3
May, 2026

A News 365Times Venture

3
Sunday
May, 2026

A News 365Times Venture

HHVM Song: హరిహర వీరమల్లు పవర్‌ఫుల్‌ పాట లిరికల్‌ వచ్చేసిందోచ్…

Date:

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో మొదలైన హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రీమియర్‌ల ద్వారా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా అనేకసార్లు వాయిదా పడుతూ వస్తూ ఉండటంతో క్రిష్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో నిర్మాత రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యి సినిమా పూర్తి చేశారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ప్రీమియర్‌లతో 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. కొందరు అద్భుతంగా ఉందని కొనియాడుతూంటే.. మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

READ MORE: India-UK Trade Deal: ఇండియా-యూకే ట్రేడ్ డీల్.. ఏ వస్తువుల ధరలు తగ్గుతాయంటే..

హరిహర వీరమల్లు రిలీజ్‌తో బాక్సాఫీసు వద్ద సందడి నెలకొంది. తాజాగా సినీ బృందం సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ మూవీలోని పవర్‌ఫుల్‌ పాట లిరికల్‌ను విడుదల చేసింది. ‘సలసల మరిగే నీలోని రక్తమే’ అంటూ ఈ పాట లిరికల్ వీడియో యూట్యూబ్‌లో పంచుకున్నారు. ఈ పాటను చైతన్య ప్రసాద్‌ రాయగా.. సాయిచరణ్‌ భాస్కరుని, లోకేశ్వర్‌, పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ తదితరులు ఆలపించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఈ పాటకు సంగీతం అందించారు.

READ MORE: Jio: డేటా ఎక్కువగా యూజ్ చేస్తారా? మీ కోసమే ఈ ప్లాన్.. నెలకు రూ. 276 మాత్రమే.. డైలీ 2.5జీబీ, అన్ లిమిటెడ్ కాల్స్

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

തെരഞ്ഞെടുപ്പ് കഴിഞ്ഞു, ബി.ജെ.പി തനിനിറം കാണിച്ചു; പാചകവാതക വിലവര്‍ധനവില്‍ പ്രതിഷേധത്തിന് ആഹ്വാനവുമായി സി.പി.ഐ.എം

  തിരുവനന്തപുരം: വാണിജ്യ പാചകവാതക വില കുത്തനെ കൂട്ടിയ കേന്ദ്ര സര്‍ക്കാര്‍...

Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్‌డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు చరమగీతం..?

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ వేదికలు, వివాదాస్పద ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌పై బీసీసీఐ...

ಕಲಬುರಗಿ ಡಿಸಿ ಸೇರಿ ನಾಲ್ವರು IAS ಅಧಿಕಾರಿಗಳ ವರ್ಗಾವಣೆ

ಬೆಂಗಳೂರು,ಮೇ,2,2026 (www.justkannada.in): ಕಲಬುರಗಿ ಜಿಲ್ಲೆ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಯಾಗಿದ್ದ ಫೌಜಿಯಾ ತರಣಮ್ ಬಿ...