24
August, 2026

A News 365Times Venture

24
Monday
August, 2026

A News 365Times Venture

NED vs NAM: పాకిస్థాన్ను వెనక్కి నెట్టిన నెదర్లాండ్స్! నమీబియాపై ఘన విజయం..

Date:

NED vs NAM: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో నెదర్లాండ్స్ జట్టు నమీబియాపై భారీ విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ లో నెదర్లాండ్స్ 7 వికెట్ల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. ఫిబ్రవరి 12న ఇదే మైదానంలో టీమిండియాతో నమీబియా తలపడాల్సి ఉంది.

Balakrishna – Harish Shankar: గబ్బర్ సింగ్ డైరెక్టర్‌తో గాడ్ ఆఫ్ మాసెస్ సినిమా..! టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్ లోడింగ్?

ముందుగా బ్యాటింగ్ చేసిన నమీబియా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. నికోల్ లాఫ్టీ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ వైక్, లోగాన్ వాన్ బీక్ రెండు వికెట్లు.. ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్ లు చెరో ఒక వికెట్ తీశారు.

ఇక 157 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నెదర్లాండ్స్‌కు ఓపెనింగ్ అంతగా అనుకూలంగా లేకపోయింది. పవర్‌ ప్లే లోనే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే బాస్ డి లీడే అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరానికి నడిపించాడు. డి లీడే 48 బంతుల్లో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇది అతని టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో నాల్గవ అర్ధ సెంచరీ. మూడో వికెట్‌కు కాలిన్ అకెర్మాన్‌తో కలిసి 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన డి లీడే, అనంతరం కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్‌తో కలిసి నాల్గవ వికెట్‌కు అజేయంగా 43 పరుగులు జోడించాడు. దీంతో నెదర్లాండ్స్ జట్టు 18వ ఓవర్‌లోనే లక్ష్యాన్ని ఛేదించింది.

Natural Detox Foods: శరీర అవయవాలను సహజంగా శుభ్రం చేసే ఆహారాలు ఇవే.. మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్షణ!

ఈ టోర్నమెంట్‌లో నెదర్లాండ్స్‌ కు ఇది తొలి విజయం. అంతకుముందు వారు పాకిస్తాన్ చేతిలో ఓడిపోయారు. రెండు మ్యాచ్‌ల తర్వాత రెండు పాయింట్లు సాధించిన నెదర్లాండ్స్, మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా గ్రూప్-Aలో పాకిస్తాన్‌ను వెనకు నెట్టి రెండో స్థానానికి చేరుకుంది. పాకిస్తాన్ మూడో స్థానంలోకి దిగజారింది. ప్రస్తుతం గ్రూప్-Aలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

இலவச சிலிண்டர்: “3 சிலிண்டர்கள் தானா? மீதி எப்போது?" – டிடிவி தினகரன் கேள்வி

தமிழ்நாடு சட்டப்பேரவையில் மானியக் கோரிக்கை மீதான விவாதம் நடைபெற்று வருகிறது. 2...

Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం

Gachibowli Illegal Buildings: గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనతో...

VTU ಬೆಂಗಳೂರು ಕೇಂದ್ರಕ್ಕೆ ಜಪಾನ್ ನಿಯೋಗ ಭೇಟಿ, ಚರ್ಚೆ

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,24,2026 (www.justkannada.in): ಕೈಗಾರಿಕೆ–ಶೈಕ್ಷಣಿಕ ಸಂಸ್ಥೆಗಳ ಸಹಭಾಗಿತ್ವದ ಅವಕಾಶಗಳನ್ನು ಅನ್ವೇಷಿಸ ಸಲುವಾಗಿ...

ഘടക കക്ഷികളെ ഉള്‍കൊള്ളാനാവണം; പ്രതിപക്ഷ ഉപനേതാവ് പദവിയില്‍ പിണറായി വിജയനെതിരെ ഡി. രാജ

തിരുവനന്തപുരം: പ്രതിപക്ഷ നേതാവ് പിണറായി വിജയനെതിരെ വിമര്‍ശനവുമായി സി.പി.ഐ ദേശീയ സെക്രട്ടറിയും...