ്ചിന്

തിരുവനന്തപുരം: പിടികിട്ടാപ്പുള്ളി സുകുമാര കുറുപ്പിന്റെ രൂപ സാദൃശ്യമുള്ള വയോധികനെ ബ്രൂണോയില്‍ കണ്ടെത്തിയതിന്...

"மேகதாது அணை தமிழகத்திற்கே உதவும்; உச்ச நீதிமன்றத் தீர்ப்பைக் காப்பாற்றுவேன்" – கர்நாடக முதல்வர்

கர்நாடகாவின் முதலமைச்சராக டி.கே.சிவகுமார் பதவியேற்ற பின், தமிழ்நாட்டிலும், கர்நாடகாவிலும் மேகதாது அணைப்...

OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్

OTR: యాందిసామీ…. దుడ్లెట్టా…! ఎవుడు పెట్టుకుంటాడు? ఉమ్మడి చిత్తూరు జిల్లా కూటమిలో...

ಬಿ.ನಾಗೇಂದ್ರ ಪಕ್ಷದ ಹಿತಕ್ಕಾಗಿ ಎಲ್ಲಾ ತ್ಯಾಗಕ್ಕೂ ಸಿದ್ದರಿದ್ದಾರೆ- ಸಿಎಂ ಡಿಕೆಶಿ

ನವದೆಹಲಿ,ಆಗಸ್ಟ್,27,2026 (www.justkannada.in):  ಸಚಿವ ಬಿ. ನಾಗೇಂದ್ರ ಪಕ್ಷದ ಹಿತಕ್ಕಾಗಿ ಎಲ್ಲಾ...