19
June, 2026

A News 365Times Venture

19
Friday
June, 2026

A News 365Times Venture

PM Modi: ‘‘నో విజన్, నో ఐడియా, నో ప్లాన్’’.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ధ్వజం..

Date:

PM Modi: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ, ఇటీవల పలు దేశాలతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్స్ గురించి సభకు వివరించారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య సభలో ప్రధాని ప్రసంగించారు. ఆయన ప్రసంగానికి నిరసనగా విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అయితే, ప్రధాని రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక వ్యవస్థపై విపక్షాలకు అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు, కాంగ్రెస్ పాలనలో బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని చెప్పారు. రాజ్యసభలో చర్చ జరిగే సమయంలో విపక్షాలు హుందాగా ఉండాలని, కానీ వారు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 9 దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని ప్రధాని వెల్లడించారు.

Read Also: Vivo V70 Launch: 6500mAh బ్యాటరీ, 50MP+50MP కెమెరా.. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో ‘వివో వీ70’ హై వోల్టేజ్ ఎంట్రీ!

ముఖ్యంగా కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఒప్పందాల గురించి మాట్లాడితే, ప్రజలకు బోఫోర్స్ గురించి ప్రస్తావించే వారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఆలోచనలు లేవు, విజన్ లేదు, ప్రణాళిక లేదు, వారు చేసిన గందరగోళాన్ని చక్కదిద్దడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధాని అన్నారు. యూపీఏ హయాంలో భారత్ 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, ఇప్పుడు నాలుగో స్థానంలో ఉందని, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతోందని చెప్పారు.

కాంగ్రెస్ హయాంలో పీఎస్‌యూలకు తాళాలు వేయాల్సిన పరిస్తితి వచ్చింది. దేశంలో రైతుల్ని కాంగ్రెస్ మోసం చేసిందని, దేశంలో ఉన్న సన్న, చిన్నాకారు రైతుల గురించి ఆ పార్టీ ఎప్పుడూ ఆలోచించలేదని, బీజేపీ మాత్రం కిసాన్ సమ్మాన్ నిధిని ఇస్తూ రైతులకు ఆసరాగా నిలుస్తోందని చెప్పారు.కాంగ్రెస్ హయాంలో వారు జేబులు నింపుకోవడానికి మాత్రమే సరిపోయిందని ఆరో్పించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని ప్రధాని అన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സി.പി.ഐ.എമ്മും ലീഗും കോണ്‍ഗ്രസും പിന്തുണയ്ക്കുന്ന സര്‍ക്കാര്‍; പക്ഷേ തമിഴ്നാട്ടില്‍ ഇസ്രാഈല്‍ റഡാറുകള്‍ നിര്‍മിക്കാനൊരുങ്ങുന്നു

ചെന്നൈ: തമിഴ്നാട്ടിലെ കൃഷ്ണഗിരി ജില്ലയില്‍ ഇസ്രഈല്‍ സര്‍ക്കാര്‍ ഉടമസ്ഥതയിലുള്ള ഇസ്രഈല്‍ എയ്റോസ്പേസ്...

7 எம்.எல்.ஏக்களுக்கு 5 பேருந்துகள்! – MLA ஸ்பெஷல் பஸ் நடைமுறை தேவையா?

சட்டமன்றக் கூட்டத்தொடர்கள் நடக்கும் போது சட்டமன்ற உறுப்பினர்களுக்கென சிறப்பு பேருந்துகள் இயக்கப்படும்....

JK EXCCLUSIVE: 10 ವರ್ಷಗಳ ಗುತ್ತಿಗೆ ಅವಧಿ ಪೂರ್ಣಗೊಂಡ ನಿವೇಶನಗಳಿಗೆ ಕ್ರಯಪತ್ರ

  ಬೆಂಗಳೂರು/ಮೈಸೂರು: ಮೈಸೂರು ನಗರಾಭಿವೃದ್ಧಿ ಪ್ರಾಧಿಕಾರ (ಮುಡಾ) ವತಿಯಿಂದ 2005ರ ನಂತರ...