16
July, 2026

A News 365Times Venture

16
Thursday
July, 2026

A News 365Times Venture

Gautam Gambhir: నా జీవితాంతం ఆ టెస్టు సిరీస్‌ ఓటమిని మర్చిపోలేను!

Date:

టీమిండియా హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. గంభీర్‌ హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాక ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్‌ 2025లను భారత జట్టు గెలుచుకుంది. కుర్రాళ్లతో కూడిన జట్టుతో ఇంగ్లాండ్‌ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌ను సైతం డ్రాగా ముగించాడు. అయితే కోచ్‌గా వచ్చిన కొత్తలో గౌతీ వరుస పరాజయాలు చవిచూశాడు. అందులో ముఖ్యమైంది ఏంటంటే… భారత గడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను ఓడిపోవడం. ఈ సిరీస్ ఫలితంపై గంభీర్ తాజాగా స్పందించాడు. తన జీవితాంతం న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ఓటమిని మర్చిపోలేను అని చెప్పాడు.

ఢిల్లీలో వెస్టిండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రాతో గౌతమ్‌ గంభీర్ ప్రత్యేకంగా మాట్లాడాడు. ‘స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ఓటమిని నా జీవితాంతం మర్చిపోలేను. ఇదే విషయాన్ని భారత జట్టు కుర్రాళ్లకూ చెప్పాను. ఆ ఓటమిని వదిలేసి ముందుకు సాగాలి. అయితే గతాన్ని కూడా మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. గతాన్ని మర్చిపోతే.. దేనినైనా తేలికగా తీసుకొనే అవకాశం ఉంటుంది. ఆటలో గెలుపు, ఓటమీ సహజమే. నేను డ్రెస్సింగ్‌ రూమ్‌లో భారత ఆటగాళ్లకు ఎప్పుడూ న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌లో ఏం జరిగిందో వివరిస్తుంటా. ప్రత్యర్థికి అస్సలు అవకాశం ఇవ్వకూడదదని నేను అనుకుంటా’ అని గంభీర్ తెలిపాడు.

Also Read: Sai Sudharsan Catch: సాయి సుదర్శన్‌ సూపర్ క్యాచ్.. దెబ్బ గట్టిగా తాకినా వదలలేదు!

‘ప్రపంచంలోనే నంబర్ 1 జట్టుగా మారాలనుకుంటే స్వదేశంలో గెలిస్తే చాలదు. విదేశాల్లోనూ విజయాలు సాదించాలి. ప్రస్తుతం ఉన్న యువ జట్టు అదే చేస్తోంది. ఇంగ్లాండ్‌ అత్యంత కఠినమైన సవాల్‌ విసిరే టీమ్‌. అందులోనూ వారి సొంతగడ్డపై అత్యంత ప్రమాదకారి. ఇంగ్లాండ్‌కు పెద్దగా అనుభవం లేని జట్టుతో వెళ్లాం. మన ప్లేయర్స్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. కేవలం ఫలితం మాత్రమే చూడకూడదు, ఎలాంటి పోరాటం చేశామనేది కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే స్వదేశంలో గెలిస్తే చాలదు. కేవలం మన దగ్గరే విజయాలు సాధిస్తే ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలవలేం’ అని గౌతమ్‌ గంభీర్ చెప్పుకొచ్చాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

‘നീ മുസ്‌ലിം അല്ലേ’ എന്ന് ചോദിച്ച് കുത്തിയത് 15 തവണ; ഇന്ത്യന്‍ യുവാവിന് നേര്‍ക്ക് യു.എസില്‍ വംശീയ ആക്രമണം

വാഷിങ്ടണ്‍: യുഎസിലെ യൂട്ട സംസ്ഥാനത്ത് ഇന്ത്യക്കാരനായ യുവാവിന് നേര്‍ക്ക് വംശീയ ആക്രമണം....

தரையில் அமரும் பயணிகள்; மூக்கை பிடிக்கும் அளவுக்கு சுகாதார சீர்கேடு- பெரம்பலூர் பேருந்து நிலைய அவலம்

பெரம்பலூர் புதிய பேருந்து நிலையத்தில் மாணவர்கள், பணிக்குச் செல்வோர், ஊர்களுக்குச் செல்வோர்...

HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!

HMDA Chief Engineer Asset: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA)...

ಚಿನ್ನಸ್ವಾಮಿ ಕ್ರೀಡಾಂಗಣ ದುರಂತ: ಐಪಿಎಸ್ ಅಧಿಕಾರಿ ಬಿ. ದಯಾನಂದ ವಿರುದ್ಧದ ಇಲಾಖಾ ತನಿಖೆ ಕೈಬಿಟ್ಟ ಸರ್ಕಾರ

ಬೆಂಗಳೂರು, ಜುಲೈ,14,2026 (www.justkannada.in): 2025ರ ಜೂನ್ 4ರಂದು ಬೆಂಗಳೂರಿನ ಚಿನ್ನಸ್ವಾಮಿ...