12
September, 2026

A News 365Times Venture

12
Saturday
September, 2026

A News 365Times Venture

Trump-Modi: రేపటి నుంచి ట్రంప్ కొత్త సుంకం అమలు.. భారత్ స్పందన ఇదే!

Date:

భారత్-అమెరికా మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు నడిచాయి. భారత్ మంచి స్నేహితుడు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. కానీ సుంకాలు కారణంగా ఆ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తొలుత భారత్‌పై ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. ఇంతలోనే మరో బాంబ్ పేల్చారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా భారత్‌పై మరో 25 శాతం సుంకం విధించారు. ఇది ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుందని ట్రంప్ తెలిపారు. దీంతో ఆసియాలోనే భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉన్న స్నేహాన్ని చెడగొట్టింది.

ఇది కూడా చదవండి: Rajasthan: వరకట్న పిశాచికి మరొకరు బలి.. కుమార్తెతో సహా లెక్చరర్ సజీవదహనం

అయితే కొత్త సుంకం ఆగస్టు 27 అర్ధరాత్రి 12:01 గంటల నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు అమెరికా అధికారికంగా బహిరంగ నోటీసు పంపించింది. ఆగస్టు 27న అర్ధరాత్రి నుంచి 50 శాతం సుంకం అమలవుతున్నట్లుగా నోటీసులో స్పష్టం చేసింది. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ద్వారా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 6న సంతకం చేయబడిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు 14329ను అమలు చేస్తున్నట్లు నోటీసులో పేర్కొంది.

ఇది కూడా చదవండి: Upasana : హోదా కాదు, కీర్తి కాదు.. నన్ను నేను నిలబెట్టిన శక్తి ఇదే

ఇదిలా ఉంటే ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇరు దేశాధినేతలతో చర్చలు జరిపారు. కానీ చర్చలు కొలిక్కి రావడం లేదు. పుతిన్‌ షరతులు విధించడంతో సమస్య పరిష్కారానికి రావడం లేదు. ఈ నేపథ్యంలో రష్యాతో సంబంధాలు పెట్టుకున్న దేశాలపై భారీ సుంకాలు విధించి ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పటికే భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. అలాగే మిగతా దేశాలపై కూడా సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే చైనా కూడా రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తోంది. కానీ చైనాపై మాత్రం జరిమానా విధించలేదు. కేవలం భారత్‌పైనే భారీ సుంకం విధించారు.

ఇదిలా ఉంటే ప్రధాని మోడీ సోమవారం అహ్మదాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుల కోసం ఎంత ఒత్తిడైనా తట్టుకుంటామని.. కావాల్సినంత శక్తిని పెంచుకుంటామని చెప్పారు. చిన్న వ్యాపారవేత్తలు, రైతులు, పశువుల పెంపకందారులకు ప్రభుత్వం హాని చేయదని చెప్పారు. ఇక ఇదే అంశంపై మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం అత్యున్నత సమావేశం నిర్వహిస్తోంది. 50 శాతం సుంకాల కారణంగా ఎదురయ్యే పరిస్థితులపై అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಹೊಸಕಡಜೆಟ್ಟಿ ಮಹದೇವಮ್ಮ ಸಾವು ಪ್ರಕರಣ: ಮೃತಳ ಮಗಳಿಗೆ ₹4.12 ಲಕ್ಷ ಪರಿಹಾರ

ಮೈಸೂರು,ಸೆಪ್ಟಂಬರ್,11,2026 (www.justkannada.in):  ನಂಜನಗೂಡು ತಾಲೂಕಿನ ಹೊಸಕಡಜೆಟ್ಟಿ ಗ್ರಾಮದ ಮಹದೇವಮ್ಮ ಅವರ...

മോദിയുടെ സ്വയം പുകഴ്ത്തല്‍ വേണ്ട; റഷ്യയുമായുള്ള ബന്ധത്തിന് നീണ്ട ചരിത്രമുണ്ട്: കോണ്‍ഗ്രസ്

ന്യൂദല്‍ഹി: പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദിയുടെ സ്വയം പ്രചാരണം എന്തുതന്നെയായാലും ഇന്ത്യയും റഷ്യയും...

“சுயநலத்தை மறுத்து நாட்டின் நலனைப் பார்த்தால் தடை?” – BRICS-ல் ட்ரம்ப் மீது புதின் மறைமுகத் தாக்கு!

டெல்லியில் நடக்கும் பிரிக்ஸ் மாநாட்டிற்காக இந்தியாவிற்கு வந்திருக்கிறார் ரஷ்ய அதிபர்...

Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..

Raghav Chadha: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై...